ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్

From tewiki
Jump to navigation Jump to search
ప్రదర్శన కొరకు పోస్టర్

ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ విలియం షేక్‌స్పియర్ యొక్క ప్రారంభ నాటకాలలో ఒకటి, దీని రచన 1592 మరియు 1594 మధ్యకాలంలో జరిగినట్లు భావించబడుతుంది. ఇది అతని అత్యంత సంక్షిప్తమైన మరియు అసభ్యకర హాస్యరచనలలో ఒకటి, హాస్యంలో అధికభాగం శ్లేషార్ధాలు మరియు మాటల గారడీతో పాటు మూఢ అతిశయోక్తులు మరియు గుర్తింపులో దోషం కారణంగా ఉద్భవిస్తుంది. ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ (ది టెంపెస్ట్ తో పాటు) సాంప్రదాయ నియమాలని పాటించిన షేక్‌స్పియర్ యొక్క రెండు నాటకాలలో ఒకటి. ఇది ఒపేరా, రంగస్థలం, చలనచిత్రం మరియు సంగీత రూపకాల కొరకు అనుసరించబడింది.

ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ జన్మ సమయంలో యాదృచ్చికంగా విడిపోయిన రెండు జతల సారూప్య కవలల కథని తెలుపుతుంది. అంటిఫోలుస్ ఆఫ్ సిరక్యూస్ మరియు అతని పనివాడైన, డ్రోమియో ఆఫ్ సిరక్యూస్, ఎఫెసుస్‌కు వస్తారు, అది వారి కవల సోదరులైన అంటిఫోలుస్ ఆఫ్ ఎఫెసుస్ మరియు అతని పనివాడైన డ్రోమియో ఆఫ్ ఎఫెసుస్‌ల స్వంత ప్రదేశం అవుతుంది. సిరక్యూజన్లు వారి కవలల యొక్క స్నేహితులని మరియు కుటుంబాలని కలసినపుడు, గుర్తించడంలో దోషాలపై ఆధారపడిన అనేక క్రూర దురదృష్టకర సంఘటనలు, దోషపూరిత దెబ్బలకు, ఒక -ఆకర్షణ ఏర్పడటానికి, అంటిఫోలుస్ ఆఫ్ ఎఫెసుస్ యొక్క ఖైదుకు, మరియు అవిశ్వాసం, దొంగతనం, పిచ్చితనం, మరియు దయ్యపు అంశను కలిగిఉండటం వంటి ఆరోపణలకు దారితీస్తాయి.

మూలాలు

కథాంశంలోని కీలక భాగాలు ప్లౌటోస్ రచించిన రెండు రోమన్ హాస్యరచనల నుండి గ్రహించబడ్డాయి.

మేనేచ్మి నుండి ముఖ్య ఉపోద్ఘాతంలోని గుర్తింపులో దోషాలు, ఒకే పేరుతో ఉన్న సారూప్య కవలల మధ్య జరిగేవి, హాస్యపూరితమైన వేశ్య వంటి కొన్ని మూల పాత్రలు వచ్చాయి. మేనేచ్మి లో కవలలలో ఒకరు ఎపిడంనుస్ నుండి వస్తారు; షేక్‌స్పియర్ దీనిని ఎఫెసుస్‌గా మార్చి, సెయింట్ పాల్ యొక్క [[::en:Epistle to the Ephesians|ఎపిస్టెల్ టు ది ఎఫేసియన్స్‌]]కు అనేక ఉదహరింపులను చేర్చాడు.

అమ్ఫిట్రుయో నుండి ఆయన ఒకే పేరుతో ఉన్న కవల పనివారిని, మరియు మూడవ సన్నివేశంలో అతని భార్య అతని వలెనె కనిపించే వ్యక్తితో పొరపాటుపడి భోజనం చేస్తూ, అతన్ని ఇంటి బయట ఉంచే దృశ్యాన్ని తీసుకున్నాడు.

ఎజియన్ మరియు ఎమిలియాల ఉపకథ అపోల్లోనియాస్ ఆఫ్ టైర్ నుండి గ్రహించబడింది, ఇది ట్వెల్ఫ్త్ నైట్ మరియు పెరిక్లెస్, ప్రిన్స్ ఆఫ్ టైర్ ‌లకు కూడా మూలంగా ఉంది.

