"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దామల్చెరువు

From tewiki
Jump to navigation Jump to search

దామల్చెరువు, చిత్తూరు జిల్లా, పాకాల మండలానికి చెందిన గ్రామం.[1] ఇది చిత్తూరు .. కడప.. చిత్తూరు రహదారిపై చిత్తూరుకి సుమారు ముప్పై కిలో మీటర్ల దూరం లోను పాకాలకు నాలుగు మైళ్ల దూరం లోను ఉంది. అదే విదంగా పాకాల .. ధర్మవరం రైల్వే లైనులో పాకాల తర్వాత రెండో స్టేషను దామల చెరువు.[2] రైల్వే ష్టేషన్ సమీపాన పెద్ద మామిడి పళ్ల మండి ఉంది. రాష్ట్రంలోనె ఇది ప్రసిద్ధి పొందిన మామిడి కాయల మండి. ఇక్కడి నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు మామిడి కాయలు ఎగుమతి అవుతున్నాయి. మామిడి పళ్లకు ప్రసిద్ధి పొందినందున దీన్ని మాంగో నగర్ అని కూడా అంటారు. ఇక్కడికి చుట్టు పక్కల అనేక మామిడి పళ్ల గుజ్జు తీసె పరిశ్రమలు వెలిశాయి. ఈ గ్రామం పాల కోవాకు కూడా ప్రసిద్ధి. పాల కోవా తయారు చేసె అనేక 'బట్టీలు' ఇక్కడ ఉన్నాయి. పాల కోవా ఇక్కడి నుండి బెంగళూరు, హైదరాబాదుకు ఎగుమతి అవుతున్నది.

దామల్చెరువు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పాకాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 517112
ఎస్.టి.డి కోడ్ 08585

గ్రామ జనాభా

జనాభా (2001) మొత్తం. 10,396 పురుషులు, 5,228 స్త్రీలు 5,168 నివాస గృహాలు
2,447 ఈ గ్రామం సముద్ర మట్టానికి 371 meters. ఎత్తులో ఉంది. విస్తీర్ణము 1896 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు, ఉర్దూ.
దస్త్రం:Top of penance tree.JPG
అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. మొగరాల గ్రామంలో జరిగిన భారతంలో ఒక ఘట్టం (2012 వ సం.)
ధుర్వోధన వధ నాటకానికి సిద్దం చేయ బడ్డ బారి ధుర్వోధన విగ్రహం. దామల చెరువు గ్రామంలో 2012 వ సంవత్సరంలో జరిగిన భారత ఉత్సవంలో తీసిన చిత్రం)
ధుర్వోధన వధ నాటకానికి సిద్దంగా వున్న భీమ ధుర్వోధన వేషదారులు. ఇది 2012 లో దామల చెరువు గ్రామంలో జరిగిన భారతంలో తీసిన చిత్రం

రవాణ సౌకర్యము

[2] ఈ గ్రామం చిత్తూరు-కడప రాష్ట్ర రహదారి పైనున్నందున రాష్ట్రంలో అన్నిప్రధాన ప్రాంతాలకు రోడ్డు రవణా సౌకర్యము ఉంది. ఇక్కడ రైల్వే స్టేషను కూడా ఉంది.

విద్యా సౌకర్యాలు

[2] ఈ గ్రామంలో శ్రీ చైతన్య కాన్సెప్ట్ స్కూలు, విజయ స్కూలు, ఒక జిల్లపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-07-28.
  2. 2.0 2.1 2.2 "http://www.onefivenine.com/india/villages/Chittoor/Pakala/Damalcheruvu". Retrieved 9 June 2016. External link in |title= (help)

వెలుపలి లంకెలు