"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దూర విద్య

From tewiki
Jump to navigation Jump to search

దూర విద్య అనగా విద్యార్థులు తమ నివాసంలోనే వుంటూవిద్య నేర్చుకోవడం. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలు, దృశ్య శ్రవణ సాధనాలు, అప్పుడప్పుడు సంపర్క తరగతులు వాడుతారు. మొట్టమొదటగా 1960 లో ఇంగ్లాండ్ లో యూనివర్సిటీ ఆఫ్ ఎయిర్ అనే సంస్ధని దూర విద్యకోసం స్ధాపించారు. భారత దేశంలో 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లో 1982 లో డా2007.2008క్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్యని ప్రవేశ పెట్టాయి. చదువు మధ్యలో ఆపిన వారికి, ఉద్యోగాలు చేస్తూ పై చదువులపై అసక్తి కలవారికి, తక్కువ ఖర్చుతో చదువుకోనాలసుకొనే వారికి ఇదిచాలా ఉపయోగం.

దూరవిద్య లక్ష్యం

దూర విద్య లేదా దూర అభ్యసన అనేది విద్యావ్యవస్థలో ఒక రంగం. ఈ రంగం బోధన, సాంకేతికం మరియు సాంప్రదాయంగా తరగతి గదులలో లేదా క్యాంపస్‌లో "ప్రత్యక్షంగా" లేని విద్యార్థులు విద్యని అభ్యసించే ఉద్దేశంతో కూడిన పద్ధతులను కలిగి ఉంటుంది. "బోధించే వారు మరియు విద్యార్ధులు, కాలం, దూరంతో వేరుగా ఉన్న పరిస్థితిలలో అభ్యసించడానికి సృష్టించబడిన పద్ధతి" అని ఈ విద్యారంగంలో వివరించబడుతుంది.[1] విద్యార్థికి తరగతి గది బయట అదే నాణ్యతతో కూడిన ఒక విద్యా అనుభూతిని కలిగించే పద్ధతి దూర విద్య . ప్రత్యక్షంగా విద్యార్థులు ఒక చోట హాజరు కావలసిన అవసరమున్న దూర విద్య కోర్సులు సంకర లేదా మిశ్రమ కోర్స్ అని పిలువబడుతాయి. ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతున్నాయి.[2] ఇటీవల కాలంలో సాంకేతిక రంగంలో ఏర్పడిన పురోగతి వలన అంతర్జాతీయంగా విద్యార్థులపై ప్రత్యేకమైన శ్రద్ధ మరియు సంబంధాన్ని అందించగలిగిన ఈ దూర విద్యారంగం ఇప్పుడు మరింత గుర్తింపు పొందుతూ ఉంది. "లావాదేవీల దూరం" అనే బోధనా సిద్ధాంతం దూర విద్య గురించి విస్తృతంగా అంగీకరించబడిన ఒక బోధనా సిద్ధాంతం[ఉల్లేఖన అవసరం]. దూర విద్యలో విద్యార్థిఇంటినుంచి గాని పనిస్థలం నుంచి గాని, ప్రయాణంలో ఉన్నప్పుడు గాని లేదా ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడనుంచి చదువగలే వీలు ఉంటుంది[3].

చరిత్ర

దూర విద్య యొక్క చరిత్ర 1728 లో ప్రారంభమయింది. బాస్టన్ గెజట్ లో ఒక ప్రకటన వెలుబడింది...'కొత్త సంక్షిప్త లిపి పద్ధతిని బోధించే అధ్యాపకుడు కెలబ్ ఫిలిప్స్' ప్రతివారం పాఠం పంపించే విధమునకు విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు.[4] 1840లలో తపాలా వ్యవస్థ ద్వారా గ్రేట్ బ్రిటన్‌లో ఐసక్ పిట్మాన్ సంక్షిప్త లిపిని నేర్పించినప్పటినుంచి ఆధునిక దూర విద్య ఆచరణలో ఉంది.[5] 19వ శాతాబ్దములో తపాలా సేవలో జరిగిన అభివృద్ధి వలన వాణిజ్యపరమైన దూర విద్యా కళాశాలలు దేశవ్యాప్తంగా ఏర్పడ్డాయి.

తొలిసారిగా దూర విద్యా డిగ్రీలు అందించిన సంస్థ, లండన్ విశ్వవిద్యాలయం. 1858లో ఎక్స్టర్నల్ ప్రోగ్రాంను స్థాపించింది.[6] 1873లో మస్సచుసెట్స్ లోని బోస్టన్‌లో సొసైటి టు ఎంకరేజ్ స్టడీస్ అట్ హొమ్ స్థాపించబడింది. ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం దూర విద్యా విభాగాన్ని 1911లో నెలకొల్పింది.[7] దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయం (పూర్వం కేప్ ఆఫ్ గుడ్ హోప్ విశ్వవిద్యాలయం) 1873 నుంచే దూర విద్యా కోర్సులను నడుపుతూ ఉంది. న్యూ జీలాండ్‌లో, విశ్వవిద్యాలయం స్థాయిలో దూర విద్య 1960లో మాస్సే విశ్వవిద్యాలయంలో ప్రారంభమయింది. 1969లో స్థాపించబడిన ఓపన్ విశ్వవిద్యాలయం, యునైటడ్ కింగ్‌డం లోని అతిపెద్ద దూర విద్యా విశ్వవిద్యాలయం. స్పెయిన్ లోని పబ్లిక్ UNED (ఓపన్ విశ్వవిద్యాలయం కాదు) 1972లో స్థాపించబడింది. జెర్మనిలో హేగన్‌లో FernUniversität 1974లో స్థాపించబడింది. ప్రస్తుతం ఇటువంటి అనేక సంస్థలు, ఓపన్ విశ్వవిద్యాలయం (ఆంగ్లంలో లేదా స్థానిక భాషలో) అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వీటిలో డజను కంటే ఎక్కువ సంస్థలు 'మెగా విశ్వవిద్యాలయాలు', [8] అనగా 100,000 కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న సంస్థలు. ప్రస్తుతం 3,000,000 విద్యార్థులు ఉన్న ఇందిరా గాంధి నేషనల్ ఒపన్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతి పెద్దది. చికాగో విశ్వవిద్యాలయం యొక్క తొలి అధ్యక్షుడయిన విల్లియం రైనీ హర్పెర్ విస్తరణ విద్యా పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఈయనను "దూర విద్య ద్వారా అభ్యసన" పద్ధతి యొక్క వ్యవస్థాపకులలో ఒకరిగా పేర్కొంటారు. చికాగో విశ్వవిద్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లో మొదటి విస్తరణా సేవలను తపాలా ద్వారా ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యార్థులకు విద్యను అందించింది.[9]

