"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
దేవరకొండ
దేవరకొండ, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన జనగణన పట్టణం.
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
చరిత్ర
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ రేచర్ల నాయకుల కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశం. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉంది. నల్గొండ, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, హైదరాబాదు నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
మధ్యయుగంలో ఈ గ్రామం స్థానిక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది.[1]
శాసనసభ నియోజకవర్గం
దేవరకొండ ఆలయాలు
1.పాత శివాలయం
2.పాత రామాలయం
3.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం
4.సంతోషిమాత ఆలయం
5.శ్రీ భక్త మార్కెండయ దేవాలయం
6.సాయిబాబా ఆలయం: ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన ప్రాంగణంలో దేవరకొండ వాస్తవ్యులు నిర్మించిన సాయిబాబా ఆలయం మనస్సుకు, ఆత్మకు యెంతో హాయిని కలిగిస్తుంది. ఈ ఆలయం షిరిడి ఆలయమునకు ఏ మాత్రం తీసిపోదు.
7.అయ్యప్ప స్వామి ఆలయం
8.పెద్దదర్గా: ఈ దర్గా ఉర్సు డిండి మండలం ఎర్రారం గ్రామం నుంచి గంధాన్ని తీసుకువచ్చి ఊరేగింపు నిర్వహిస్తారు.
ప్రముఖులు
- అలీ సయ్యద్:ఇతను రచయిత. అతని రచనలలో ముఖ్యమైనవి. జలంధరాసుర వధ, ప్రమీల, దిగంబరమోహిని, నవీన సత్యహరిశ్చంద్ర, నల చక్రవర్తి, భీమ పరమ మహాత్యము, బబ్రువాహన, ధ్రువ, నగర, ఆనందగురు గీత, ముక్తి ప్రదాయిని, సత్యాద్రౌపది సంవాదము, కాళింది, సిరిసినగండ్ల నలనాటకము, సీతారామ శతకము, సురభాండేశ్వరము, మానసిక రాజయోగము.[2]
మూలాలు
- ↑ కంభపు, వెంకటేశ్వర ప్రసాద్ (1999). మధ్యయుగ ఆంధ్రదేశ ఆర్థిక చరిత్ర (క్రీ.శ.1000 - 1323). p. 85. Retrieved 11 May 2019.[permanent dead link]
- ↑ సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 42