కాలము & సారాంశం

1589 నుండి 1595 వరకు ఏ సమయంలోనైనా ఫ్రాన్స్‌లో జరిగిన వారసత్వ యుద్ధాల విషయ సూచనలను ఈ నాటకం కలిగిఉంటుంది. విల్లియం వార్నర్ యొక్క మేనేచ్మి అనువాదం స్టేషనర్స్ కంపెనీ రిజిస్టర్‌లో జూన్ 10, 1594న నమోదై 1595లో ప్రచురింపబడింది. లార్డ్ చంబెర్లైన్స్ మెన్ యొక్క పోషకుడైన లార్డ్ హన్స్డన్‌కు వార్నర్ యొక్క అనువాదం అంకితం చేయబడింది. అనువాదం ముద్రించబడకముందే షేక్‌స్పియర్ దానిని వ్రాతప్రతిలో చూసి ఉండవచ్చని భావించబడింది— ఇది ప్లుటుస్ వ్యాకరణ పాఠశాల విద్యార్ధుల పాఠ్యప్రణాళికలో భాగం అనేది కూడా నిజమే. చార్లెస్ విట్‌వర్త్, నాటకం యొక్క తన కూర్పులో, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ "1594 యొక్క తరువాయి భాగంలో" రచింపబడిందని వాదిస్తాడు.[1] 1623లో ఫస్ట్ ఫోలియోలో కనబడేవరకు ఈ నాటకం ప్రచురింపబడలేదు.

పాత్రలు

కథా సారాంశం

సుమారు సెప్టెంబర్, 2008లో కార్మెల్‌లోని ఫారెస్ట్ థియేటర్‌లో కార్మెల్ షేక్-స్పియర్ ఫెస్టివల్ నిర్మాణం వద్ద కవల డ్రోమియోలు.

ఎఫెసుస్‌లో సిరక్యుసియన్ వర్తకులను నిషేధిస్తూ ఉన్న చట్టం కారణంగా, పెద్ద వయస్కుడైన సిరక్యుసియన్ వర్తకుడు ఈజియన్‌ను నగరంలో కనుగొన్నపుడు అతనికి మరణశిక్ష విధించబడుతుంది. వెయ్యి మార్కుల జరిమానాను చెల్లించడం ద్వారా మాత్రమే అతను ఆ శిక్ష నుండి తప్పించుకోగలడు. అతను రాజుకు తన దుఃఖభరితమైన కథను వినిపిస్తాడు. యవ్వనంలో ఉండగా, అతనికి వివాహమై, ఇద్దరు కవల కుమారులు జన్మిస్తారు. అదే రోజున ఒక పేద వనిత కూడా ఇద్దరు కవల కుమారులకి జన్మనిస్తుంది, అతను వారిని తన కుమారులకి బానిసలుగా కొనుగోలుచేస్తాడు. ఆ తరువాత వెంటనే, వారు ఒక సముద్ర ప్రయాణానికి బయలుదేరగా, ఒక తుఫానును ఎదుర్కొంటారు. ఈజియన్, తనను, ఒక కుమారుడు మరియు ఒక బానిసతో ఓడ స్తంభానికి కట్టివేసుకోగా, అతని భార్యని ఒక పడవ, అతనిని మరొక పడవ రక్షిస్తాయి. ఈజియన్ మరలా ఎప్పుడూ భార్యను కానీ, ఆమెతో ఉన్న పిల్లలను కానీ చూడలేకపోయాడు. ఇటీవల, ఇప్పుడు యువకుడైన, అతని కుమారుడు అంటిఫోలుస్ ఆఫ్ సిరక్యూస్, మరియు అతని బానిస డ్రోమియో ఆఫ్ సిరక్యూస్, తమ సోదరుల కొరకు అన్వేషణలో సిరక్యూస్ వదలివెళ్లారు. అంటిఫోలుస్ ఆఫ్ సిరక్యూస్ తిరిగి రాకపోవడం వలన, ఈజియన్ అతనిని వెదకటానికి బయలుదేరాడు.

ఎఫెసుస్ యొక్క రాజైన సోలినుస్, అతని కథ విని చలించిపోయి, ఈజియన్‌కు జరిమానా చెల్లించడానికి ఒకరోజు గడువు ఇస్తాడు.

