"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్
Jump to navigation
Jump to search
180px | |
స్థాపన | జనవరి 6, 2016 |
---|---|
ప్రధాన కార్యాలయాలు | హైదరాబాద్, తెలంగాణ |
నాయకుడు | డా. ఈ. రవీంద్రారెడ్డి, చైర్మన్ |
ప్రధానభాగం | మండలి |
అనుబంధ సంస్థలు | తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ |
జాలగూడు | అధికారిక జాలగూడు |
తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రంలో వైద్య విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌన్సిల్. కొత్త వైద్యుల నమోదు, సీనియర్ వైద్యుల రెన్యూవల్స్, వైద్య ప్రమాణాల పాటింపు, నిరంతర వైద్య విద్య కార్యక్రమాలన్నీ ఈ కౌన్సిల్ పరిధిలోనే జరుగుతాయి.[1]
కౌన్సిల్ ఏర్పాటు - సభ్యులు
తెలంగాణ ప్రభుత్వం 2016, జనవరి 6న ఈ మెడికల్ కౌన్సిల్ ను ఏర్పాటుచేసి డా. ఈ. రవీంద్రరెడ్డిని చైర్మన్ గా, డా. వి. రాజలింగంని వైస్ చైర్మన్ గా నియమించింది. అంతేకాకుండా ఇతరులతో కలిసి కౌన్సిల్ కమిటీని ఏర్పాటుచేసింది.[2]
కౌన్సిల్ ఉపయోగం
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత పొందిన వైద్యుల జాబితాను తయూరుచేస్తుంది.
- ప్రభుత్వంకు మరియు వైద్య వృత్తికి అనుసంధానంగా, నియంత్రణ సంస్థగా ఇది పనిచేస్తుంది.
- వైద్యుల పేర్ల నమోదుతోపాటు వైద్యులంతా నియమ నిబంధనలు, వైద్య ప్రమాణాలు పాటించేలా చూస్తూ, ఉత్తమ వైద్య పద్ధతులను ప్రోత్సహిస్తుంది.
- చికిత్సలో వైద్యులు తప్పు చేసినట్లు నేరం రుజువైతే చర్య తీసుకుంటుంది.
- వైద్య విద్య మరియు శిక్షణలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది.
ఇతర వివరాలు
- వైద్యసేవలు అందించాలనుకునే వారు ముందుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
- ఎంబీబీఎస్ పూర్తికాగానే రిజిస్టర్ చేసుకున్నవారికి ప్రాక్టీసు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది.
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (7 January 2016). "తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు." Retrieved 5 July 2018.
- ↑ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జాలగూడు. "Executive Members". www.tsmconline.in. Retrieved 5 July 2018.