దాదాభాయి నౌరోజీ

From tewiki
Jump to navigation Jump to search
The Honourable దాదాభాయి నౌరోజీ
దాదాభాయి నౌరోజీ

Dadabhai Naoroji, 1892


పదవీ కాలము
1892 – 1895
ముందు Frederick Thomas Penton
తరువాత William Frederick Barton Massey-pMainwaring
ఆధిక్యత 3

వ్యక్తిగత వివరాలు

జననం (1825-09-04)1825 సెప్టెంబరు 4
Bombay, British India
మరణం 1917 జూన్ 30(1917-06-30) (వయస్సు 91)
వర్సోవా, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ Liberal
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి గుల్బాయి
నివాసం లండన్, యు.కి.
వృత్తి Academic, political leader, MP, cotton trader
మతం జొరోస్ట్రియానిజం

దాదాభాయ్ నౌరోజీ (హిందీ - दादाभाई नौरोजी) (సెప్టెంబర్ 4, 1825జూన్ 30, 1917) పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడు. ఈయన 1892 నుండి 1895 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్‍డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగారు. ఈయన అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి. ఈయనని గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందునుంచే స్వాతంత్ర్యం కోసం గళమెత్తాడు. నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఒకరు. నౌరోజీ, ఎ. ఓ. హ్యూమ్, దిన్షా ఎదుల్జీ వాచాతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించారు. ఈయన రాసిన పుస్తకం పావర్టీ అండ్ అన్‍బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటెన్ కు దోచుకు తరలిస్తున్న నిధుల గురించి మాట్లాడిన మొదటి పుస్తకం.

జీవితం

నౌరోజీ 1825 సెప్టెంబరు 4 న, బొంబాయిలో ఒక పార్శీ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి పలన్ జీదోరోజి జొరాష్ట్రియన్ మతపురోహితుడు. ఎల్ఫిన్ స్టోన్ పాఠశాలలో చదివాడు.[1] బరోడా మహారాజు మూడవ శాయాజీరావు గైక్వాడ్ సహాయంతో కళాశాల విద్యనభ్యసించాడు.

వ్యాపార నిమిత్తం 1855 లో ఇంగ్లండు వెళ్ళిన నౌరోజీ భారతదేశపు స్థితిగతులను ఆంగ్లేయులకు విడమరిచి చెప్పాడు.

మూలాలు

  1. Dilip Hiro (2015). The Longest August: The Unflinching Rivalry Between India and Pakistan. Nation Books. p. 9. ISBN 9781568585031. Retrieved 9 December 2015.