అదేరోజు, అంటిఫోలుస్ ఆఫ్ సిరక్యూస్ తన సోదరుని వెదకుతూ ఎఫెసుస్‌కు వస్తాడు. అతను, డ్రోమియో ఆఫ్ సిరక్యూస్‌ను కొంత డబ్బు జమ చేయడానికి ది సెంటార్ (సత్రము) కు పంపుతాడు. అదే పోలికలతో ఉన్న డ్రోమియో ఆఫ్ ఎఫెసుస్ దాదాపు వెంటనే కనిపించి, డబ్బు గురించి తనకు ఏమీ తెలియదని, భోజనానికి ఇంటికి రమ్మని, అతని భార్య వేచి ఉన్నదని చెప్పడంతో అతను అయోమయానికి గురవుతాడు. తన సేవకుడు అవిధేయమైన హాస్యం చేస్తున్నాడని అనుకున్న అంటిఫోలుస్, డ్రోమియోను కొడతాడు.

డ్రోమియో ఆఫ్ ఎఫెసుస్ తన యజమానురాలైన అడ్రియానా వద్దకు తిరిగివెళ్లి, ఆమె "భర్త" ఇంటికి తిరిగి రావడానికి తిరస్కరించాడని, ఆమె ఎవరో కూడా తెలియనట్లు నటించాడని చెప్తాడు. తన భర్త చూపు దారి తప్పుతోందని భావిస్తున్న అడ్రియానా, ఈ వార్తను తన అనుమానాలకు నిర్ధారణగా తీసుకుంటుంది.

అంటిఫోలుస్ ఆఫ్ సిరక్యూస్, "మొదట నేను అతనిని దుకాణం నుండి పంపినందువలన నేను డ్రోమియోతో మాట్లాడరాదు," అని అనుకుంటూ డ్రోమియోని కలుస్తాడు, అతను ఇప్పుడు అంటిఫోలుస్‌తో అతనికి భార్య ఉన్నట్లు తాను "హాస్యం" ఆడానని ఒప్పుకోడు. అంటిఫోలుస్ మరలా అతనిని కొట్టడం ప్రారంభిస్తాడు. అకస్మాత్తుగా, అడ్రియానా, అంటిఫోలుస్ వద్దకు పరుగున వచ్చి తనను వదలివేయద్దని వేడుకుంటుంది. సిరక్యుసన్లు ఏమీ చేయలేక ఈ వింత సంఘటనలన్నీ మంత్రాలుగా భావించి, ఎఫెసుస్‌ను, మంత్రాలతో నిండి ఉన్న ప్రాంతంగా పేర్కొంటారు. అంటిఫోలుస్ మరియు డ్రోమియో ఈ అపరిచిత స్త్రీతో భోజనానికి వెళ్లి, గేటు వేస్తారు.

అంటిఫోలుస్ ఆఫ్ ఎఫెసుస్ భోజనానానికి వచ్చి, డ్రోమియో ఆఫ్ సిరక్యుస్ తనకు తన స్వంత ఇంటిలోకి అమర్యాద పూర్వకంగా గేటు వద్ద అనుమతి నిరాకరించబడటంతో క్రోధానికి గురవుతాడు. అతను గేటుని బ్రద్దలు కొట్టడానికి తయారవుతాడు, కానీ అతని స్నేహితులు గొడవ వద్దని అతనిని నివారిస్తారు. అతను ఒక వేశ్యతో భోజనం చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఇంటి లోపల, అంటిఫోలుస్ ఆఫ్ సిరక్యుస్ తన "భార్య" సోదరి, లూసియానా పట్ల అతను బాగా ఆకర్షితుడైనట్లు తెలుసుకొని, ఆమెతో "శిక్షణ వద్దు నాకు, మధుర మత్స్యకన్నె, నీ సూచనతో/ నీ సోదరి కన్నీటి వరదలో నన్ను ముంచేందుకు." ఆమె అతని శ్రద్ధతో ఉబ్బిపోతుంది, కానీ తమ నైతిక నియమాల గురించి చింతిస్తుంది. ఆమె, నిష్క్రమించిన తరువాత డ్రోమియో ఆఫ్ సిరక్యూస్ తనకు భార్య ఉన్నట్లు తాను కనుగొన్నానని ప్రకటిస్తాడు: నెల్, ఒక వికారమైన వంట పరిచారిక. "గుండ్రంగా, గ్లోబ్ లాగా ఉంది; నేను దేశాలను చూడగలుగుతాను ఆమె...పిరుదులలో: నేను దీనిని మృదువైన ప్రదేశాల ద్వారా కనుగొన్నాను." అతను "కెంపులు, మాణిక్యములు, నీలములచే అలంకరింపబడిన ఆమె నాసికపై, స్పెయిన్ యొక్క వెచ్చని శ్వాసతో వాటి గొప్ప లక్షణాలను కోల్పోయి; పూర్తి యుద్ధ నౌకాదళాన్ని ఆమె నాసికకు స్థిరత్వాన్ని ఇవ్వటానికి పంపిన" అమెరికా మరియు ఇండీస్‌లను కనుగొన్నానని ప్రకటించాడు. ఇది అమెరికా గురించి షేక్‌స్పియర్ యొక్క అతి కొద్ది సూచనలలో ఒకటి. సిరక్యుసన్లు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పారిపోవాలని నిర్ణయించుకుంటారు, డ్రోమియో ప్రయాణపు ఏర్పాట్ల కొరకు వెళ్ళిపోతాడు. ఒక స్వర్ణకారుడైన అంజెలో, బంగారం గొలుసు చేయమని తనను ఆజ్ఞాపించినందుకు అంటిఫోలుస్‌ను అడ్డగిస్తాడు. అంటిఫోలుస్ గొలుసుని స్వీకరించడానికి బలవంతం చేయబడతాడు, అంజెలో, తాను చెల్లింపు కొరకు మరలా వస్తానని చెప్తాడు.

