తెలుగు సాహిత్యం - ఆధునిక యుగము

From tewiki
Jump to navigation Jump to search
175px
తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు క్రీ.శ. 1000 వరకు
నన్నయ యుగము 1000 - 1100
శివకవి యుగము 1100 - 1225
తిక్కన యుగము 1225 - 1320
ఎఱ్ఱన యుగము 1320 – 1400
శ్రీనాధ యుగము 1400 - 1500
రాయల యుగము 1500 - 1600
దాక్షిణాత్య యుగము 1600 - 1775
క్షీణ యుగము 1775 - 1875
ఆధునిక యుగము 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో 1875 తరువాతి కాలాన్ని ఆధునిక యుగము అంటారు.

రాజకీయ, సామాజిక నేపథ్యం

యుగంలో తెలుగు సాహిత్యం ప్రక్రియ, వస్తువు, శైలి తదితర అంశాల పరంగా విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. ఈ మార్పుల వెనుక పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలు, ప్రభావాలు ఉన్నాయి. ఆంగ్ల భాష అధ్యయనం, పాశ్చాత్య భావాలను తెలుగు సాహితీవేత్తలు తెలుసుకోవడం వంటివి కథ, నవల వంటి కొత్త ప్రక్రియలను అభివృద్ధి చేసేందుకు ఉపకరించింది. గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి వ్యవహార భాషావాదులు వివిధ కష్టనిష్టూరాలకు ఓర్చి వ్యవహారభాషను విద్యాభ్యాసం, సాహిత్యసృష్టి వంటివాటికి ఉపయోగించేలా కృషిచేశారు. వస్తువు విషయంలో అభ్యుదయ వాదులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం, కమ్యూనిజం వంటి రాజకీయ ఉద్యమాలు, ఆర్యసమాజం, బ్రహ్మసమాజం తదితర సామాజిక ఉద్యమాలు తెలుగు సాహిత్యాన్ని లోతుగానూ, విస్తృతంగానూ ప్రభావితం చేశాయి. ఆంగ్ల సాహిత్యాధ్యయనం వల్ల ప్రక్రియ, వస్తువు, శైలి వంటి విషయాల్లో పాశ్చాత్య సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యం ప్రభావితమైంది.

ఈ యుగంలో భాష లక్షణాలు

ఈ యుగంలో తెలుగు లిపి

=ముఖ్య కవులు

=

ముఖ్య రచనలు

ముఖ్య పోషకులు

ఈ యుగంలో తొలినాళ్లలో జమీందారులు, సంపన్నులు, అనంతర కాలంలో పత్రికలు, రేడియోలు, వాటి ద్వారా విద్యావంతులు సాహిత్యాన్ని పోషించారు. 19వ శతాబ్ది ప్రారంభంలో కావ్యాలను రచన చేసి జమీందార్లకు, సంపన్నులకు అంకితం ఇవ్వడం, అష్టావధానాలు చేయడం ద్వారా కవులు డబ్బు గడించేవారు. పద్యకవులకు కీర్తి, ధనం దక్కిన ఈ కాలంలో కవిత్వరచనపైన, కవుల పాండిత్యం, ప్రతిభ వంటి అంశాలపైన విపరీతమైన వాదాలు, కొన్ని వ్యాజ్యాలు కూడా నడిచాయి. అనంతర కాలంలో పత్రికలు సాహిత్యానికి ప్రధానమైన వేదికగా, సాహితీవేత్తలకు సంపాదన మార్గంగా నిలిచాయి. అలాగే అచ్చుయంత్రపు వాడకం పెరిగిన కొద్దీ పుస్తకప్రచురణ పెరిగి ప్రతుల అమ్మకం ద్వారా కూడా కవి రచయితలకు ధనసంపాదన మార్గమైంది. రేడియో రంగంలో నాటకరచన, కథారచన, గీతరచన వంటివి ఉద్యోగాలు ఉండడంతో ఆకాశవాణి కృష్ణశాస్త్రి వంటీ ప్రముఖ కవి, రచయితలకు సంస్థలో చోటుకల్పించింది. సినిమా రంగంలో శ్రీశ్రీ, సినారె, ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి పలువురు సాహితీవేత్తలు సినీకవులు, రచయితలుగా స్థిరపడ్డారు.

ఇతరాలు

సామల సదాశివ

ఇవి కూడా చూడండి

మూలాలు

వనరులు

బయటి లింకులు