"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
దవనం నూనె
![]() | ఈ వ్యాసం లేదా విభాగం పెద్ద విస్తరణ / పునర్వ్యవస్థీకరణ మధ్యలో ఉంది. మీరూ దీన్లో దిద్దుబాట్లు చేసి, దీని నిర్మాణంలో భాగం పంచుకోండి. ఈ వ్యాసంలో లేదా విభాగంలో చాల రోజులుగా దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తొలగించండి. ఈ article లో చివరిసారిగా Script error: No such module "Time ago". మార్పుచేర్పులు చేసారు. చేసినవారు: [[User:imported>Palagiri|imported>Palagiri]] ([[User talk:imported>Palagiri|talk]] | [[Special:Contributions/imported>Palagiri|contribs]]). (పర్జ్ చెయ్యండి) |
దవనం నూనె ఒక ఆవశ్యక నూనె.దవనం నూనెను ఆంగ్లంలో దవన ఆయిల్ అందురు. దవన నూనెను పారిశ్రామికంగా మరియు వైద్యపరంగా పలు ప్రయోజనాలు ఉన్నవి.దవనం మొక్క ఆకులను పూలతో చేర్చిపూలమా/పూల దండలలుగా కట్టెదరు.ఆహారంలో, సువాసన నిచ్చుటకు కాస్మోటిక్సులో,సుగంధ ద్రవ్యాలలో, సిగరేట్లలో, ఔషదాల తయారీలో దవన నూనెను ఉపయోగిస్తారు.
Contents
దవనం మొక్క
ఇది ఏకవార్షిక మొక్క.ఇది వృక్షశాస్త్రంలో ఆస్టరేసి(కంపోసిటే) కుటుంబానికి చెందిన మొక్క.దవనం మొక్క వృక్షశాస్త్ర పేరు:అర్టెమిసియా పల్లెన్.దవన ఆకులు మంచి సువాసన వెదజల్లును.మొక్క ఆకులను దండలలో, మరియు అర్చన లో పూజా ద్రవ్యంగా ఉపయోగిస్తారు.పువ్వులను శివ పూజకు ఉపయోగిస్తారు.ఆకులనుండి,పువ్వుల నుండి ఆవశ్యక నూనెను ఉత్పత్తి చేస్తారు.దవనం హైడ్రోకార్బనులు (20%),ఈస్టరులు(65%),ఆక్సీజెనేటెడ్ సంయోగపదార్థాలు (15%)కల్గివున్నది.దవనంలోని ఈస్టరులువలన దవనాకి ప్రత్యేకమైన ఆహాల్లదకరమైన సువాసన ఏర్పడినది.దవనంలోని ఈస్టరులు వలన దవనాకి ప్రత్యేకమైన ఆహాల్లదకరమైన సువాసన ఏర్పడీనది. దవనం సువాసన కల్గిన,ఓషది మొక్క.నిటారుగా 60 సెం.మీ ఎత్తు వరకు పెరుగును. పత్రాలు చీలికలిగా వుండును.పూలు పసుపురంగులో వుండును. ఆకులు తొడిమగల్గి వికల్పఅమరికతో ద్విలంబికంగా వుండును.
సాగు
భారత దేశంలో హిమాలయ ప్రాంతంలో ఈ మొక్క విపరీతంగా పెరుగును.కాశ్మీరు లోయలో దవనం విస్తారంగా కన్పిస్తుంది.దవనాన్ని కర్ణాటక,మహారాష్ట్ర,కేరళ,తమిళనాడు,మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో సాగు చేస్తారు.ఆవశ్యక నూనెకై సాగు చేయు పంటకై నవంబరు మొదటి వారంలో మొక్కలను నాటుతారు.మొక్కను నాటిన 110-115 రోజులకు పంట పుష్పించడం మొదలగును(ఫిబ్రవరి రెండో లేదా మూడో వారం)పంటలో సగానికి పైగా పూలు పూచిన తరువాత పంటనుమార్చి మొదటి వారంలో కొయ్యడం జరుగును.మొక్క మొదలువరకు మొక్కను కోస్తారు.భారత దేశంలో దవనాన్ని దక్షిణ భారత దేశంలో అధికంగా సాగు చేస్తారు.ఇది నాలుగు నెలలపంట.చందన/గంధపు చేట్ల పరిసరాలు ఈ మొక్క పెరగటానికి అనువైనవి.మొక్కపూర్తిగా ఎదిగి పూలు పూర్తిగా వికసించిన తరువాత మొక్కలను కోస్తారు.ముఖ్యంగా వేసవి కాలంలో చివరిలో.కొడవలిని ఉపయోగించి మొత్తం మొక్కను కత్తరిస్తారు.నూనెను తీయుటకు కోసిన పంటను ముందు ఒక వారం రోజులు ఆరబెడతారు.[1]
దవన నూనె
నూనెలో కీటోనులు,టేర్పైను సమ్మేళనాలుగా వుండును.ఉదా: దవనోన్, లినలూల్, దవన ఈథరు వంటివి. దవన నూనెను సపోనిఫీకేసన్ చేసిన 10% సిన్నమిక్ ఆమ్లం లభించును. నూనె చిక్కగా బ్రౌన్ రంగులో ఉండును.సీస్ దవనోన్ అనీ పిలువబడే సేసిక్యూ టెర్పేను వలన నూనె ప్రత్యేకమైన వాసన కల్గుతున్నది
