"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దమయంతి

From tewiki
Jump to navigation Jump to search

దమయంతి నలుని భార్య. విదర్భరాజు అగు భీముని కూఁతురు. ఈమె స్వయంవరమునందు ఇంద్రాదిదేవతలను వరింపక నలుని వరించెను. అందులకు కలి మిగుల కోపించి ఆపె పురుషుఁడు అగు నలుని అతని దాయాది అగు పుష్కరునితో జూదమాడునట్లుచేసి అతనికి అనేకములు అయిన ఇడుములు కలుగునటుల చేసెను. ఈమె పతియందు అతి అనురాగవతి అయినను అతనిని పాసి కొన్ని దినములు సేవకావృత్తిని ఉండెను. కడపట భర్తను కలసి రాజ్యము మరలచేరి సమస్తసుఖములను అనుభవించెను.

దమయంతి మరియ హంస (swan-messenger).
Painting by రాజా రవివర్మ.