విస్కాన్సిన్–మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన చార్లెస్ వెడెమేయర్‌ను అమెరికాలో ఆధునిక దూర విద్య యొక్క పితగా పేర్కొంటారు.[10] వెడెమెయర్ యొక్క ఆర్టికులేటడ్ ఇంస్ట్రక్షనల్ మీడియా ప్రాజెక్ట్ (AIM) కు 1964 నుంచి 1968 వరకు కార్నెగీ ఫౌండేషన్ నిధులు సమకూర్చింది. ఈ కార్యక్రమం క్యాంపస్‌లో లేని విద్యార్థులకు విద్యను అందించడానికి వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. మూర్ ప్రకారం, AIMతో ఆకర్షించబడిన బ్రిటిష్ వారు ఈ పద్ధతిని తామూ వాడి మొదటి ఓపెన్ విశ్వవిద్యాలయం సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ, తరువాత స్థాపించబడిన ఇతర ఓపన్ విశ్వవిద్యాలయాలనుంచి తమను వేరుగా చూడాలని, యునైటెడ్ కింగ్‌డం ఓపెన్ విశ్వవిద్యాలయం (UKOU) అని పేరు పెట్టుకుంది. UKOU, 1960ల ఆఖరిలో స్థాపించబడింది. టెలివిజన్ మరియు రేడియోలే పాఠాలు చెప్పడానికి ప్రధాన మాధ్యమాలుగా వాడబడ్డాయి. అప్పుడు అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా రంగంలో వాడడంలో ఆ సంస్థ ముందంజలో ఉండేది. అన్ని "ఓపన్ విశ్వవిద్యాలయాలు" దూర విద్యా పద్ధతులనే వాడతాయి.[11]

అంతే కాక, ఇంకా అనేక ప్రైవేట్, పబ్లిక్, లాభార్జన-లేని సంస్థలు మరియు లాభార్జన-కలిగిన సంస్థలు దూర విద్య ద్వారా వివిధ కోర్సులను మరియు డిగ్రీలను అందిస్తున్నాయి. ఆ కాలములో దీనికి ఒక విజయవంతమైన ఉదాహరణ, కోస్ట్‌లైన్ కమ్యూనిటి కాలేజీ. ఈ కాలేజిని బెర్నార్డ్ లస్కిన్ స్థాపించారు. ఈ కాలేజికి క్యాంపస్ ఏమి లేదు కాని టెలికోర్సులను KOCE TV ద్వారా కాలిఫోర్నియా లోని ఆరెంజ్ కౌంటీలో అందించింది. అంగీకారము స్థాయిలలో మార్పులు ఉంటాయి; యునైటెడ్ స్టేట్స్ లో దూర విద్యను అందిస్తున్న కొన్ని సంస్థలకు ఎటువంటి బయట పర్యవేక్షణ లేదు. కొన్ని సంస్థలు మోసపూరితంగా డిప్లమాలను కుప్పలుకుప్పలుగా అందిస్తున్న కర్మాగారాలు కావచ్చు. ఇతర పలు ప్రాంతాలలో "విశ్వవిద్యాలయం" అనే పదాన్ని దేశీయ ప్రభుత్వం చేత గుర్తింపు లేకుండా వాడకూడదు. యునైటెడ్ స్టేట్స్‌లో ప్రధాన విశ్వవిద్యాలయాల మధ్య ఆన్‌లైన్ విద్య వేగవంతంగా గుర్తింపు పొందుతూ ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలలో ఆన్‌లైన్ డాక్టొరల్ ప్రోగ్రాంలు రూపొందించబడ్డాయి.[12]

ఇరవయ్యవ శతాబ్దములో రేడియో, టెలివిజన్ మరియు ఇంటర్నెట్ అన్ని కూడా దూర విద్య కొరకు వాడబడ్డాయి. కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ దూర విద్యను అందించే పనిని సులభంగాను వేగంగానూ మార్చాయి.[13] ప్రైవేట్ మరియు లాభార్జన కలిగిన ఫేనిక్స్ విశ్వవిద్యాలయం ప్రధానంగా ఒక ఆన్లైన్ విశ్వవిద్యాలయం. ఇక్కడ, ప్రస్తుతం 200,000 విద్యార్థులు చదువుతున్నారు. 2010 నాటికి ఈ సంఖ్య 500,000కు చేరవచ్చు. కాని ఇంత వేగవంతంగా పెరిగే విశ్వవిద్యాలయంలో విద్యార్థివిజయం సాధిస్తున్నారా లేదా అనేదాన్ని గురించి ఏమి బయటకు తెలియదు.[14] j 1996లో, కేబిల్ పయనీర్ గ్లెన్ జోన్స్ మరియు బెర్నార్డ్ లస్కిన్, ప్రాంతీయ గుర్తింపు సంస్థచే గుర్తింపు పొందిన మొదటి ఆన్‌లైన్ విశ్వవిద్యాలయం, జోన్స్ ఇంటర్‌నేషనల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. నార్త్ సెంట్రల్ అసోసియేషన్ అఫ్ స్కూల్స్ అండ్ కాలేజస్ చే JUI గుర్తింపు పొందింది.

యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న అతిపెద్ద కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో 96 శాతం ఆన్‌లైన్ కోర్సులను నడుపుతున్నాయని 2006లో స్లోవన్ కన్సార్టియం పేర్కొంది. 2005 ఫాల్ టర్మ్‌లో దాదాపు 3.2 మిలియను US విద్యార్థులు కనీసం ఒక ఆన్‌లైన్ కోర్సునైనా చదువుతున్నారని ఆ నివేదిక పేర్కొంది.[15]

చట్ట విద్యను ఆన్‌లైన్‌లో చదవడం యునైటెడ్ స్టేట్స్‌లో అతి వేగవంతంగా పెరుగుతూ ఉంది. కాలిఫోర్నియా స్టేట్ బార్ ఆన్‌లైన్ చట్ట స్కూల్‌లను నమోదు చేసుకుని నియంత్రిస్తుంది (కాని గుర్తింపు ఇవ్వదు). దూర విద్య ద్వారా చట్ట విద్య గురించిన, ముఖ్యంగా ఆన్‌లైన్ చట్ట స్కూల్ ల గురించిన పూర్తి వివరాలకు ఈ వికిపీడియాకు వెళ్లండి: http://en.wikipedia.org/wiki/Correspondence_law_school.

కెనడాలోని ఒంటారియోలో శిక్షణ, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల మంత్రిత్వం elearnnetwork.ca ను 2007లో స్థాపించింది. ఒంటారియోలోని చిన్న పట్టణాలు మరియు గ్రామీణప్రాంతాల విద్యార్థులకు దూర విద్య ద్వారా కళాశాల లేదా విశ్వవిద్యాలయ కోర్సులను అందుబాటులో తీసుకురావడమే దీని లక్ష్యం.[16]

మానిటోబా ప్రావిన్సులో విద్య, పౌరసత్వం మరియు యువజన శాఖ దూర విద్యలో మూడు ఎంపికలను ఇస్తుంది: స్వయంగా చదివే పద్ధతి, ఉపాధ్యాయుడు సహాయంతో చదివే పద్ధతి మరియు వెబ్-ఆధారిత కోర్స్ పద్ధతి.

స్వయంగా చదివే పద్ధతి (ISO) ద్వారా పాఠశాల-వయస్సు మరియు వయోజన విద్యార్థులు నిర్బంధ ఆప్షనల్ ప్రింట్ ఆధారిత దూర విద్య కోర్సులను 7 నుంచి 12 గ్రేడు వరకు జరపవచ్చు. ఈ దూర విద్యా పద్ధతిలో విద్యార్థులకు ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా సహాయం అందిస్తారు. స్వయంగా చదివే పద్ధతిలో పలు ఫ్రెంచ్ కోర్సులు కూడా ఉన్నాయి. విద్యార్థిఆ ప్రావిన్స్ ను తాత్కాలికంగా గాని నిరంతరంగా కాని వదిలి వెళ్తే, మానిటోబా కరికులాన్ని కొనసాగించి, సీనియర్ యియర్స్ గ్రాడ్యుయేషన్ డిప్లమాను పొందడానికి ISO అవకాశం ఇస్తుంది.

ఉపాధ్యాయుని సహాయం పొంది చదివే పద్ధతి (TMO) లో పాఠశాల జరిగే దినములో దూర విద్యా కోర్సులను అందిస్తారు. దీనికి వివిధరకాల సాంకేతిక సదుపాయాలను వాడుతారు: ఆడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఒక క్లాసుకు 40 నిమిషాలు బోధన, క్లాస్ జరిగిన తరువాత దానిని ఐదు రోజులపాటు వాడడానికి వీలుగా దానిని రికార్డింగ్ చేయడం మరియు క్లాసుల మధ్య అధ్యాపకుడుతో ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంటుంది. ఈ కోర్సులు పాఠశాలకు గాని వయోజన విద్యా కేంద్రానికి వెళ్ళేవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇంటర్నెట్ ద్వారా ఉన్నత పాఠశాల విద్యని అందించదలిచే పాఠశాలలకు వెబ్-ఆధారిత కోర్సులు మానిటోబాలో అందుబాటులో ఉంటాయి. మానిటోబా బ్లాక్ బోర్డ్ బోధనా సిస్టం CE వెర్షన్ 6.2 ను పాటిస్తుంది. ఈ కోర్సులు ఇంటర్నెట్ ద్వారా నేర్పబడుతాయి. అయితే అధ్యాపకుడు ఆ స్థలములో ఉండకపోవచ్చు. విద్యార్థులు అసైన్మెంట్ లను ఆన్‌లైన్ లో ఉపాధ్యాయులకు సమర్పిస్తారు. ఆఖరి పరీక్ష ఆన్-సైట్ లో జరుగుతుంది.[17]