నూనెలోని సమ్మేళనాలు
నూనెలోని కొన్ని ముఖ్యమైన రసాయనసమ్మేళనాలు[2]
వరుససంఖ్య | సమ్మేళనం | శాతం |
1 | దవనోనెస్ | 45-50 |
2 | దవనోల్ | 0.5-1.5 |
3 | దవనిక్ ఆమ్లం | 1.5-3.5 |
4 | దావన ఫురన్ | 1.5-2.5 |
5 | దావన ఈథర్స్ | 0.5-2.5 |
6 | హైడ్రాక్సీ దవనోనెస్ | 4-5 |
7 | నెరోల్ | 8-10 |
8 | జెరనియోల్ | 3-6 |
9 | సిన్నమైల్ సిన్నమేట్ | 1-2 |
10 | ఇథైల్ దవనేట్ | 1-3 |
భౌతిక గుణాల పట్టిక[1]
వరుస సంఖ్య | భౌతిక గుణం | మితి |
1 | సాంద్రత | 0.94200 - 0.97030(25.00 °Cవద్ద |
2 | వక్రీభవన సూచిక | 1.47900 - 1.49100 @ (20.00 °Cవద్ద) |
3 | ఫ్లాష్ పాయింట్ | 93.33 ° |
4 | ద్రావణీయత | ఆల్కహాల్ లోకరుగును.నీటిలో కరుగదు |
నూనె ఉపయోగాలు
దవన నూనె వలన పలు ప్రయోజనాలు వున్నవి.
- దవన నూనెను పారిశ్రామికంగా మరియు వైద్యపరంగా పలు ప్రయోజనాలు ఉన్నవి.ఆహారంలో, సువాసన నిచ్చుటకు కాస్మోటిక్సులో,సుగంధ ద్రవ్యాలలో, సిగరేట్లలో, ఔషదాల తయారీలో దావన నూనెను ఉపయోగిస్తారు.
- పొడి చర్మాన్ని మృదువుగా చేయుటకు ఉపయోగిస్తారు.వాంతులు రావడం,రుతుస్రావ సమస్యలనివారణకు ఉపయోగిస్తారు.[2]
- కటిసంబంధమైన నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు.[2]
- పలు పానీయాల మరియు తినే వస్తువుల తయారీలో దవన నూనెను ఉపయోగిస్తారు.[2]
- దవన నూనెను కొత్తిమీర నూనె,దేవదారు నూనె,ద్రాక్షపళ్ళ నూనె,సిట్రస్ నూనె వంటీ వాటితో మిశ్రమం చేసి వాడతారు[2]
- దవన నూనె వైరస్ నిరోధక లక్షణాలు కల్గి వున్నది.దవన నూనె వైరస్ బయటి రక్షక త్వచం మీద దాడి చేసి దాన్ని నాశనం చేస్తుంది.వైరస్ వలన సంక్రమించే అంటు రోగాలైన దగ్గు,జలుబు,ఇన్ఫ్లూయెంజా,పొంగు/తట్టు (measles)ను నయం చేస్తుంది.లోపల బయట అయిన గాయాలను మాంపుతుంది.దేహంలోని,మూత్ర నాల మార్గాలు,మూత్రకోశం,మూత్ర పిండాలు,మరియు మిగతా దేహ భాల్లో ఏర్పడు పుండ్లను,గాయాలను మాన్పును.తెగినపుడు,గాయాలు అయినపుడు ఆలస్యం చెయ్యకుండా మధ్య గాఢత వున్న నూనెను పూతగా పూసిన దనుర్వాతం ను నిలువరించును.ముఖ్యం గా ఇనుప వస్తువుల వలన దెబ్బలు తగిలిన గాయాల వలనవ్యాపించు దనుర్వాతం రాకుండా నిలువరించును.[3]
- దవన నూనెనుఅమెరికా మరియు జపాను దేశాల్లో పానీయాల తయారి,సిగరెట్ల తయారీకి,కేకుల తయారీలో ఉపయోగిస్తారు.
బయటి లింకుల వీడియో
ఇవికూడా చూడంది
- ఆవశ్యక నూనె
- ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ
- దవనం
- అల్లం నూనె
- దేవదారు నూనె
- మరువం నూనె
- రోజ్మేరి నూనె
మూలాలు
- ↑ 1.0 1.1 "artemisia pallens herb oil". thegoodscentscompany.com. https://web.archive.org/web/20180111042306/http://www.thegoodscentscompany.com/data/es1024001.html. Retrieved 15-08-2018.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "DAVANA OIL". katyaniexport.com. https://web.archive.org/web/20180128201946/http://www.katyaniexport.com/davana-oil.html. Retrieved 15-08-2018.
- ↑ "8 Surprising Benefits Of Davana Essential Oil". organicfacts.net. https://web.archive.org/web/20170707055547/https://www.organicfacts.net/health-benefits/essential-oils/health-benefits-of-davana-essential-oil.html. Retrieved 15-08-2018.