"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ధన్య బాలకృష్ణ

From tewiki
Jump to navigation Jump to search
దన్యా బాలకృష్ణ
జననం (1989-08-06) 6 ఆగష్టు 1989 (వయస్సు 31)
వృత్తినటి,మొడల్
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం

ధన్య భాలకృష్ణ (అగస్టు 6 1989న జన్మించారు) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు మరియు తమిళ చిత్రాలలో నటించారు. ఆమె మురుగ దాస్ దర్శకత్వం వహించిన 7అమ్ అరివు(తెలుగులో 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది.

కెరీర్

ధన్య భాలకృష్ణ బెంగులూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. ఆమె సూర్య, శ్రుతి హాసన్ నటించిన 7అమ్ అరివు(తెలుగులో 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది[1]. ఆ తరువాత ఆమె రెండు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలు లవ్ ఫెయిల్యూర్(తమిళంలో కాదల్ సొదప్పువది ఎప్పిడి), ఎటో వెళ్ళిపోయింది మనసు(తమిళంలో నీతానే ఎన్ పొన్వసంతం) లో నటించింది.

ఆ తరువాత ఆమె 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో మహేశ్ బాబుని ప్రేమించాననే అమ్మాయి పాత్రలో నటించింది. రాజా రాణి చిత్రంలో ఆమె నయన తార స్నేహితురాలైన నివేతా పాత్ర పొషించింది.ఆమె కథనాయికగా నటించిన తొలి చిత్రం "చిన్ని చిన్ని ఆశ" నవంబరు 2013లో విడుదలైనది.ఆమె తదుపరి చిత్రాలు "చందమామలో అమృతం" మరియు "సెకండ్ హ్యండ్" తరువాత విడుదలైనవి.[2]

నటించిన చిత్రాలు

చలన చిత్రాలు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2011 7th సెన్స్ మాలతీ తమిళం
2012 కాదల్ సొదప్పువది ఎప్పిడి రష్మి తమిళం
లవ్ ఫెయిల్యూర్ తెలుగు
నీతానే ఎన్ పొన్వసంతం నిత్యా స్నేహీతురాలు తమిళం
ఎటో వెళ్ళిపోయింది మనసు తెలుగు
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు
రాజా రాణి నివేతా తమిళం
చిన్ని చిన్ని ఆశ తెలుగు కథనాయికగా తొలి చిత్రం
సెకండ్ హ్యండ్ సహస్రా / దీపు / స్వేతా తెలుగు
2014 చందమామలో అమృతం సంజీవనీ తెలుగు
రన్ రాజా రన్ సౌందర్యా / బంగారం తెలుగు
చిన్నదాన నీ కోసం తెలుగు
2015 రాజు గారి గది బాల త్రిపురా సుందరి తెలుగు
భలే మంచి రోజు మాయ దిసౌజా తెలుగు
2016 నేను శైలజ కీర్తి తెలుగు
తను వచ్చెనంటా కీర్తి తెలుగు
సావిత్రి గాయత్రి తెలుగు
2017 వీడెవడు తెలుగు
యార్ ఇవన్ తమిళం
జయ జానకీ నాయకా తెలుగు

వెబ్ సిరీస్

సంవత్సరం సీరీస్ పాత్ర భాష గమనికలు
2017 పిల్లా తెలుగు
2017 యాస్ ఐయామ్ సఫరింగ్ ఫ్రమ్ కాదల్ మీరా తమిళం

మూలాలు