K-12 పాఠశాలలు

కళాశాలలు, విశ్వవిద్యాలయాలే కాకుండా పెనిసిల్వేనియా లోని PA సైబర్ చార్టర్ వంటి అనేక K-12 పాఠశాలలు దూర విద్య పద్ధతిని వాడుతున్నాయి.yo tengo una tia una tia monica que cuando va al mercado decimos hay hay hay దూర విద్య ద్వారా నడపబడే ఈ K-12 పాఠశాలలు ఇతర పాఠశాలలో కుటుంబాలు పొందని ఒక విద్యా అనుభూతిని కలిగిస్తాయి. ఉదాహరణకు, పెన్సిల్వేనియా సైబర్ చార్టర్ పాఠశాల అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం మరియు కరికులాన్ని వాడి, మంచి అర్హత కలిగిన ఉపాధ్యాయులు, సిబ్బందులచే విద్యార్థులకు ఒక గొప్ప అనుభవాన్ని కలిగిస్తుంది. పాఠశాలలో కిండర్గార్టెన్ నుంచి 12వ గ్రేడ్ వరకు 9000 కంటే ఎక్కువగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి విద్యార్థికి, అతని ప్రత్యేకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక కరికులం రూపొందించబడుతుంది.[18]

బోధనలో వాడబడుతున్న సాంకేతిక పరిజ్ఞానం

సిన్క్రోనస్, అసిన్క్రోనస్ అనే రెండు సాంకేతిక అంశాలు దూర విద్యలో వాడబడుతున్నాయి: సిన్క్రోనస్ పద్ధతిలో ఆన్‌లైన్ లో దూర విద్యను అందించినప్పుడు, అందరు ఒకే సమయములో "హాజరు" అవుతారు. అందుకని, ఒక టైంటేబిల్ అవసరమవుతుంది. వెబ్ కాన్ఫెరెంసింగ్ సిన్క్రోనస్ పద్ధతికి ఒక ఉదాహరణ. అసిన్క్రోనస్ పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా విద్యను అందించినప్పుడు, పాల్గొనేవారు తమకు వీలుగా ఉన్న వేరు వేరు సమయాలలో కోర్స్ ను చదువుతారు. ఏక కాలములో అందరు విద్యార్థులు కలిసి ఉండాలనే అవసరం లేదు. మెసేజ్ బోర్డ్ ఫోరంలు, ఈ-మెయిల్ మరియు రికార్డ్ చేయబడిన వీడియో వంటివి అసిన్క్రోనస్ పద్ధతికి కొన్ని ఉదాహరణలు.

ప్రాథమిక, మాధ్యమిక విద్య

ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ [19] 14 సంవత్సరాలు నిండిస బాల బాలికలకు, ఎలాంటి విద్యార్హత లేకుండా 10 వతరగతి చదివే అవకాశం కలిగిస్తున్నది. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్[20] ద్వారా, సెకండరీ, సీనియర్ సెకండరీ కోర్సులు చేయవచ్చు. ఫిభ్రవరి 1991 లో సార్వత్రిక పాఠశాల సంఘం (ఎపిఒఎస్ఎస్) స్థాపించబడింది. ఈ సంస్థకు ముఖ్యమంత్రి ప్రధాన పోషకుడు మరియు విద్యా మంత్రి పోషకుడుగా వ్యవహరిస్తారు. 2008-09లో ప్రభుత్వ వుత్తర్వు ప్రకారం ఎపిఒఎస్ఎస్ జారిచేసి వుత్తీర్ణతా ధృవపత్రాలు (10 వ తరగతి (ఎపిఒఎస్ఎస్), మరియు ఇంటర్మీడియట్ (ఎపిఒఎస్ఎస్) ) సాధారణ నియత విద్యా మండళ్లు ( మాధ్యమిక విద్యా మండలి, ఇంటర్మీడియట్ విద్యా మండలి) జారి చేసే ధృవపత్రాలకు సమానా హోదా ఇవ్వబడింది. ఆ తరువాత 2006-07 లో ఉత్తీర్ణతా శాతం 66కు చేరింది.[21]

ఉన్నత విద్య

బోధన పద్ధతి

ఉదాహరణగా డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము వారు సాధారణంగా వాడే పద్ధతులు (వారానికి)

 • 12 నుండి 16 గంటలు కోర్సు పుస్తకాలు (స్వయం బోధనా పద్ధతిలో ముద్రించబడిన పుస్తకాలు)
 • ఆరు నుండి ఎనిమిది గంటలు దగ్గరిలో గల విద్యా కేంద్రములో సలహా సంసర్గ తరగతులు
 • 30 నిముషాలు రేడియో పాఠాలు (హైదరాబాదు ఎ రేడియో స్టేషను ఉ 7.25 నుండి 7.55 వరకు, మధ్యమ మరియు పొట్టి తరంగాల ద్వారా)
 • 2 నుండి 3 గంటలు దృశ్య, శ్రవణ లేక శ్రవణ పద్ధతులద్వారా చదువు (సోమ నుండి శుక్ర ఉ 5.30 నుండి 6.00 వరకు దూరదర్శన్ సప్తగిరి, మన టివిలో 9.30 నుండి 10.30 (వారపురోజులు), సా 4.00 నుండి 5.00 మరల ప్రసారం), గ్యాన దర్శన్ రాత్రి 10.30 నుండి 11.00)
 • దూర శ్రవణ (tele conf) సమావేశాలు (సా 2.00 నుండి 3.00 దూరదర్శన్ సప్తగిరి)

సిన్క్రోనస్ పద్ధతులు

 • వెబ్-ఆధారిత VoIP
 • టెలిఫోన్
 • వీడియో కాన్ఫరెన్సింగ్
 • వెబ్ కాన్ఫరెన్సింగ్
 • ప్రత్యక్ష సాటిలైట్ ప్రసారం
 • ఇంటర్నెట్ రేడియో
 • లైవ్ స్ట్రీమింగ్

అసిన్క్రోనస్ పద్ధతులు

 • ఆడియో కేసట్
 • ఈ-మెయిల్
 • సమాచార బోర్డ్ ఫోరంలు
 • అచ్చు వేసినవి[22]
 • వాయిస్ మెయిల్/ఫాక్స్
 • వీడియో కేసట్/DVD
 • ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ (జాప్యం చేయబడిన)

లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం లేదా లెర్నింగ్ కంటెంట్ మేనేజ్మ్నేంట్ సిస్టంలను కూడా వాడవచ్చు. వీటిని సిన్క్రోనస్ మరియు అసిన్క్రోనస్ బోధనలకు వాడవచ్చు. (LMS అనేది ఒక బోధనా ఉపకరణమే కాదు. అది ప్రధానంగా ఉపాధ్యాయునికి క్లాస్ ను మెరుగుగా నడపటానికి తోడ్పడుతుంది.)

