"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తెలుగు సినిమా బిరుదులు

From tewiki
Jump to navigation Jump to search
వెండితెర సందడి
తెలుగు సినిమా
• తెలుగు సినిమా వసూళ్లు
• చరిత్ర
• వ్యక్తులు
• సంభాషణలు
• బిరుదులు
• రికార్డులు
• సినిమా
• భారతీయ సినిమా
ప్రాజెక్టు పేజి

తెలుగు సినిమా రంగంలో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రకరకాల బిరుదులు ఇవ్వడం, సన్మానాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని బిరుదులు (ప్రభుత్వ) అధికారిక సంస్థల ద్వారా ఇవ్వబడతాయి. కొన్ని బిరుదులు అధికారికంగా కాకపోయినా విస్తృతమైన గుర్తింపు ఉన్న సంస్థలు ఇవ్వవచ్చును. కాని చాలా బిరుదులు జనబాహుళ్యంనుండి, ప్రత్యేకించి "అభిమానుల" నుండి లభిస్తాయి. గమనించ దగిన విషయం ఏమంటే ఇలా అభిమానులనుండి లభించిన బిరుదులు అధికారికలాంఛనాలకంటే ఎక్కువ ఆదరణ పొందాయి.

బిరుదులు ఎందుకు ఇస్తారు?

బిరుదులు ఇవ్వడం అనేది తెలుగు సంస్కృతిలో ఒక విశిష్టమైన సంప్రదాయం కావచ్చును. ఈ విషయంపై ఎన్నో జోకులు, వ్యంగ్య నాటికలు కూడా ఉన్నాయి. కాని అనాదిగా తాము అభిమానించేవారిని తెలుగువారు చక్కని బిరుదులతో సత్కరించారు. నన్నయను "ఆదికవి", "వాగనుశాసనుడు" అన్నారు. శ్రీకృష్ణదేవరాయలును "ఆంధ్రభోజుడు" అన్నారు. ఆదిభట్ల నారాయణదాసును "హరికథాపితామహుడు" అన్నారు. జంధ్యాల పాపయ్య శాస్త్రిని "కరుణశ్రీ" అన్నారు. ప్రస్తుత కాలంలో సినిమా అత్యంత జనాదరణ పొందిన రంగం (కళగానూ, వ్యాపారంగానూ, కొండొకచో రాజకీయంగానూ.) గనుక సినిమారంగంలో బిరుదులకు మంచి అవకాశం, ప్రోత్సాహం లభించాయి.


ఎవరికైనా ఈ బిరుదులు ఇచ్చినపుడు వారి ప్రతిభను, వారి వృత్తిని వారి పేరుకు అనుసంధించినట్లవుతుంది. ప్రజాదరణ లేనిదే ప్రతిభకు గుర్తింపులేదు గనుక ఈ విధమైన బిరుదులు ఇచ్చినవారికీ, తీసుకున్నవారికీ గుర్తింపు తెస్తాయి.


ఈ విధమైన సంస్కృతి ఆంగ్ల, హిందీ సినిమా రంగాలలో కనిపించదు. దక్షిణభారత సినిమాకు ఇది ఒక విశిష్టమైన సంప్రదాయం అనిపిస్తుంది.

బిరుదులు ఎలా ఇస్తారు?

అధికారిక, అనధికారిక బిరుదులు

ప్రభుత్వపరంగా ఇచ్చే "పద్మశ్రీ", "పద్మవిభూషణ" వంటి బిరుదులు, "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు", "రఘుపతి వెంకయ్య అవార్డు" వంటి పురస్కారాలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చే "డాక్టరేటులు" - ఇవి అధికారికమైన బిరుదులు.


ఇక "రాజారెడ్డి ఫౌండేషన్", "వంశీ బర్క్‌లీ", "ఫిల్మ్‌ఫేర్" వంటి బాగా గుర్తింపు పొందిన సంస్థలు ఇచ్చే బిరుదులు రెండవకోవకు చెందినవి.


సామాన్యమైన ప్రజలు ఇచ్చేవి మూడవ కోవకు చెందినవి. ఇలాంటి సన్మానాలకు, బిరుదులకు ప్రత్యేకించి విధివిధానాలు, అర్హతలు, ఎన్నిక నియమాలు ఉండవు. ఎవరి పద్ధతులు వారివి. ఎవరి గుర్తింపు వారిది. కనుక ఈ విధమైన బిరుదుల గురించి కొంత చులకనగా మాట్లాడడం అప్పుడప్పుడూ జరుగుతుంది. ఎవరైనా ఎవరికైనా తమకిష్టమైన బిరుదులు ఇచ్చుకోవచ్చు గదా? మరి ఇక ఆ బిరుదులకు విలువ ఏమిటి? అని అంటారు.


కాని నిశితంగా పరిశీలిస్తే కొన్ని విషయాలను అంగీకరించవలసి వస్తుంది. సినిమాలాగానే బిరుదులు కూడా పూర్తిగా ప్రజాదరణపై ఆధారపడిన విషయాలు. కనుక నటీనటులకు కొన్ని బిరుదులు మాత్రమే చిరస్థాయిగా నిలచిపోయాయి. నిజానికి ప్రభుత్వాలు ఇచ్చిన పురస్కారాలకంటే ఈ విధమైన బిరుదులే ఆయా వ్యక్తుల పేర్లతో అవినాభావంగా కలిసిపోయాయి. ఇదంతా ఒకవిధంగా పూర్తి "ప్రజాస్వామ్య విధానం" అని చెప్పవచ్చును.


