త్రిలింగాలు

From tewiki
Jump to navigation Jump to search

తెలుగునాట సుప్రసిద్ధి చెందిన మూడు శైవక్షేత్రాలకు త్రిలింగాలని పేరు. ఈ మూడు శైవక్షేత్రాలూ నెలకొన్న ప్రాంతాలే త్రిలింగ ప్రాంతాలని, అందుకే ఈ భాషకు త్రిలింగ అనే పదం ఏర్పడిందని భావిస్తూంటారు. త్రిలింగ అన్న పదం నుంచే తెలుగు అన్న పదం వచ్చిందని ఒక కాలంలో కొందరు పండితుల భావన.

త్రిలింగాలు

  1. శ్రీశైలం
  2. దాక్షారామం (దీనికి దక్షుడి పేరుమీద దాక్షారామమని పేరు వచ్చింది. కానీ కొంతమంది దీన్ని ద్రాక్షారామం అంటారు.)
  3. కాళేశ్వరం.

తెలుగు-త్రిలింగం

ఈ మూడు లింగాల మధ్య ఉన్న దేశం త్రిలింగదేశం అంటే తెలుగునాడు అనడం వాడుక. అప్పకవి, మరికొందరు ఈ మాటను వాడారు కానీ ప్రాచీనకావ్యాల్లో గానీ, సంస్కృతనిఘంటువుల్లో ఉండే యాభైఆరుదేశాల్లో గానీ త్రిలింగదేశమంటే తెలుగునాడు అనే అర్థం లేదని సిపి బ్రౌన్ తన తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులో పేర్కొన్నాడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది కల్పిత నామం. త్రిలింగ అనే పదం నుంచి తెలుగు ఏర్పడిందనడం కేవలం గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజంలేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం మొదలుకొని పలు సారస్వత, చారిత్రికాధారాలు పరిశీలించి చెప్పారు.[1]

వ్యాకరణం

  • త్రి+లింగములు=మూడువిద లింగములు

మరో త్రిలింగాలు

మరికొందరి అభిప్రాయం ప్రకారం త్రిలింగాలని వీటిని కూడా అంటారు.

  1. తారకలింగము (ఆకాశమున)
  2. మహాలింగము (భూలోకమున)
  3. హటకేశ్వరలింగము(పాతాళలోకమున)

మూలాలు

  1. వెంకట లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Archived from the original on 28 సెప్టెంబర్ 2017. Retrieved 6 March 2015. Check date values in: |archive-date= (help)