వివిధ దూర విద్యా కోర్సుల రకాలు

 • సాంప్రదాయక తపాలా మరియు ఎలెక్ట్రానిక్ మెయిల్ ద్వారా జరిపే దూర విద్య
 • సిన్క్రోనస్ మరియు అసిన్క్రోనస్ పద్ధతులలో ఇంటర్నెట్ ద్వారా నడపబడేది
 • టెలికోర్స్/ప్రసారం, పాఠాలు రేడియో లేదా టెలివిషన్ ద్వారా నడపబడేది
 • CD-ROM, దీంట్లో విద్యార్థిఒక CD-ROMలో ఉన్న పాఠాలను చదువుతాడు.
 • పాకెట్ పిసి/మొబైల్ లెర్నింగ్. విద్యార్థిఒక మొబైల్ పరికరములో ఉన్న పాఠాలను లేదా ఒక వయర్లెస్ సర్వర్ ద్వారా చదువుతాడు[23]
 • సమాకలనం చేయబడిన దూర విద్య. దీంట్లో ప్రత్యక్ష బోధన, ఇన్-గ్రూప్ బోధన లేదా దూర విద్యా కరికులంతో సంకర్షణ వంటి అంశాల సమాకలనం[24]
 • ఆన్‌లైన్ బోధన

దూర విద్య తన చరిత్రలో నాలుగునుండి ఐదు 'తరాలను' దాటి వచ్చింది.[25] అవి ఏమనగా అచ్చు, ఆడియో/వీడియో ప్రసారం, ఆడియో/వీడియో టెలికాంఫెరెంసింగ్, కంప్యూటర్ సహాయంతో శిక్షణ, ఈ-అభ్యసన/ ఆన్‌లైన్-బోధన, కంప్యూటర్ ప్రసారం/వెబ్కాస్టింగ్. అయినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో రేడియో ఇప్పటికి ప్రబలంగా ఉంది, దీనికి కారణం అది అందుబాటులో ఉండటం. ఆస్ట్రేలియాలో బాగా మారుమూల ప్రాంతాలలో ఉన్న పిల్లలు 1940ల నుండి 2-వే రేడియో ద్వారా 'స్కూల్ ఆఫ్ ది ఎయిర్' కార్యక్రమములో పాల్గొంటూ ఉన్నారు.[26] భారదేశములో, FM ఛానల్ బాగా ప్రసిద్ధి చెందింది. దీనిని పలు విశ్వవిద్యాలయాలు తమ విద్యా కార్యక్రమాలని ప్రసారం చేయడానికి వాడుకుంటున్నాయి. ఈ విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఈ రంగాలలో విద్యను అందిస్తున్నాయి: ఉపాధ్యాయ విద్యా, గ్రామీణాభివృద్ధి, రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు, విజ్ఞాన విద్యా, సృజనాత్మక రచన, మాస్ కమ్యూనికేషన్, కళ, విజ్ఞానం, వ్యాపార నిర్వాహణ. mp3 ప్లేయర్లు, PDAలు మరియు స్మార్ట్ ఫోన్ల ప్రాబల్యం పెరుగుతుండడంతో, దూర విద్యా పాఠాలను అందించడానికి మరొక మార్గం లభించింది. విద్యార్థులు ఒక కోర్సుని పోడ్కేస్ట్ రూపంలో వినడానికి లేదా వీడియో చూడడానికి కొందరు ప్రొఫెసర్లు ఇప్పుడు అనుమతిస్తున్నారు.[27]

సైన్య సిబ్బందికి పూర్తి కోర్సును PDA ద్వారా అందించడానికి కొన్ని కళాశాలలు U.S. సైన్యంతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి.[28]

ప్రధాన ప్రయోజనాలు

దూర విద్యా కనీసం ఆరు ప్రధాన అంశాలలో ప్రయోజనాలు సమకూరుస్తుంది:

 • అందుబాటును విస్తరించడం: పాఠశాలకు చాలా దూరంలో నివసించడం వంటి కారణాల వలన పాఠశాలకు వెళ్ళలేని స్థితిలో ఉన్న విద్యార్థులకు దూర విద్య ద్వారా వారు కోరిన విద్యను అందించవచ్చు.
 • ఖర్చు తగ్గడం: దూర విద్యకు అవస్థాపన సౌకర్యాలు ఎక్కువ అవసరం లేవు కనుక ఇది ఒక స్థిరమైన మరల మరల వాడగలిగే బోధనా ఉపకరణము వలె ఉంటుంది. పాఠాలను సులభంగా "జస్ట్-ఇన్-టైం" పద్ధతిలో పంపించడానికి వీలు ఉంటుంది కనుక విద్యా సంస్థ నడపాలంటే అవసరమయ్యే ఉద్యోగుల సంఖ్య అనవసరం అవుతుంది.
 • కొత్త మార్కెట్ అవకాశాలు: జీవితకాలం అంతటా చదవుతూ ఉండాలనే ప్రజల కోరికను దూర విద్య పెంచుతుంది. సాంప్రదాయకమైన k-12 వయస్సు మధ్యలో లేని వారు కూడా చదవడానికి వీలు కల్పిస్తుంది.
 • కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వాడడం: విద్యా సంస్థలు దూర విద్యా పద్ధతి ద్వారా వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను వాడవచ్చు.[29]
 • నిధులు-సమకూర్చడానికి కొత్త అవకాశాలు: దూర విద్య క్రొత్త పట్టభద్రులను తయారు చేస్తుంది. వీరు పాఠశాలకు డబ్బు విరాళంగా ఇవ్వవచ్చు. సాంప్రదాయక పద్ధతిలో పాఠశాలతో ఎటువంటి సంబంధం కూడా ఉండి ఉండదు.[30]
 • విద్యార్థులకు సౌలభ్యాలు: కొన్ని దూర విద్యా కార్యక్రమాలు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా క్లాసులను మరియు/లేదా కరికులాన్ని మార్చుకొనే సౌలభ్యము కలుగచేస్తున్నాయి.

