తెలంగాణ గ్రంథాలయ పరిషత్

From tewiki
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ గ్రంథాలయ పరి షత్ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ కి ఛైర్మన్ గా అయాచిత శ్రీధర్[1] నియమించబడ్డారు ఇండియన్‌ పబ్లిక్‌ లైబ్రరీ మూవ్‌ మెంట్‌ (గ్లోబల్‌ లైబ్రరీస్‌, బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వారు నాస్కామ్‌ ఫౌండేషన్‌ మద్దతుతో) స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పౌర గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ప్రజలకు అందించుటకు చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో అంతర్జాల సేవలను, కంప్యూటర్‌ సేవలను ఉచితంగా చదువరులకు అందిస్తున్నది. చదువరులకు అవసరమైన పుస్తకాలను (పోటీ పరీక్షలకు, దిన, మాస పత్రికలు, పీరియాడికల్స్‌) ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో తెస్తున్నవి. నూతన జిల్లాల అవిర్బావం తరువాత ప్రతి జిల్లాలో భవన నిర్మాణం, హైదరాబాదు మహానగరం లో నాలుగు ప్రధాన గ్రంథాలయాలు నిర్మాణం చేపట్టింది. ఉద్యోగులకు నైపణ్యాలు పెంపొందించడానికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టుతున్నది. ఇదే కాక గ్రంథాలయ ఉద్యమంకు సంబంధించి జాతీయ సదస్సుల నిర్వహణకు తోడ్పాటునందిస్తోంది[2] తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ కి అయాచిత శ్రీధర్ నియమించబడ్డారు

తెలంగాణ గ్రంథాలయాల విశిష్టత[3]

గ్రంథాలయం ఒక సజీవ మూర్తి, ఒక చైతన్య స్రవంతి. మన చరిత్రలో, సంస్కృతిలో, జాతీయ సంపదలో ఒక ముఖ్య భాగం. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రజలను మేలుకోలిపె జాగృతజ్యోతులుగా, సామాజిక విజ్ఞాన కేంద్రాలుగా, సాంఘిక ఉద్యమాలకు వ్యూహ నిర్మాణ స్థావరాలుగా గ్రంథాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. సామాజిక వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపడానికి, వాటిని సవరించడానికి, ప్రజలలో చైతన్యం పెంచడానికి, స్వాతంత్య్ర ఉద్యమానికి గాని, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు, సామాజిక ఉద్యమాలకు ఈ గ్రంథాలయాలు కేంద్ర బిందువుగా ఉన్నాయి ,ఉద్యమాలులు ఊపిరిలూదడానికి నాడు తెలంగాణ వ్యాప్తంగా మారు మూల పల్లెలలో సైతం అనేక గ్రంథాలయాలు స్థాపించారు.

తెలంగాణ ప్రాంతం అనేక సాంప్రదాయాలకు, సంస్క?తులకు, అచార వ్యవహారలకు, భాషలకు నిలయం. అందుకే ధాశరథి ”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నారు. నాడు ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన గ్రంథాలయోద్యమానికి వచ్చిన ఊతం తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయోద్యమానికి రాలేదు. కారణం, నిరంకుశుడైన నిజాము ప్రభుత్వపాలన, నిరక్షరాస్యత. తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయోద్యమంతో పాటు ప్రజా ఉద్యమాలు అనేక ఆటు పోటులకు గురికావలసి వచ్చింది. కనీసం నలుగురు ఒక చోట గుమికూడి మాట్లాడుకోవడానికి, రాజకీయాలు చర్చించుకోవాలి అన్నా, గ్రంథాలయం ఏర్పరుచు కోవాలన్నా ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. నాడు గ్రంథాలయాల స్థాపన ప్రధాన ఉద్దేశ్యం తెలుగు భాషను రక్షించాలని, ఆక్షరాస్యతను పెంపొందించాలని. అందుకోసమే నాడు గ్రంథాలయాలకు ఆంధ్ర భాషా నిలయాలు అని నామకరణం చేయడం జరిగింది.

1927 నాటికి తెలంగాణ లో గ్రంథాలయాలు

1927 నాటికి తెలంగాణ ప్రాంతంలో 63 పైగా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో జిల్లాల వారిగా పరిశీలిస్తే హైదరాబాదు-7, సికింద్రాబాద్‌-4, వరంగల్లు-15,

కరింనగర్‌-9, నల్లగొండ-13, మహబూబ్‌నగర్‌ -5, మెదక్‌ -5, నిజామాబాదు-1, అదిలాబాదు -1, రాయచూర్‌-1. గ్రంథాలయోద్యమం తప్ప ఏ ఉద్యమం లేని రోజుల్లో ఈ ఉద్యమం అన్ని ఉద్యమాలకు కాణాచి అయింది.


