"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2001
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని తెలంగాణ ఉద్యమం తో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి) |
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్ 27 న అధికారికంగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చెయ్యడంతో ప్రారంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షర బద్ధం చేసే విధం ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వాస్తవాల నివేదిక ఇది.
రెండవ తెలంగాణా ఉద్యమ ప్రస్థానం | |
2001 - 2002 - 2003 | |
2004 - 2005 - 2006 | |
తెలంగాణా ------- ఉద్యమం | |
కె సి ఆర్ - నరేంద్ర - జయశంకర్ |
ఏప్రిల్
- ఏప్రిల్ 27: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, కె చంద్రశేఖర రావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర స్థాపనకై ఉద్యమించాడు. ఇందుకు గాను తెలంగాణా రాష్ట్ర సమితి పేరిట ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. శాసనసభకు పూర్వపు సభాపతి - జి నారాయణ రావు కూడా ఆయనతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. మే 17 న కరీంనగర్లో నిర్వహించే తెలంగాణా సింహగర్జన ద్వారా తమ బలప్రదర్శన చేస్తామని ఆయన ప్రకటించాడు.
మే
మే 2: తెలంగాణా రాష్ట్రం కొరకు జరిపే ఉద్యమం శాస్త్రీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరుగుతుందని, ఇతర ప్రాంతాల ప్రజలు భయపడనవసరం లేదని చంద్రశేఖర రావు చెప్పాడు.