అంటిఫోలుస్ ఆఫ్ ఎఫెసుస్, డ్రోమియో ఆఫ్ ఎఫెసుస్‌ను తనను బయట తాళం వేసినందుకు తన భార్య అడ్రియానాను కొట్టడానికి ఒక తాడు కొనుగోలు చేయడానికి పంపుతాడు, అప్పుడు అతనిని అంజెలో పలకరించి, "నేను మిమ్మల్ని ముళ్ళపంది వద్దకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను" అని చెప్పి గొలుసు డబ్బులు ఇవ్వవలసినదిగా అడుగుతాడు. అతను తాను ఎప్పుడూ దానిని చూడలేదని బదులు ఇచ్చిన వెంటనే ఖైదుచేయబడతాడు. అతనిని తీసుకొని వెళుతుండగా, డ్రోమియో ఆఫ్ సిరక్యుస్‌రాగా, అతనిని అంటిఫోలుస్ తన బెయిల్ కొరకు డబ్బు తీసుకొని రావలసిందిగా అడ్రియానా ఇంటికి పంపుతాడు.

ఈ దోషపూరిత ఉదంతం పూర్తికాగానే, డ్రోమియో ఆఫ్ సిరక్యూస్ డబ్బును పొరపాటుగా అంటిఫోలుస్ ఆఫ్ సిరక్యూస్‌కి బట్వాడా చేస్తాడు. అంటిఫోలుస్ బంగారు గొలుసును ధరించడాన్ని వేశ్య గమనించి, దానిని తనకు ఇస్తానని ప్రమాణం చేసారని అడుగుతుంది. సిరక్యుసన్లు దీనికి తిరస్కరించి పారిపోతారు. ఈ వేశ్య అడ్రియానాకు ఆమె భర్త పిచ్చివాడని తెలియచేస్తుంది. డ్రోమియో ఆఫ్ ఎఫెసుస్ తాడుతో ఖైదు చేయబడిన అంటిఫోలుస్ ఆఫ్ ఎఫెసుస్ వద్దకు వస్తాడు. అంటిఫోలుస్ కోపోద్రిక్తుదౌతాడు. అడ్రియానా, లూసియానా మరియు వేశ్య, పించ్ అనే మంత్రగాడితో ప్రవేశిస్తారు, అతడు ఎఫెసియన్ల విమోచనం గురించి ప్రయత్నించి, వారిని బంధించి అడ్రియానా ఇంటికి తీసుకువెళతారు. సిరక్యుసన్లు కత్తులతో తిరిగిరాగా అందరూ వారు పగతో బంధనాలు తప్పించుకొని వచ్చిన ఎఫెసియన్లుగా నమ్మి, భయపడి పరుగెత్తుతారు. అడ్రియానా అనుచరులతో తిరిగి రాగా, వారు సిరక్యుసన్లను బంధించడానికి ప్రయత్నిస్తారు. వారు సమీపంలోని మఠంలో రక్షణ పొందగా, అక్కడి సన్యాసినుల అధినేత వారిని రక్షిస్తుంది.

