"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తూర్పుకాపులు

From tewiki
Jump to navigation Jump to search

తూర్పుకాపు, గాజులకాపు ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం[1]. గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని తూర్పుకాపులకు మాత్రమే బిసి కుల సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తూర్పుకాపులను బిసిల జాబితాల్లో చేర్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు. పాలకొల్లు తదితర ప్రాంతాల్లోకూడా వీరి జనాభా అధికంగా ఉంది. బలిజ , తెలగ , ఒంటరి, రెడ్లు కూడా తమ కులం కాపు గానే పేర్కొంటారు కానీ ఒకరినొకరు పెళ్ళి చేసుకోరు. కాపులు తూర్పుకాపులు మున్నూరుకాపులు క్రమంగా వియ్యమందుతూ కలిసిపోతున్నారు. కోస్తా జిల్లాలలో వీరిని తెలగ కాపు అని, రాయలసీమలో వీరిని బలిజ అని, తెలంగాణ మున్నూరుకాపులు అని వ్యవహరిస్తారు. సినీ నటులు చలం, రామకృష్ణ తూర్పుకాపులే.

తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా యూనిట్ ఈ కులాన్ని బి.సి.డి నుండి మార్చి బిసి-ఎ హోదాను కూడా కోరింది.[2]

మూలాలు

  1. "Caste in Andhra". www.vepachedu.org. Retrieved 2020-09-25.
  2. "Turpu Kapus seek BC-A status". The Hindu (in English). 2016-10-16. ISSN 0971-751X. Retrieved 2020-09-25.