పరీక్షలు మరియు మూల్యాంకనం

దూర విద్యలో ఎప్పటినుండో పరీక్షా విధానం ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. పాఠాలను అందరు విద్యార్థులకు అందేలాగ చేయడం సులభమే. దీని వలన విద్యార్థులు వారి తీరిక సమయములో ఆ పాఠాలను చదవవచ్చు. విద్యార్థిచే అభ్యాసాలను పూర్తి చేయించడం మరియు వారిని పరీక్షించడం వంటి విషయాలలో సమస్య ఏర్పడుతుంది. ఆన్‌లైన్ కోర్సులలో క్విజ్, పరీక్షలు పెట్టినప్పుడు వాటిలో విద్యార్థులు మోసం చేయకుండా ఉండేలా చూడడం చాలా కష్టం. ఎందుకంటే, అధ్యాపకుడు పర్యవేక్షణ ఉండదు. తరగతి గదిలో, అధ్యాపకుడు విద్యార్థులను పర్యవేక్షించవచ్చు. సంస్థ యొక్క ప్రతిష్ఠకు భంగం రాకుండా తమ చిత్తశుద్ధిని నిలబెట్టుకోవచ్చు. ఐతే, దూర విద్యలో, విద్యార్థిని పర్యవేక్షించే అవకాశం పూర్తిగా లేదు. విద్యార్థులను ఒక నియంత్రించబడిన వాతావరణంలో పరీక్షించాలని కొన్ని పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.[31]

అభ్యాసాలను పెద్దవిగాను పూర్తి స్థాయిలోనూ ఉండేలా చేసి, విద్యార్థివిషయాలను పరిశోధించేలా చేస్తున్నారు. దీని మూలాన వారు ఆ పనిని వారే చేసినట్లుగా ఋజువు అవుతుంది. పరీక్షా విధానంలో క్విజ్ ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. పలు కోర్సులు విద్యార్థులు మోసగించే విషయములో పరువు ప్రతిష్ఠ విధానాన్ని పాటిస్తున్నాయి. ఒక వేళ విద్యార్థిప్రశ్నలకు సమాధానాలను పుస్తకములో గాని ఆన్‌లైన్లో గాని చూసినా, ఆ క్విజ్ కు ఒక కాల పరిమితి పెట్టడం లేదా ఆ క్విజ్ విలువను తగ్గించడం ద్వారా మోసగించడాన్ని తగ్గించవచ్చు. పెద్ద పరీక్షలను నియంత్రించడం కష్టమవుతుంది.

ముందుగానే ఏర్పాటు చేసుకున్న పర్యవేక్షకుని సమక్షములో పెద్ద పరీక్షలను నడపవచ్చు. పలు మిడ్-టర్మ్ పరీక్షలు మరియు తుది పరీక్షలు ఒక ఉమ్మడి ప్రాంగణంలో జరపబడుతాయి. అప్పుడే ప్రొఫెసర్లు నేరుగా పరీక్షను పర్యవేక్షించవచ్చు. దూర విద్యా రంగంలో ఇంటర్నెట్ ఒక ప్రసిద్ధ మాధ్యమంగా ఏర్పడినప్పుడు, ప్రొఫెసర్లు తమ విద్యార్థులను సమర్ధవంతంగా పరీక్షించడం కొరకు పలు వెబ్‌సైట్‌లు సురక్షితమైన పరీక్షా సాఫ్ట్‌వేర్‌ను, పేకేజీలను రూపొందించాయి.

పెనిసిల్వేనియాలో పలు సైబర్ పాఠశాలలు, తమ విద్యార్థులను ఒక ప్రత్యేక ప్రదేశానికి వచ్చి పెనిసిల్వేనియా సిస్టం అఫ్ స్కూల్ అసెస్మెంట్ (PSSAs) పరీక్షను వ్రాయమని నిర్దేశిస్తాయి. ఉదాహరణకు పెనిసోల్వేనియా సైబర్ చార్టర్ పాఠశాల రాష్ట్రంలోని 30 చోట్లను పరీక్షా కేంద్రాలుగా వాడుతుంది. ఆ పాఠశాల సిబ్బంది పరీక్షా కేంద్రం యొక్క నిర్వాహుకులులాగానూ, పరీక్షా ప్రోక్టర్లుగాను వ్యవహరించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన చదవడం, వ్రాయడం, గణితం మరియు విజ్ఞానంలలో విద్యార్థులు పరీక్షలు వ్రాసే లాగ చేస్తారు.[18]