అంతేకాదు. కొందరు నటులకు వారు పోషించిన కొన్ని పాత్రలు, వారు చెప్పిన కొన్ని డైలాగులు శాశ్వతంగా వారి పేరుతో కలిసి నిలిచిపోతాయి. (ఉదా: సాక్షి రంగారావు, తెలంగాణ శకుంతల, రాములమ్మ, సుత్తి వీరభద్ర రావు, బట్టలసత్యం). వీటిని కూడా బిరుదులు అనవచ్చును ఎందుకంటే అవి వారి వృత్తికీ, ప్రతిభకూ అందం తెచ్చే ఆభరణాలు గనుక.

కొన్ని బిరుదులు

పేరు అధికారికంగా అభిమానులనుండి ఇంకా
చిత్తూరు నాగయ్య పద్మశ్రీ .. ..
ఎస్.వీ.రంగారావు .. నటయశస్వి ..విశ్వనటచక్రవర్తి
బి.విఠలాచార్య .. జానపద బ్రహ్మ ..
.. .. .. ..
నందమూరి తారక రామారావు పద్మశ్రీ నటరత్న
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
ఎన్టీవోడు, అన్నగారు
అక్కినేని నాగేశ్వరరావు పద్మభూషణ్
పద్మశ్రీ
కళాప్రపూర్ణ
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
నటసామ్రాట్ ..
కృష్ణంరాజు .. రెబల్ స్టార్ ..
శోభన్ బాబు .. నటభూషణ ..
కృష్ణ పద్మభూషణ్
కళాప్రపూర్ణ
నటశేఖర
సూపర్ స్టార్
..
కైకాల సత్యనారాయణ .. నవరస నటనా సార్వభౌమ
నటశేఖర
కళాప్రపూర్ణ
..
కొంగర జగ్గయ్య పద్మభూషణ్
కళాప్రపూర్ణ
కళా వాచస్పతి [1] కంచు కంఠం
చిరంజీవి పద్మభూషణ్
కళాప్రపూర్ణ
మెగాస్టార్
సుప్రీమ్ హీరో
చిరు
బాలకృష్ణ .. యువరత్న
బాక్సాఫీస్ బొనంజా
నటతేజో విశ్వరూపం
బాలయ్య
నాగార్జున .. యువసామ్రాట్ నాగ్
చినబాబు
వెంకటేష్ .. విక్టరీ వెంకీ
మోహన్ బాబు పద్మశ్రీ కలక్షన్ కింగ్ ..నటప్రపూర్ణ
కె.రాఘవేంద్రరావు .. దర్శకేంద్రుడు ..
దాసరి నారాయణ రావు .. దర్శకరత్న ..
జయసుధ .. సహజనటి ..
వాణిశ్రీ .. కళాభినేత్రి ..
రాజేంద్రప్రసాద్ .. నటకిరీటి ..
విజయశాంతి కలైమామణి లేడీ సూపర్ స్టార్
విశ్వనటభారతి
లేడీ అమితాబ్
రాములమ్మ
మేడమ్
విజ్జి
కె.విశ్వనాథ్ పద్మశ్రీ కళాతపస్వి[2] ..
రావు గోపాలరావు కళాప్రపూర్ణ నటవిరాట్ ..
భానుమతీ రామకృష్ణ పద్మశ్రీ
డాక్టర్
కళాప్రపూర్ణ
కలైమామణి
బహుకళా ధీరతి శ్రీమతి ..
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి డాక్టర్
కళాప్రపూర్ణ
..
ఎల్.వి.ప్రసాద్ కళాప్రపూర్ణ ..
జాలాది కళాప్రపూర్ణ ..
రావి కొండలరావు కళాప్రపూర్ణ ..
అంజలీదేవి డాక్టర్
అభినవ సీతమ్మ
కాంచనమాల ఊంఫ్ గరల్, ఆంధ్రా గ్రేటా గార్భో
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పద్మభూషణ్
పద్మశ్రీ
డాక్టర్
పి.సూరిబాబు కళావిశారద
గాన గంధర్వ
ఎం. ఎల్. వసంతకుమారి పద్మభూషణ్
డాక్టర్
సంగీత కళానిధి
ఎమ్మెస్ రామారావు సుందరదాసు
ఎస్. జానకి కలైమామణి
డాక్టర్
కర్ణాటక కోయిల
కె.జమునారాణి కలైమామణి
కే.జే. యేసుదాస్ పద్మవిభూషణ్
పద్మభూషణ్
పద్మశ్రీ<br డాక్టర్
కలైమామణి
సంగీత సాగరం
సంగీతచక్రవర్తి
సంగీత రాజా
సంగీతరత్న
గానగంధర్వ
స్వాతిరత్నం
సప్తగిరి సంగీతవిద్వన్మణి
భక్తి సంగీత గీతాశిరోమణి
ఘంటసాల పద్మశ్రీ
టి. యం. సౌందరరాజన్ పద్మశ్రీ
పి.లీల కలైమామణి
పి.సుశీల పద్మభూషణ్ గానసరస్వతి

ఇవికూడా చూడండి


మూలాలు, వనరులు