తెలంగ ఇలాంటిాంటి చరిత్ర ప్రసిద్ధి గాంచిన విజ్ఞాన మందిరాలు ఈ పోరాటాల గడ్డలో ఇప్పటికి శతవసంతాలు పూర్తి చేసుకున్న గ్రంథాలయాలు 25 కి పైగా వున్నాయి. ఈ గ్రంథాలయాలకు సమైక్య పాలనలో ఆలనా పాలన కరువైంది. మళ్లి వీటిని దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మే ప్రయత్నం వైపు తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ ఆడుగులు వేస్తున్నది.

తెలంగాణలో గ్రంథాలయాల అభివృద్దికి తమ జీవితాన్ని ధారపోసిన వారిలో వట్టికోట ఆళ్వారు స్వామి ప్రథమ స్థానం ఆక్రమించగా, తరువాత కోదాటి నారాయణరావు, రావి చెట్టు రంగా రావు, సురవరం ప్రతాపరెడ్డి, బోవేరా.

రావి చెట్టు రంగారావు

ఉద్యమ నాయకునిగా ఈ తెలంగాణ సమాజానికి దిశానిర్దేశం చేసిన వైతాళికులుగా, శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రభాషానిలయం, రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపనలో వారి పాత్ర, వారి జీవితం ముందు తరాల వారికి ఒక విజ్ఞాన ఘని, తెరచిన వోయి.

వట్టికోట అళ్వారు స్వామి

ఒక తెలుగు రచయితగా, గ్రంథాలయ అభివృద్ధి కర్తగా, పాత్రికేయుడిగా, ప్రచురణకర్తగా గుర్తింపు పొందారు. పుస్తకాలను (విజ్ఞానాన్ని) తన భుజాల మీద (పండ్లను ఏ విధంగా బుట్టలలో తీసుకవెళ్లి ప్రజలకు అమ్ముతారో) మోసుకపొయి పల్లె పల్లెన చేరవేస్తూ వ్యక్తి వ్యక్తికి పంచిపెడుతూ విజ్ఞానాన్ని పంచిన సాహితీ మూర్తి మన అళ్వారు స్వామి, మరీ ముఖ్యంగా తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమానికిిికి, అభివ?ద్ధికి వారు చెసిన సేవ ఎనలేనిది. వట్టికోట ఆళ్వారు స్వామి. పేరు గ్రంథాలయోద్యమ లోకంలో సరైన స్థానాన్ని అక్రమించకున్నా భారత సమాజంలో ఒక గాంధీజి పేరు ఎలా ప్రాకిందో అలా చరిత్ర పుటలలో, తెలంగాణ చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్యంలో, సాంప్రదాయాలలో, తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో వినిపించాల్సిన, కనిపించాల్సిన అవశ్యకత ఉంది, ఎందుంటే అంతటి ప్రజా సేవ వారిది, ఇతను చివరి క్షణం వరకు తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయ స్థాపనకు, గ్రంధాలయాల అభివృద్ధిి. సేవ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం వీరు గ్రంథాలయాలకు చేసిన సేవకు గుర్తుగా నగర కేంధ్ర గ్రంథాలయానికి వట్టి కోట అళ్వారు స్వామిగా నామకరణం చేసింది.

కోదాటి నారాయణ రావు

స్వాతంత్య్ర ఉద్యమకారుడిగా, గాంధేయవాదిగా, గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తగా ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. చిన్న తనం నుండే స్వాతంత్య్ర ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, సహకార ఉద్యమం, ఖాదీ ఉద్యమం, వయోజన విద్య వ్యాప్తికి జీవితాన్ని ధారపోశారు. ఇల్లు ఇల్లు తిరిగి గ్రంథాలయం స్థాపన కోసం చందాలు వసూలు చెసి మరీ ప్రారంభించారు. ఈ గ్రంథాలయాలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి (మెగా ఫోనులో వాడ వాడల తిరుగుతు గ్రంథాలయానికి రమ్మని, గోడలపై పోస్టర్లు కూడ అంటించే వారు) వారు చేయని ప్రయత్నం లేదు. వీరు ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని, అంధ్ర విజ్ఞాన నికేతనం, బాల సరస్వతి ఆంధ్రభాషా నిలయం లకు పక్కా భవనాలు నిర్మించడం వాటి అభివృద్ధిి. కి అనిర్వచనీయమైనైన సేవచేశారు.