CLEP
ఇటీవల కాలములో కాలేజ్‌బోర్డ్ తమ కాలేజీ లెవెల్ ఎక్సామినేషన్ ప్రోగ్రాం (CLEP) పరీక్షల గురించి ప్రచారం చేస్తుంది.[32] ఈ పరీక్షలు, పూర్తిగా గుర్తింపు పొందినవి. వీటిని పలు డిగ్రీల కొరకు కనీస అవసరముగా తీసుకోవచ్చు. ఈ పరీక్షలు అంగీకరించబడిన పరీక్షా కేంద్రాలలో, ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగడం వలన మోసాలకు అవకాశం లేదు. CLEP పరీక్షలు కంప్యూటర్-ఆధారితమైన ఆన్‌లైన్ పరీక్షలు. దీంట్లో సుమారు 80-120 బహుళ-ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఇది కంప్యూటర్-ఆధారితమైనది కనుక, పరీక్ష ముగియగానే, మార్కులను తెలుసుకోవచ్చు. CLEP లో ఉత్తీర్ణత పొందాలంటే కనీసం 50 (దాదాపు C-గ్రేడ్ కు సమానం) మార్కులు సాధించాలి. పూర్తి మార్కు 80 (దాదాపు A-గ్రేడ్ కు సమానం). CLEP లో ఉత్తీర్ణత లేదా తప్పడం ఈ రెండే ఉంటాయి. వాస్తవమైన మార్కును తెలియపరచదు.

DSST
CLEP పరీక్షలే కాక, DANTES స్టాన్డర్డైస్డ్ సబ్జెక్ట్ టెస్ట్స్ (DSST) [33] అనే పరీక్షలు తరచూ వాడబడతాయి. ఈ పరీక్ష CLEPలో లేని అంశాలపై ఉంటుంది. ఇవి కూడా CLEP మాదిరిగానే, కంప్యూటర్ ఆధారితమైన ఆన్‌లైన్ పరీక్షలు. ఇది కూడా పర్యవేక్షణలో జరుగుతుంది. పరీక్షా ఫలితాలు వెంటనే అందుబాటులో ఉంటాయి. DSST తమ పలు పరీక్షలను పేపర్-అధారితంగాను జరుపుతుంది. అయితే, వీటిని మూల్యాంకనం కొరకు DSST కార్యాలయాలకు పంపాలి కనుక ఫలితాలు ఆలస్యం అవుతాయి. DSST గ్రేడింగ్ విధానం కూడా CLEP ది మాదిరిగానే ఉండేది. కాని ఇటీవల, ఈ పరీక్షలకు కొత్త గ్రేడింగ్ విధానం ఏర్పరిచి 300-500 పాయింట్ గ్రేడ్ వ్యవస్థను ఏర్పరిచారు. ఉత్తీర్ణతకు 400 సాధించాలి.

ఉత్తీర్ణత లేదా తప్పడం మీద ఆధారపడి ప్రతిభ తెలుపబడుతుంది.

వీటిని కూడా చూడండి

 • కరేస్పాన్డేన్స్ చట్ట పాఠశాల (ఆన్‌లైన్ చట్ట పాఠశాలలకు వర్తిస్తుంది)
 • కంప్యూటర్-ఆధారిత భాషా అధ్యయనము
 • విద్యను కొనసాగించడం
 • డిగ్రీ పూర్తి కార్యక్రమం
 • విద్యా టెక్నాలజీ
 • ఎలక్ట్రానిక్ అభ్యసన
 • హైబ్రిడ్ కోర్సు
 • భాషా పరివర్తన
 • లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం
 • మీడియా సైకాలజీ
 • ఓపెన్ అభ్యసన
 • సున్రైస్ సెమెస్టర్
 • TEACH యాక్ట్ (US టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ కాపిరైట్ హార్మనైసేషణ్ యాక్ట్ అఫ్ 2002)
 • విర్చువల్ అభ్యసన వాతావరణం
 • విర్చువల్ పాఠశాల
 • వర్చువల్ విశ్వవిద్యాలయం
 • వెబ్ కాన్ఫరెన్సింగ్

