తదియ

From tewiki
(Redirected from తృతీయ)
Jump to navigation Jump to search

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో మూడవ తిథి తదియ లేదా త్రితీయ. అధి దేవత - గౌరి.

తదియ నిర్ణయం

ధర్మ సింధు[1] ప్రకారం గౌరీ వ్రతాదులలో తదియకు లేశమైనను విదియ కలియరాదు. మరునాడు చవితి కొద్దిగా కలిసివున్నా గౌరీదేవికి తదియగా గుర్తించాలి.

ఇతర వ్రతాలలో తొలిరోజున మూడు ముహూర్తముల కాలం విదియ ఉండి, ఆ రోజున మూడు ముహూర్తముల కాలం తదియ ఉంటే పూర్వదినాన్ని తదియగా గుర్తించరాదు. కేవలం ద్వితీయవేధ ఎక్కువ ఉన్నప్పుడే ఇలా గ్రహించాలి. లేనపుడు పరదినమే గ్రహించాలి.

పండుగలు

  1. చైత్ర శుద్ధ తదియ - మత్స్య జయంతి
  2. ఉండ్రాళ్ళ తద్ది (తదియ).
  3. అట్ల తద్ది (అట్ల తదియ).
  4. అక్షయ తదియ (వైశాఖ శుద్ధ తదియ)

మూలాలు

  1. తదియ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.