ఈజియన్ యొక్క మరణశిక్షకు వెళ్ళే మార్గంలో, రాజు మరియు ఈజియన్ ప్రవేశిస్తారు. అడ్రియానా తన భర్తను విడుదల చేయమని మఠం యొక్క అధిపతిని వత్తిడి చేయమని రాజుని ప్రార్థిస్తుంది. అప్పుడు, అడ్రియానా ఇంటి నుండి ఒక సందేశకుడు పరిగెత్తుతూ వచ్చి ఎఫిసియన్లు తమ బంధనాలను వదలించుకొని డాక్టర్ పించ్‌ను హింసించారని తెలుపుతాడు. అప్పుడు ఎఫెసియన్లు ప్రవేశించి ప్రభువును అడ్రియానాకు వ్యతిరేకంగా న్యాయం చెప్పవలసిందిగా అడుగుతారు. ఈజియన్ అతన కొడుకు అంటిఫోలుస్‌ను కనుగొన్నట్లు విశ్వసించి, తనకు బెయిల్ ఇస్తాడని అనుకుంటాడు, కానీ ఎఫిసియన్లు తాము అంతకు ముందు ఎప్పుడూ అతనిని చూడలేదని చెప్తారు.

అకస్మాత్తుగా, మఠం యొక్క అధినేత సిరక్యుసన్ కవలలతో ప్రవేశిస్తుంది, మరియు ప్రతివారు ఆ రోజు జరిగిన గందరగోళ సంఘటనలను అర్ధం చేసుకోవడం ప్రారంభిస్తారు. రెండు జతల కవలలు తిరిగి కలవడంతో పాటు, మఠాధిపతి తాను ఈజియన్ భార్య ఎమిలియానని వెల్లడిస్తుంది. రాజు ఈజియన్‌ను క్షమిస్తాడు. కుటుంబం యొక్క పునరేకీకరణ వేడుకను జరుపుకోవడానికి అందరూ మఠంలోకి నిష్క్రమిస్తారు.

విశ్లేషణ

శతాబ్దాలుగా, పండితులు ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్లో విషయపరంగా చాలా తక్కువ సంపూర్ణతను కనుగొన్నారు. ది మేనేచ్మిలో దాని మూలాలు ఈ నాటకాన్ని చాలా సులభమైన, హాస్యకరమైన రచనగా చూడటానికి దారితీసాయి. షేక్‌స్పియర్ ఉద్దేశపూర్వకంగానే మరింత గంభీరమైన, విషాదాంతమైన లేదా తరువాత హాస్యరచనలలో ఉన్న విషయాలను దీనిలో వదలివేసాడని తరచు భావించబడుతుంది.

ఏదేమైనా, ఇటీవలి కాలంలోని పండితులు ఒక విభిన్నమైన దృష్టిని వెలిబుచ్చారు. ప్రత్యేకించి ఈ నాటకంలో చెప్పుకోదగినవి సాంఘిక సంబంధాల శ్రేణులు, రోమన్ చరిత్ర నుండి చూస్తే ఆధునికత ప్రారంభంలోని మార్పుకు ప్రత్యేక గుర్తింపును పొంది షేక్‌స్పియర్ యొక్క నాటకానికి నిరంతరం మార్గదర్శకంగా ఉన్నాయి. ఎరిక్ హీంజ్ ప్రస్తావించినట్లు, ఆ సంబంధాలు, యజమాని-సేవకుడు, భార్య-భర్త, తల్లిదండ్రులు-బిడ్డ, స్వదేశీయుడు-విదేశీయుడు, కొనుగోలుదారు-అమ్మకందారు, మరియు నియంత-పార్లమెంట్‌ల మధ్య వైరుధ్యాలని కలిగిఉన్నాయి. ప్రతి సంబంధము తన భూస్వామ్య రూపాలను వదలించుకోవడం వలన ఒక క్లిష్ట పరిస్థితిలో ఉండి, ప్రారంభ ఆధునిక ఐరోపా యొక్క మార్కెట్ శక్తులను ఎదుర్కుంటుంది[2].

