దావూద్‌ ఇనగంటి

From tewiki
Jump to navigation Jump to search

దావూద్‌ ఇనగంటి తెలుగు రచయిత. పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో 1928 ఫిబ్రవరి 20 న మదార్ బీ, కాశిమ్ సాహెబు లకు జన్మించారు.ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగు, ఆంగ్ల భాషల్లో వివిధ పత్రికలకు వ్యాసాలు వ్రాశారు. వక్ప్‌ ఆస్తుల పరిరక్షణ, సద్వినియోగం గురించి వీరు వ్రాసిన ఆంగ్ల వ్యాసం రాష్ట్రపతి డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ప్రశంసలందుకుంది. తెలుగు భాషాప్రియుడు, నూర్ భాషీయుల చరిత్రకారుడు.

జీవిత విశేషాలు

ఆయన ప్రకాశం జిల్లా నాగులపాలెంలో 1928 ఫిబ్రవరి 20న మదార్‌బి, ఖాశిం సాహెబ్‌ దంప్తతులకు జన్మించారు. వీరు బి.ఏ. చదివి 1950లో మద్రాస్‌ సచివాలయం అధికారిగా ఉద్యోగం చేపట్టి 1986లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో జాయింటు సెక్రటరీగా రిటైర్డ్‌ ఆయ్యారు. 10.1.2018 న హైదరాబాదులో మరణించారు.

రచనా వ్యాసంగము

1967లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగు, ఆంగ్ల భాషల్లో వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడం ద్వారా రచనా వ్యాసంగం ప్రారంభించారు.

ప్రశంసలు

వక్ప్‌ ఆస్తుల పరిరక్షణ, సద్వినియోగం గురించి వీరు వ్రాసిన ఆంగ్ల వ్యాసం రాష్ట్రపతి డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ప్రశంసలందుకుంది. ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతాలకు చెందిన ధార్మిక గ్రంథాలను 1076 సమన్యయ పరుస్తూ రాసిన వ్యాసాల విశిష్టత వలన ఆయా ధార్మిక సంస్థల సన్మానాలు పొందారు. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతినిధిగా హాజరయ్యారు. ఆకాశవాణి ద్వారా ప్రసంగవ్యాసాలు ప్రసారం అయ్యాయి.

రచనలు

వీరి రచనలో ముఖ్యమైనది నూర్‌ భాషీయుల చరిత్ర-సంస్కృతి (2001). లక్ష్యం: అన్నిరంగాలలో అసమానతలు తొలిగిపోవాలి.ఇనగంటి దావూద్ గారు 27.3.2011 న పదిశతకాలు రాసిన షేక్ అలీ గారికి తెలుగు భాష పై ఉన్న అపారమైన అభిమానంతో ఒక లేఖ రాశారు.ఇలా ఇద్దరు తెలుగు ముస్లిములు తెలుగు భాష కనుమరుగు, చెవిమరుగు కాకుండా కాపాడవలసిన బాధ్యత తమమీదనే ఉందని చెప్పుకోవటం విశేషం. తెలుగుమీద మక్కువ ఎక్కువగా ఉన్న ఈ ఇద్దరు సాయిబులు ఆదర్శనీయులు.G.A. Rahim Ips IG గారి నాన్నగారు గగ్గటూరి అబ్దుల్ ఖాదర్ దూదేకుల, పింజారీ, లద్దాఫ్ కులాల పేరును నూర్ బాషాగా మార్పించటంకోసం చాలా కష్టపడ్డారని ఇనగంటి దావూద్ గారు రాసిన "నూర్ బాషీయుల చరిత్ర-సంస్కృతి" పుస్తకంలో చదివాను.పింజారీ వెధవ' అనే కారుకూతలను తమ సీరియళ్ళలో తొలగిస్తూ దూరదర్శన్ ప్రోగ్రామ్స్ కంట్రోలర్ వెంకటేశ్వర్లు గారు 18.2.1987న ఐ.పి షా గారికి క్షమాపణ ఉత్తరాన్ని రాశారు.డా. దాశరథి రంగాచార్య ఇనగంటి దావూద్ గారి ఉత్తరానికి స్పందించి తన 'అమృతంగమయ' సీరియల్ లో "ఈ పదం తొలగిస్తున్నాను క్షమాపణ కోరుతున్నాను" అంటూ పెంజరము అంటే 'బంగారు హరిదళము'అని అర్ధం చెప్పారు (వార్త ఆదివారం 2.2.2003).అయినా పెంజరానికీ పింజారీకి ఎలాంటి సంబంధం లేదనీ, మానవులంతా ఒక్కటే, లోకమే వారి కుటుంబం, ఒకరు మరొకరికంటే అధికుడై జన్మించాడనే మాట అర్ధరహితం అని దావూద్ గారు వాదించారు.దావూద్ గారి వాదనను చివరికి రంగాచార్యగారు ఒప్పుకున్నారు.పింజారీ అనే పదాన్ని తొలగించారు.ఇకమీదట వాడనని క్షమాపణ చెప్పారు.తెలుగుఅకాడమీ వారి తెలుగు-తెలుగు నిఘంటువులో పింజారీ అంటే ఒకవిధమైన తిట్టు అనే అర్ధం ఇచ్చారు.అది ఎలా తిట్టుపదమో చెప్పాల్సిందిగా ఇనగంటి దావూద్ గారు నిగ్గదీస్తే పునర్ముద్రణలో ఈ తప్పును సవరించుకుంటామని ఆవులమంజులత గారు 28.8.2003 న సమాధానమిచ్చారు.

నూర్ బాషా

నూర్ బాషా అనేది దూదేకుల వారి కులంపేరు. కొన్నిచోట్ల ఇంటిపేరుగా కూడా ఉంది. నూర్ బాషా అనే ఇంటి పేరు రాయలసీమ, తెలంగాణాలలో లేదు.గుంటూరు, ప్రకాశం జిల్లాలలో మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.అయితే అలా ఇంటి పేరును మార్చుకోవటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?అందుకు ప్రోత్సహించిన పెద్దలు ఎవరు? అని ఆరా తీస్తే గగ్గుటూరి అబ్దుల్ ఖాదర్ బృందమే ఇందుకు కారణమని దావూద్ గారు చెప్పారు.అయితే ఆయన ఇంటిపేరు గగ్గుటూరి గానే ఉంచుకొని ఇతరుల ఇంటిపేరు నూర్ బాషాగా మార్చటానికి ప్రయత్నించి ఉండరు అని కొందరి అనుమానం.అసలు ఆనాడు ఏమి జరిగిందో తెలిసిన పెద్దలు ఈ వివరాలను నూర్ భాషీయుల చరిత్రలో చేర్చవలసిన అవసరం ఉంది.

మూలాల జాబితా

  • సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 60

ఇతర లింకులు


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