తోరాటి సత్యనారాయణ

From tewiki
Jump to navigation Jump to search

తోరాటి సత్యనారాయణ మాజీ నక్సలైట్, తూర్పు గోదావరి జిల్లా కడియం మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు.[1] ఆయన బడుగువర్గాల ఆశాజ్యోతిగా జననేతగా ఉద్యమశీలిగా మాజీ నక్సలైటుగా నిరుపేదల పాలిట అభ్యున్నత వ్యక్తిగా ఎన్నో సేవలందించారు.

జీవిత విశేషాలు

కడియంకు చెందిన తోరాటి 1953లో తోరాటి గన్నియ్య సోమాలమ్మ దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. చిన్నప్పటినుంచి అభ్యుదయ భావాజాలంవైపు అడుగులు వేస్తూ మావోయిస్టు పార్టీలో చేరారు. 1995లో కాంగ్రెస్‌పార్టీ నుంచి కడియం ఎంపిపిగా గెలుపొంది ఐదేళ్ళపాటు మండలాభివృద్దికి ఎనలేని సేవలందించారు. పీసీసీ సభ్యునిగా, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యునిగా, కార్మికనేతగా, విప్లవయోధుడిగా నియోజకవర్గంలోని ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.[2]

ఉద్యమకారునిగా

పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య, వరవరరావు, గద్దర్, సత్యమూర్తి వంటి వారితో తోరాటి కలిసి పలు ప్రజాపోరాటాల్లో, నక్సల్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1974లో ఖైదీలను విడిపించేందుకు రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలును బద్దలుగొట్టడానికి ప్రయత్నించిన సంఘటనలో తోరాటి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

1975లో మీసా కింద అరెస్టయి జైలు జీవితం గడిపారు. 1977లో నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి కడియం పరిసరాల్లో కార్మికులకు అండగా పలు పోరాటాల్లో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రాజకీయంగా కీలకంగా వ్యవహరించేవారు. 1989లో కాంగ్రెస్‌లో చేరారు. కడియం గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. 1995లో కడియం ఎంపీపీగా ఎన్నికయ్యారు.[1]

మరణం

ఆయన కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతూ మే 15 2016 న మరణించారు.

మూలాలు

ఇతర లింకులు