"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తోక

From tewiki
Jump to navigation Jump to search
తేలు తోక

తోక లేదా వాలము లేదా పుచ్ఛం (Tail) జంతువుల వీపు క్రింది వైపునుంచి వేలాడే పొడవైన శరీర భాగము. ఇది మొండేనికి అనుబంధంగా వంగే గుణం కలిగినవుంటుంది. ఇది మనుషులలో ఒక అవశేషావయవముగా మాత్రమే ఉన్నది. ఇది క్షీరదాలు, పక్షులలో త్రికము, అనుత్రికము లకు అనుసంధానంగా ఉంటుంది. తోకలు ప్రాథమికంగా సకశేరుకాల లక్షణమైనా, తేలు వంటి కొన్ని అకశేరుకాలలో కూడా ఇది కనిపిస్తుంది.

ఉపయోగాలు

పురివిప్పిన అందమైన నెమలి తోక.
 • జంతువులు తోకను వివిధ పనుల కోసం ఉపయోగిస్తాయి. నీటిలో జీవించే చేపలు మొదలైన జీవులు తోక సహాయంతో ఈదుతాయి.
 • చాలా జంతువులు తమ పొడవైన తోకతో ఈగల్ని ఇతర కీటకాలను తోకతో తోలుకుంటాయి.
 • కొన్ని జాతుల పిల్లులు, కంగారు తమ తోకను గెంతుతున్నప్పుడు బాలన్సింగ్ కోసం ఉపయోగిస్తాయి.
 • కొన్ని రకాల కోతులు, అపోసమ్ లు తోకతో చెట్టు కొమ్మలను పట్టుకొని ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు దూకుతాయి.
 • కొన్ని జంతువులు తోకతో సంకేతాలనిస్తాయి. కొన్ని జింక జాతులు తోక లోపలివైపు తెల్లని భాగాన్ని చూపిస్తూ పొంచివున్న ప్రమాదాన్ని ఇతరులకు తెలియజేస్తాయి. చాలా కుక్కలు తోకను రకరకాలుగా కదిలిస్తూ వాటి అనుభూతుల్ని (emotion) తెలుపుతాయి.
 • తేలు వంటి కొన్ని జీవులలో ఆత్మరక్షణ కోసం తోకలో విషాన్ని కలిగివుంటాయి.
 • కొన్ని జాతుల బల్లులు వాటి తోకను విడిచిపెట్టి శత్రువులను మభ్యపెట్టి పారిపోతాయి.
 • పక్షులు తోకలో ఉండే ఈకల్ని ఎగిరిన తర్వాత బాలన్సింగ్ కోసం, మార్గాన్ని మార్చుకోవడానికి ఉపయోగిస్తాయి.
 • నెమలి వంటి కొన్నిఆడ పక్షులు మగపక్షుల్ని ఆకర్షించడానికి వాటి రంగురంగుల తోకల్ని చూపించి నాట్యం చేస్తాయి.
 • లకుముకి పిట్ట, వడ్రంగి పిట్టలు తోకలోని ఈకల్ని చెట్టు కాండాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగిస్తాయి.

మనిషి తోక

Human embryos have a tail that measures about one-sixth of the size of the embryo itself. As the embryo develops into a fetus, the tail is absorbed by the growing body. The developmental tail is thus a human vestigial structure. Infrequently, a child is born with a "soft tail", which contains no vertebrae, but only blood vessels, muscles, and nerves, although there have been a very few documented cases of tails containing cartilage or up to five vertebrae. Modern procedures allow doctors to eliminate the tail at delivery. Some of these tails may in fact be sacrococcygeal teratomas. The longest human tail on record belonged to a twelve-year-old boy living in what was then French Indochina, which measured 229 mm (9 inches).[1] A man named Chandre Oram, who lives in West Bengal, a state in India, is famous because of his 13-inch (330 mm) tail. It is not believed to be a true tail, however, but rather a case of spina bifida.

Humans have a tail bone (the coccyx) attached to the pelvis, in the same place which other mammals have tails. The tail bone is formed of fused vertebrae, usually four, at the bottom of the vertebral column. It doesn't protrude externally, but retains an anatomical purpose: providing an attachment for muscles like the gluteus maximus.

ఇవి కూడా చూడండి


మూలాలు

 1. "Humans Evolved from Ape-like Ancestors". Archived from the original on 2009-01-19. Retrieved 2009-01-10.