ప్రదర్శన

ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ యొక్క రెండు ప్రారంభ ప్రదర్శనలు నమోదు చేయబడ్డాయి. ఒకటి, గెస్ట గ్రయోరమ్ ("ది డీడ్స్ ఆఫ్ గ్రే") లో పేర్కొన్న విధంగా "నిమ్న మరియు సామాన్య ప్రజల సంస్థచే" గ్రే'స్ ఇన్ హాల్‌లో డిసెంబర్ 28, 1594న ప్రదర్శించబడింది. రెండవది కూడా "ఇన్నోసెంట్స్' డే నాడు ప్రదర్శించబడింది," అయితే పది సంవత్సరాల తరువాత: డిసెంబర్ 28, 1604 న కోర్ట్‌లో జరిగింది.[3]

కళాత్మక లక్షణాలు

ప్రారంభ దృశ్యంలో ఈజియన్ ఈ నాటకంలో ఇప్పటివరకు ఉన్న సుదీర్ఘ ఉపన్యాసాన్ని ఇస్తూ ("అంత భారమైన పని విధించి ఉండవలసినది కాదు"), చిన్నవయసులోనే ఈ రెండు జతల కవలలు ఏవిధంగా విడిపోయినదీ వివరిస్తాడు.

421 పదాలతో అది సంపూర్ణ వ్యక్తీకరణ యొక్క సుదీర్ఘ పత్రానికి ప్రమాణంగా కూడా ఉంది. ఈజియన్ (మరియు రాజు కూడా) చివరి దృశ్యం వరకు మరలా కనిపించరు.

అనుసరణలు

నాటకాలు

1734లో, సీ ఇఫ్ యు లైక్ ఇట్ అనే అనుసరణ కావెంట్ గార్డెన్‌లో ప్రదర్శించబడింది. డ్రురీ లేన్ 1741లో ఒక నిర్మాణాన్ని ప్రారంభించాడు, దీనిలో చార్లెస్ మాక్లిన్ డ్రోమియో ఆఫ్ సిరక్యూస్‌గా నటించాడు —ఇదే సంవత్సరంలో ఇతను తన ప్రసిద్ధ పురోగతి చెందిన పాత్రగా షైలాక్‌ను పోషించాడు. 1980లలో, ఫ్లయింగ్ కరమజోవ్ బ్రదర్స్ ఈ నాటకం యొక్క ప్రత్యేక అనుసరణను లింకన్ సెంటర్‌లో ప్రదర్శించారు; ఇది MTV మరియు PBSలలో చూపబడింది. ది రీజెంట్స్ పార్క్ ఓపెన్ ఎయిర్ థియేటర్, తమ 2010 వేసవి కాలంలో భాగంగా ఫిలిప్ ఫ్రాన్క్స్ దర్శకత్వంలో ఈ నాటకం యొక్క నూతన నిర్మాణాన్ని ప్రదర్శించనుంది.

ఈ నాటకాన్ని కందుకూరి వీరేశలింగం చమత్కార రత్నావళి పేరుతో 1880 లో తెలుగు లోనికి అనువదించాడు.

ఒపేరా

27 డిసెంబర్, 1786న, స్టీఫెన్ స్టోరేస్‌చే గ్లి ఈక్వివోసి ఒపేరా యొక్క ప్రారంభ ప్రదర్శన వియెన్నాలోని బుర్గ్ ధియేటర్‌లో జరిగింది. లోరెంజో డా పొంటె యొక్క లిబ్రెట్టోలో కొన్ని పాత్రల పేర్లు మార్చబడినప్పటికీ, నాటకం యొక్క కథాంశం చాలా సన్నిహితంగా అనుసరించబడింది.[4]

ఫ్రెడెరిక్ రేనాల్డ్స్ 1819 లో అందించిన ఒపేరా రూపాంతరానికి సంగీతాన్ని హెన్రీ బిషప్ సమకూర్చగా కొన్ని పాటలను మొజార్ట్ మరియు ఆర్నె అందించారు. 1855లో, సామ్యూల్ ఫెల్ప్స్ సాడ్లర్స్ వెల్స్ థియేటర్‌లో అసలైన షేక్‌స్పియర్ రూపాన్ని పునరుద్ధరించే వరకు అనేక ఇతర అనుసరణలు ప్రదర్శించబడ్డాయి.[5]

