"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తొర్రూర్

From tewiki
Jump to navigation Jump to search

తొర్రూర్, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలానికి చెందిన గ్రామం.[1][1]ఇది జనగణన పట్టణం.


తొర్రూర్
—  మండలం  —
మహబూబాబాద్ జిల్లా పటంలో తొర్రూర్ మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో తొర్రూర్ స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°39′16″N 79°21′15″E / 17.654491°N 79.354134°E / 17.654491; 79.354134
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాద్
మండల కేంద్రం తొర్రూర్
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 76,519
 - పురుషులు 38,506
 - స్త్రీలు 38,013
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.24%
 - పురుషులు 65.41%
 - స్త్రీలు 40.75%
పిన్‌కోడ్ 506302

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.

లోగడ తొర్రూర్ గ్రామం/మండలం వరంగల్ జిల్లా,మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది అంతకుముందు మేజర్ గ్రామ పంచాయతీ 2016-2018లో ఇదే తొర్రూరు గ్రామాన్ని మున్సిపాలిటి గాను డివిజన్ కేంద్రం గాను ఇప్పుడు అయింది.2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా తొర్రూరు మండలాన్ని(1+21) ఇరవైరెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా,అదే రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

గ్రామనామ వివరణ

తొర్రూరు అన్న పేరు బాగా ప్రాచీనమైందని పరిశోధకులు తేల్చారు. కొత్తరాతియుగం, బృహత్‌శిలా యుగానికి చెందిన ప్రాక్తన చారిత్రిక దశ నాటి పేరుగా గుర్తించారు. కొత్త రాతియుగంలో పశుపాలన, వ్యవసాయం విస్తృతిపొంది, రాగి, ఇనుము వాడకం, లోహపరిశ్రమ అవతరించింది. ఈ అంశాలను సూచిస్తూ ఏర్పడిన గ్రామనామాల్లో తొర్రూరు ఒకటి. ఆ యుగంలో కొత్తగా ప్రారంభమైన పశుపాలన విషయాలను సూచిస్తూ పశుసంబంధమైన పేరు ఈ గ్రామనికి ఏర్పడింది.[2]మరొక వాదన కూడా ఉంది దొర అంటే తెలంగాణ ప్రాంతంలో భూములు ఏక్కువ వందల ఎకరాల్లో ఉన్న వారు ఈ గ్రామంలో ఒక దొర ఉండే వారు అతని పేరు మీద దొరవారి ఊరు చుట్టూ ఉన్న గ్రామాల్లో వారు పిలిచేవారూ దొరూరు కాలగమనంలో తొర్రూరు అయింది. రంద్రపురి గ్రామానికి మరో పేరు కూడా ఉంది ఈ ఊరు మద్య ఒక్క గొయ్యి అంటే రంద్రం తొర్ర ఒక్కటే అర్ధం ఒకటి ఊరు మద్య లో పెద్దది ఉండడంతో రంద్రపురి అని దొరూరు కలిపి కాలగమనంలో తొర్రూరు అయింది.

మూలాలు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:పేజీ.26

వెలుపలి లింకులు