నందికోళ్ల గోపాలరావు

From tewiki
Jump to navigation Jump to search
Gopal Rao. N
Nandikolla Gopala Rao.
జననం1880
British India
మరణం1945
Injaram, East Godavari, Andhra Pradesh
జాతీయతIndian

నందికోళ్ల గోపాలరావు (1880 - 1945) ఆంధ్రదేశపు జమిందారు, ప్రముఖ చిత్రకారుడు. వీరి రంగుల తైలవర్ణ చిత్రాలు మహారాజుల ప్రశంశలనందుకున్నాయి. వీరి స్వస్థలం కాకినాడ దగ్గరి ఇంజరం. వీరు బ్రిటిష్ వారి కాలంలో ఇంజరం మునసబుగా కూడా పనిచేశారు. వీరు ఇంజరం పరదేశమ్మ ఆలయానికి భూరి విరాళాలిచ్చారు.

కళాఖండాలు

వీరు చిత్రించిన ముఖ్యమైన కళాఖండాలు:

 • మురళీకృష్ణ (1927) : ఇందులో శ్రీకృష్ణుడు పశువులను, పక్షులను తన వేణుగానంతో ఎలా సమ్మోహనం చేసేది కళాత్మకంగా చిత్రించారు.[1]
 • శ్రీమన్నారాయణుడు (1928) : ఇందులో శ్రీమన్నారాయణుడు శ్రీదేవి, భూదేవితో నాలుగు చేతులలో శంఖం, చక్రం, కమలం, గద ధరించి శేషనాగుపై నిలుచున్నట్లుగా చిత్రించారు.[2]
 • ఉత్తర అభిమన్యుడు (1929) : ఇందులో ఉత్తర, అభిమన్యుడు ల ప్రేమను చిత్రించారు. ఉత్తర చీర కుచ్చెళ్ళులోని ప్రస్ఫుటంగా యుద్ధవీరుడైన అభిమన్యునిపై వాలినప్పుడు తెలుస్తుంది.[3]
 • విలాసిని : ఇందులో ఒక యువతిని నగ్నంగా పుష్పంతో పోలుస్తూ చిత్రించారు.[4]
 • చిత్రాంగి (1929) : ఇందులో భారత స్త్రీ చిత్రాంగి గోడపై కూర్చున్నట్లు అందంగా చిత్రించారు. ఆమె ధరించిన చీర రంగులు, చుట్టూ ప్రకృతిలోని రంగులు బాగా కలిశాయి.[5]
 • రాధాకృష్ణ (1927) : ఇందులో శ్రీకృష్ణుడు, రాధతో మధ్యన గోవును చిత్రించారు.[6]
 • ఉలూచి అర్జునుడు : ఇందులో అర్జునుడు నదీతీరంలో విశ్రాంతి తీసుకుండగా నాగకన్య ఉలూచి తన్మయత్వంతో చూస్తున్నట్లు చిత్రించారు.[7]

చిత్రమాలిక

నందికోళ్ల గోపాలరావు చిత్రించిన వర్ణచిత్రాలు కొన్ని:

మూలాలు

 1. "Painting of Murali Krishna". Archived from the original on 2010-11-26. Retrieved 2009-10-23.
 2. "Painting of Sriman Narayana". Archived from the original on 2010-11-26. Retrieved 2009-10-23.
 3. "Painting of Uthra Abimanya". Archived from the original on 2010-11-26. Retrieved 2009-10-23.
 4. "Painting of Vilasini". Archived from the original on 2010-11-27. Retrieved 2009-10-23.
 5. "Painting of Chitrangi". Archived from the original on 2010-11-26. Retrieved 2009-10-23.
 6. "Painting of Radha Krishna". Archived from the original on 2010-11-26. Retrieved 2009-10-23.
 7. "Painting of Uluchi Arjun". Archived from the original on 2010-11-26. Retrieved 2009-10-23.

బయటి లింకులు