తోటపల్లి గాంధీ, కరీంనగర్‌ గాంధీ, అని పేరు గాంచిన బోయిన పల్లి వెంకటరామారావు (బోవెరా)

తెలంగాణాలో సాగిన జాతీయ ఉద్యమంలో పల్లె పల్లెకు గ్రంథాలయాలను స్థాపించి, గ్రంథాలయ ఉద్యమంలో వారి స్థానం అజరామయం. గ్రంథాలయాల మీద ప్రేమతో వారు చాలా సార్లు సభల్లో, సమావేశాలలో ”నన్ను నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినవి గ్రంథాలయాలే. నాకు నా తల్లి మొదటి జన్మ నిస్తే రెండవ జన్మని గ్రంథాలయాలు ప్రసాదించాయి” అని పలు మార్లు చెప్పే వాడు. అందుకే వారు మూడు దశాబ్దాలు పై గా జిల్లా గ్రంథాలయ పరిషత్‌ సభ్యులుగా, కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయ సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడుడు కరీంనగర్‌ పరిసర గ్రామాలల్లో చాలా (దాదాపు 50) గ్రంథాలయాలు స్థాపించారు. 1976లో సొంతంగా ప్రభుత్వ భూమిని సేకరించి కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయ భవనాన్ని సొంతంగా నిర్మించారు. 1939లో ఆంధ్ర విజ్ఞాన వర్దిని, పేరుతో గ్రంథాలయం తన సొంత గ్రామంలో స్థాపించారు.


సురవరం ప్రతాప రెడ్డి తొలి గ్రంథ పాలకుడిగా సేవలందించారు

సురవరం ప్రతాప రెడ్డి, రెడ్డి వసతి గృహ తొలి వార్డెన్‌. తొలి గ్రంథ పాలకుడిగా సేవలందించారు.ఈ గ్రంథాలయంలో సురవరం రాక పూర్వం దాదాపు 1000 పుస్తకాలు ఉండేవి. 1926 నాటికి 11,000 గ్రంథాలు సేకరించారు. అయితే ఒక ప్రజా సంస్థలో 11,000 గ్రంథాలు ఉండటం గొప్ప విషయం.

నాడు అనేక గ్రంథాలయ వార్షికోత్సవాలకు, నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహా సభలకు అతిథిగా సురవరం హాజరైనారు.

సమైక్య పాలనలో మన తెలంగాణలో దాదాపు గ్రామ గ్రంథాలయాలు(105), బ్రాంచ్‌ గ్రంథాలయాలు (562), బుక్‌ డిపాజిట్‌ సెంటర్లు (1254), జిల్లా కేంద్ర గ్రంథాలయాలు (31), రీజనల్‌ గ్రంథాలయాలు (2), రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఉండగా,

ఉన్న పౌర గ్రంథాలయాలు అభివ?ద్ధి చేసిన దాఖలాలు లేవు. ఉన్న చారిత్రిక విజ్ఞాన ఘనులు (గ్రంథాలయాలు) చితికి పోయి అచేతనంగా కాలం వెళ్ళబుచ్చాయి. మన తెలంగాణ రాష్ట్ర అవిర్బావం తరువాత తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ వాటికి పునర్జీవనం కలిపించే ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్‌ పబ్లిక్‌ లైబ్రరీ మూవ్‌ మెంట్‌ (గ్లోబల్‌ లైబ్రరీస్‌, బిల్‌ , మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వారు నాస్కామ్‌ ఫౌండేషన్‌ మద్దతుతో) స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పౌర గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపాలి అని, మారుతున్న కాలంతో పాటు అధునిక హంగులు, సౌకర్యాలు కల్పించాలి అని, ప్రతి మారుమూల పల్లెలోకి గ్రంథాలయాల సేవలు వ్యాపింపచేయాలనే క?త నిశ్చయంతో. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ప్రజలకు అందించాలి అని దృఢ సంకల్పంతో పని చేస్తున్నది.


నూతన జిల్లాల అవిర్బావం తరువాత ప్రతి జిల్లాలో పక్కా భవన నిర్మాణానికి స్థలాన్ని, నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినది. అదేవిధంగా కె. తారక రామారావు పురపాలక, ఐటి శాఖ మాత్యులుగా పనిచేసిన సమయంలో హైదరాబాదు మహానగరం చుట్టూ నాలుగు ప్రధాన గ్రంథాలయాలు నిర్మించాలని వాటికి నిధులు కేటాయించారు.

ఇవీ చూడండి

మూలాలు

  1. "https://web.archive.org/web/20180910085812/https://www.ntnews.com/telangana/www.namasthetelangaana.com/telangana/library-parishad-chairman-ayacitam-sridhar-1-2-536844.aspx". Cite journal requires |journal= (help); External link in |title= (help)
  2. https://web.archive.org/web/20200113235907/http://magazine.telangana.gov.in/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%8C%E0%B0%B0%E0%B0%AD%E0%B0%82/. Missing or empty |title= (help)
  3. http://magazine.telangana.gov.in/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%8C%E0%B0%B0%E0%B0%AD%E0%B0%82/. Missing or empty |title= (help)