"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ద్రోణంరాజు సీతారామారావు

From tewiki
Jump to navigation Jump to search
ద్రోణంరాజు సీతారామారావు
ద్రోణంరాజు సీతారామారావు
జాతీయతభారతీయుడు
వృత్తినాటక రచయిత, కవి, పండితుడు మరియు ఉపాధ్యాయుడు

ద్రోణంరాజు సీతారామారావు ప్రముఖ నాటక రచయిత, కవి, పండితుడు మరియు ఉపాధ్యాయుడు.[1]

రంగస్థల ప్రస్థానం

సీతారామారావు తిరుపతి వేంకట కవుల శిష్యుడు. బందరు నాటక సమాజాల కోసం మరియు రాజమండ్రి గున్నేశ్వరరావు నాటక సమాజంకోసం అనేక నాటకాలు రాశాడు. రామాయనాన్ని మొత్తం 5 నాటకాలుగా రాశాడు.

రచించిన నాటకాలు

నాటకాలు:

 1. సుశీల (1910)
 2. అభినవ రాఘవం (1911)
 3. ఉషాపరిణయం (1911)
 4. హస్తినాపురం (1911)
 5. చతుర చంద్రహాసం (1912)
 6. జయంత జయపాలం (1912)
 7. సిరియాళ నాటకం (బుద్ధిమతీ విలాసము) (1912)
 8. పీష్వా నారాయణరావు వధ (1912)
 9. విజయ బొబ్బిలి (1912)
 10. పాండవ అజ్ఞాతవాసం (1913)
 11. వీర బ్రహ్మయోగి (1913)
 12. సతీ సాహసం (1913)
 13. గయోపాఖ్యానం (1913)
 14. సారంగధర (1914)
 15. సంపూర్ణ రామాయణం (1914)
 16. శ్రీరామ జననం (1914)
 17. శ్రీరామ ప్రవాసం (1914)
 18. ప్రసన్న యాదవము/నరకాసుర సంహారము (1914)
 19. శ్రీరామ పాదుక (1915)
 20. శ్రీరామోద్యోగము (1915)
 21. శ్రీరామ విజయం (1915)
 22. శ్రీరామాశ్వమేధం (1915)
 23. హనుమద్రామ సంగ్రామం (1915)
 24. సతీతులసి (1915)
 25. కనకతార (1915)
 26. పలనాటివీరచరిత్రం (1915)
 27. ద్రౌపదీ పరిణయం (1916)
 28. శ్రీనివాస కళ్యాణం (1916)
 29. సామ్రాజ్యోదయం (1916)
 30. గరుడ గర్వభంగం (1917)
 31. లంకాదహనం (1917)
 32. శ్రీకృష్ణ తులాభారం (1917)
 33. కృష్ణలీలలు (1917)
 34. రుక్మీణీ పరిణయం (1918)
 35. రసపుత్ర విజయం (విమల) (1910)
 36. ప్రమీలార్జునీయం (1921)
 37. శతకంఠ రామాయణం/సీతా విజయం (1926)
 38. పురురవా (1927)

ప్రహసనాలు:

 1. కలికాల చర్య (1921)
 2. కాశీకావిడి (1921)
 3. పడుచుపెడ్లాం - ముసలి మగడు (1921)
 4. నాటకపు ఫార్సులు (1936)

మూలాలు

 1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.645.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).