"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నజ్మా హెప్తుల్లా

From tewiki
Jump to navigation Jump to search
నజ్మా హెప్తుల్లా (Najma Heptulla)

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 మే 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

పదవీ కాలము
1985-1986, 1988 - 2004

రాజ్యసభ సభ్యురాలు
పదవీ కాలము
2004-2010, 2012-present

వ్యక్తిగత వివరాలు

జననం (1940-04-13) 13 ఏప్రిల్ 1940 (వయస్సు 81)
భోపాల్
జీవిత భాగస్వామి ఎ. అక్బర్ అలి హెప్తుల్లా (1966-2007) (మరణం)
మతం ఇస్లాం

నజ్మా హెప్తుల్లా ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. మోడీ కేబినెట్‌లో ఏకైక ముస్లిం నేతగా నిలిచి వార్తలలో కెక్కారు.

నేపధ్యము

ఈమె ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనుమరాలు. భోపాల్‌కు చెందినవారు . ఆమె నాలుగుసార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. సోనియా గాంధీతో వచ్చిన విభేదాల కారణంగా 2004లో కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. హమీద్ అన్సారీ మీద భారతీయ జనతా పార్టీ తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడారు. ఆమె జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. పలు పరిశోధన వ్యాసాలు రచించారు. నజ్మాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.