సంగీత పరమైనవి

ఈ నాటకం సంగీత రూపకంగా కనీసంగా మూడుసార్లు అనుసరించబడింది, మొదటిసారి ది బాయ్స్ ఫ్రమ్ సిరక్యూస్ ‌గా రిచర్డ్ రోడ్జర్స్ మరియు లోరెంజ్ హార్ట్‌ల సంగీతంతో, మరియు 1977లో అత్యుత్తమ సంగీతానికి లారెన్స్ ఆలివర్ పురస్కారం పొందిన వెస్ట్ ఎండ్ సంగీతంగా మరియు 1981లో ఓ, బ్రదర్! ‌గా మైకేల్ వలేంటి మరియు డోనాల్డ్ డ్రైవర్‌ల సంగీతంతో ఒక హిప్-హాప్ సంగీత అనుసరణగా, ది బొంబ్-ఇట్టి ఆఫ్ ఎర్రర్స్, HBO యొక్క హాస్య ఉత్సవంలో మొదటి బహుమతి గెలుచుకొని 2001లో స్టీఫెన్ సొంధేయిమ్‌కు ప్రతిగా ఉత్తమ రచన కొరకు డ్రామా డెస్క్ అవార్డ్ కొరకు ప్రతిపాదించబడింది.

చలనచిత్రం

బిగ్ బిజినెస్ అనే చిత్రం ఎ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ యొక్క ఆధునిక చిత్రీకరణ. షేక్‌స్పియర్ యొక్క నాటకంలో వలెనే జన్మ సమయంలో విడిపోయిన రెండు జతల కవలలుగా బెట్టె మిడ్లర్ మరియు లిలీ టాంలిన్ ఈ చిత్రంలో నటించారు. భారతీయ సినిమారంగం కూడా ఈ నాటకంపై చలనచిత్రాలు నిర్మించింది. 1. కిషోర్ కుమార్ నటించిన దో దూని చార్ 2.సంజీవ్ కుమార్ నటించిన అంగూర్.

టెలివిజన్

ప్రసిద్ధ TV ప్రదర్శన ది X-ఫైల్స్లో "ఫైట్ క్లబ్" యొక్క కథ, ఈ నాటకంలోని అనేక అంశాలతో సమాంతరంగా నడుస్తుంది.

  • ఎస్ ప్రైమ్ మినిస్టర్ ధారావాహికలోని "ది పాట్రన్ ఆఫ్ ది ఆర్ట్స్" భాగంలో ప్రధాన మంత్రి జేమ్స్ హాకర్ "వారు (ది నేషనల్ థియేటర్) కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌ని నెంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో చేస్తున్నారు" అని ఫిర్యాదు చేస్తాడు.

చిత్రమాలిక

గమనికలు

  1. చార్లెస్ వాల్టర్స్ విట్‌వర్త్, సంకలనం., ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ఆక్స్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2003; పేజీలు. 1-10.
  2. ఎరిక్ హెంజ్, '"వర్ ఇట్ నాట్ అగైన్స్ట్ అవర్ లాస్": అప్రెషన్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ షేక్‌స్పియర్స్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ , 29 లీగల్ స్టడీస్ (2009), పేజీలు. 230 – 63
  3. సారూప్య తేదీలు యాదృచ్చికం కాకపోవచ్చు; నాటకంలోని పాలిన్ మరియు ఎఫేసియన్ అంశం, వనరులుగా గుర్తించబడి, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ట్వెల్ఫ్త్ నైట్, వలె సెలవుల కాలానికి జతయ్యే ప్రభావానికి లోనయి ఉండవచ్చు, ఈ నాటకం పైకి లౌకికంగా ఉన్నప్పటికీ క్రిస్మస్ సెలవులతో ముడిపడిఉంది.
  4. Holden, Amanda. The Viking Opera Guide. London: Viking. p. 1016. ISBN 0-670-81292-7. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  5. F. E. హల్లిడే, ఎ షేక్‌స్పియర్ కంపానియన్ 1564-1964, బాల్టిమోర్, పెంగ్విన్, 1964; పేజీ.112.

సూచనలు

  • Public Domain This article incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). Encyclopædia Britannica (11th ed.). Cambridge University Press. Cite has empty unknown parameters: |HIDE_PARAMETER15=, |HIDE_PARAMETER4=, |HIDE_PARAMETER2=, |separator=, |HIDE_PARAMETER14=, |HIDE_PARAMETER8=, |HIDE_PARAMETER13=, |HIDE_PARAMETER5=, |HIDE_PARAMETER7=, |HIDE_PARAMETER10=, |HIDE_PARAMETER6=, |HIDE_PARAMETER9=, |HIDE_PARAMETER3=, |HIDE_PARAMETER1=, |HIDE_PARAMETER11=, and |HIDE_PARAMETER12= (help); Missing or empty |title= (help)CS1 maint: ref=harv (link)

బాహ్య లింకులు