"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ద్రవ్యరాశి లోపం

From tewiki
Jump to navigation Jump to search

పరమాణు కేంద్రకం లోని విడి సంఘటకాల విడి ద్రవ్యరాశుల మొత్తానికి,కేంద్రక ద్రవ్యరాశికి మధ్య గల తేడాను ద్రవ్యరాశి లోపంఅందురు.

ఉదాహరణ

హీలియం కేంద్రకంలో 2 ప్రోటాన్లు, 2 న్యూట్రాన్లు ఉంటాయి.ఒక ప్రోటాన్ ద్రవ్యరాశి 1.0078 amu, ఒక న్యూట్రాన్ ద్రవ్యరాశి 1.0087 amu . హీలియం కెంద్రకంలో 2 ప్రోటాన్ల ద్రవ్యరాశి 2X1.0078 amu=2.0156 amu అవుతుంది. అదేవిధంగా రెండు న్యూట్రాన్ల ద్రవ్యరాశి 2X1.0087 amu=2.0174 amu అవుతుంది. హీలియం కేంద్రకంలో గల విడి సంఘటకాలైన ప్రోటాన్లు, న్యూట్రాన్ల ద్రవ్యరాశుల మొత్తం 4.0330 amu అవుతుంది. కాని హీలియం కేంద్రకం యొక్క నిజ ద్రవ్యరాశి 4.0026 amu. పరమాణు కేంద్రకం లోని విడి సంఘటకాల విడి ద్రవ్యరాశుల మొత్తానికి,కేంద్రక ద్రవ్యరాశికి మధ్య గల తేడా 0.0304 amu అగును. ఈ ద్రవ్యరాశి ద్రవ్యరాశి లోపం అగును. ఈ ద్రవ్యరాశి లోపం కేంద్రక స్థిరత్వానికి ప్రమాణం.ఈ ద్రవ్యరాశి లోపం బంధన శక్తిగా వినియోగ పడుతుంది.