మూలాలు

 1. హానిమాన్ మరియు మిల్లెర్(1993). "వ్యవసాయంలో దూర విద్య: ఉన్నత విద్యకు సరైన ప్రత్యామ్నాయమా? నేషనల్ అగ్రికల్చురల్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ మీటింగ్ యొక్క ప్రొసీడింగ్లు 67-73
 2. డిస్టన్స్ లెర్నింగ్ ఆన్ ది రైస్, బ్రియన్ టోవీ, మెట్రో కెనడా, నవంబర్ 25, 2008.
 3. డిస్టన్స్ లెర్నింగ్ డిగ్రీస్ | డిగ్రీ కోర్సస్ | కప్లన్ ఓపెన్ లెర్నింగ్, కప్లన్ ఓపెన్ లెర్నింగ్, అక్టోబర్ 11 2010
 4. హోంబెర్గ్, బి. (2005). ది ఎవల్యూఃన్, ప్రిన్సిప్లేస్ అండ్ ప్రాక్టీసస్ అఫ్ డిస్టన్స్ ఎడుకేషన్ Bibliotheks-und Informationssystem der Universitat Oldenburg. p. 13.
 5. Moore, Michael G. (2005). Distance Education: A Systems View (Second ed.). Belmont, CA: Wadsworth. ISBN 0-534-50688-7. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 6. "కీ ఫాక్ట్స్", యూనివెర్సిటి అఫ్ లండన్ ఎక్స్టర్నల్ ప్రోగ్రాం వెబ్సైట్, http://www.londoninternational.ac.uk/about_us/facts.shtml
 7. వైట్, ఎం. (1982). 'డిస్టన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఆస్ట్రేలియన్ హయర్ ఎడ్యుకేషన్ — ఎ హిస్టరీ', డిస్టన్స్ ఎడ్యుకేషన్ , వాల్. 3, ఇష్యూ 2, pp. 255-278.
 8. డనిఎల్, జే.ఎస్. (1996). మెగా-యునివేర్సిటీస్ అండ్ నాలెడ్జ్ మీడియా: టెక్నాలజీ స్ట్రాటజీస్ ఫర్ హయర్ ఎడ్యుకేషన్ , కోగాన్ పేజ్, లండన్. isbn 0-7494-2119-3.
 9. వాట్కిన్స్, బి. ఎల్ (1991). ది ఫోన్డేషన్స్ అఫ్ అమెరికన్ డిస్టన్స్ లెర్నింగ్: ఎ సెంచురీ అఫ్ కాలేజియేట్ కరేస్పాన్డేన్స్ స్టేడి”, p.1-37. దబుక్యూ, IO: కేండాల్/హంట్ పబ్లిషింగ్.
 10. వాల్యూం 1 నంబర్ 3 ఎడిటోరియల్, మిచెల్ జి. మూర్, అమెరికన్ జర్నల్ అఫ్ డిస్టన్స్ ఎడ్యుకేషన్, 1987.
 11. Moore, Michael G. (2005). Distance Education: A Systems View (Second ed.). Belmont, CA: Wadsworth. ISBN 0-534-50688-7. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help), పేజీలు 33-36
 12. హేబెర్ట్, డి. జి. (2007). “ఫైవ్ చాలేన్జస్ అండ్ సొల్యూషన్స్ ఇన్ ఆన్‌లైన్ మ్యూసిక్ టీచర్ ఎడ్యుకేషన్,” రిసెర్చ్ అండ్ ఇష్యూస్ ఇన్ మ్యూసిక్ ఎడ్యుకేషన్, వాల్. 5
 13. గోల్డ్, ఎల్ & మైట్ల్యాండ్, సి (1999). వాట్స్ ది డిఫరంస్? ఎ రేవియూ అఫ్ కాన్టంపరరి రిసెర్చ్ ఆన్ ది ఎఫెక్టివ్నెస్ అఫ్ డిస్టన్స్ లెర్నింగ్ ఇన్ హయర్ ఎడ్యుకేషన్. వాషింగ్టన్, DC: NEA.
 14. మేర్రిం, ఎస్., కాఫ్ఫరెల్ల, అర., & బాంగార్ట్నేర్ , ఎల్. (2007). లెర్నింగ్ ఇన్ అడల్ట్హుడ్ , న్యూ యార్క్: విలీ.
 15. మేకింగ్ ది గ్రేడ్: ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ , 2006, ది స్లోవన్ కాంసర్టియం, http://www.sloan-c.org/publications/survey/survey06.asp
 16. "CNW Newsgroup: Improving Access To Higher Education For Rural Students In Southern Ontario". Newswire.ca. 2010-07-30. Retrieved 2010-09-03.
 17. "Distance Learning | Manitoba Education". Edu.gov.mb.ca. 2005-06-02. Retrieved 2010-09-03.
 18. 18.0 18.1 http://www.pacyber.org
 19. ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్
 20. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్
 21. సార్వత్రిక పాఠశాల పనితీరు అధ్యయన నివేదిక(ఆంగ్లంలో)
 22. లేవేర్-డఫ్ఫి, జుడి మరియు జీన్ బి. మాక్డోనాల్డ్. టీచింగ్ అండ్ లెర్నింగ్ విత్ టెక్నాలజీ. పియర్సన్ ఎడ్యుకేషన్, ఇంక్., 2008, 2005, 2003.
 23. RDI, UK విశ్వవిద్యాలయం కోర్సులు ఇప్పుడు మొబైల్ పరికరాలలో అందించబడుతున్నాయి. డిసెంబర్ 15, 2006 న మరల తీసుకొనివచ్చెను.
 24. GHP, MBA ట్రెండ్స్: ఇంటేగ్రేటడ్ డిస్టన్స్ లెర్నింగ్. 2008, ఆగస్టు 4న పునరుద్ధరించబడింది.
 25. టయ్లోర్, జే .సి. 2003, 'ది ఫిఫ్త్ జేనేరేషన్ అఫ్ డిస్టన్స్ ఎడ్యుకేషన్' చైనీస్ జర్నల్ అఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ లో అనువాదం, 3, 25 - 27, జూన్
 26. "The School of the Air and remote learning - Australia's Culture Portal". Cultureandrecreation.gov.au. Retrieved 2010-09-03.
 27. ఇటున్స్ యూ. ఫిబ్రవరి 9, 2007న చూడబడింది.
 28. డిఫెన్స్ యాక్టివిటి ఫర్ నాన్-ట్రడిషనల్ ఎడ్యుకేషన్ సపోర్ట్, DANTES ఫిబ్రవరి 27, 2007న చూడబడింది
 29. ది నతురె అండ్ పర్పసె అఫ్ డిస్టన్స్ ఎడ్యుకేషన్. జూన్ 8, 2009న పునరుద్ధరించబడింది.
 30. కేసీ, ఏ. & లోరెంజెన్, ఎం. (2010). “ఉన్టాప్డ్ పోటేన్షియల్: సీకింగ్ లైబ్రరీ డోనార్స్ అమొంగ్ అలుమ్ని అఫ్ డిస్టన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్.” టి. పెతెర్స్ మరియు జే. రన్డేల్స్ (Eds.), పదనాలగవ అఫ్-కాంపస్ లైబ్రరీ సర్వీసెస్ కన్ఫెరేంస్ ప్రొసీడింగ్స్ (pp. 85-96). మౌంట్ ప్లేసంట్, MI: సెంట్రల్ మిచిగన్ విశ్వవిద్యాలయం.
 31. ఒక కోర్సులో మీరు ఏమి చేశారు? ది ఓపెన్ విశ్వవిద్యాలయం. 2008-12-13న చూడబదిండి.
 32. "Official College Planning Tools | Research Colleges and Universities Online". Collegeboard.com. Retrieved 2010-09-03.
 33. "DSST". GetCollegeCredit.com. Retrieved 2010-09-03.

బాహ్య లింకులు