"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
దుగ్యాల శ్రీనివాస రావు
దుగ్యాల శ్రీనివాస రావు | |
---|---|
జననం | ఆగష్టు 16, 1964 |
మరణం | 11 జనవరి, 2021 |
మరణ కారణం | అనారోగ్యం |
జాతీయత | భారతీయుడు |
విద్య | దుగ్యాల శ్రీనివాస రావు |
వృత్తి | బిఏఎంఎస్ |
ఉద్యోగం | ఆయుర్వేద డాక్టర్ |
రాజకీయ పార్టీ | కాంగ్రేస్ పార్టీ |
భాగస్వామి | సుమన |
దుగ్యాల శ్రీనివాస రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, మాజీ శాసనసభ్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా (2004-2009) పనిచేశాడు.[1]
Contents
జీవిత విశేషాలు
ఆయన వరంగల్ గ్రామీణ జిల్లా, వర్ధన్నపేట మండలం, నల్లబెల్లి గ్రామంలో జన్మించాడు. వరంగల్లులో బిఏఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ చదివాడు. ఈయన భార్య సుమన.
కాంట్రాక్టర్‌గా
బిఏఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ వృత్తి అయినా, కాంట్రాక్టర్ గా ప్రభుత్వ లైసెన్స్ పొంది ఆర్&బి పనులు చేస్తూండేవాడు.
శాసనసభ్యునిగా
అప్పటి చెన్నూర్ ఇప్పటి పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలో నెమురుగోమ్ముల యెతిరాజారావు కుటుంబ సభ్యులు 1962- 2004 వరకు శాసనసభ్యులుగా గెలిచారు. పాలకుర్తి నియోజకవర్గం 2004 వరకు చెన్నూరు నియోజకవర్గంలో ఉండేది. చెన్నూరు సెగ్మెంట్ లో పాలకుర్తి, కొడకండ్ల, తొర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాలుండేవి. 2009 డీలిమిటేషన్ లో చెన్నూరు నుంచి విడిపోయి, పాలకుర్తి సెగ్మెంట్ గా ఏర్పడింది. తొర్రూర్, కొడకండ్ల, పాలకుర్తి మండలాలతోపాటు వర్థన్నపేట నియోజకవర్గంలోని రాయపర్తి, జనగామలోని దేవరుప్పల మండలాలు ఇందులో కలిసిపోయాయి. పాలకుర్తిలో ఉన్న నర్సింహులపేటను డోర్నకల్ లో… నెల్లికుదురును మహబూబాబాద్ లో కలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయి. నెమురుగోమ్ముల సుధాకర్ రావు సొంత తమ్ముడు శ్రీ నెమురుగోమ్ముల ప్రవీణ్ రావు మద్దతుతో శ్రీనివాసరావు 2004లో శాసనసభ్యుడిగా గెలిచాడు.[2]
మరణం
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021, జనవరి 11న మరణించాడు.[3]
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ, హైదరాబాదు (11 January 2021). "మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత". ntnews. Archived from the original on 11 January 2021. Retrieved 11 January 2021.
- ↑ తక్కవ మెజారిటీతో గట్టెక్కిన ఎర్రబెల్లి…[permanent dead link]
- ↑ వి6 వెలుగు, వరంగల్ (11 January 2021). "మాజీ ఎంఎల్ఏ దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత". V6 Velugu. Archived from the original on 11 January 2021. Retrieved 11 January 2021.
ఇతర లింకులు
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా రాజకీయ నాయకులు
- జనగామ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- 2021 మరణాలు