"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నడిపల్లి దివాకర్ రావు

From tewiki
Jump to navigation Jump to search
నడిపల్లి దివాకర్ రావు
నడిపల్లి దివాకర్ రావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004, 2004 - 2009, 2014 - 2018, 2018 - ఇప్పటి వరకు
నియోజకవర్గము మంచిర్యాల, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం 1953, ఆగస్టు 16
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము మంచిర్యాల, తెలంగాణ

నడిపల్లి దివాకర్ రావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు.[1][2] 1999, 2004 ఎన్నికల్లో లక్సెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా... 2014, 2018 ఎన్నికల్లో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

జీవిత విశేషాలు

దివాకర్ రావు 1953, ఆగస్టు 16న లక్ష్మణ్ రావు, రమాదేవి దంపతులకు మంచిర్యాలలో జన్మించాడు. పొలిటికల్ సైన్స్‌లో బి.ఏ. చదివాడు.

రాజకీయ విశేషాలు

1981లో మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం సాధించిన దివాకర్ రావు 1983-92లో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1987లో ఆసిఫాబాద్ డివిజన్‌లోనే అత్యధిక మెజారిటీతో మంచిర్యాల మండల సింగల్ విండో చైర్మన్‌గా గెలుపొందాడు. ఆ తరువాత 1989 నుండి 1999 వరకు పదేండ్లపాటు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1999, 2004లో రెండుసార్లు లక్సెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం అరవింద్ రెడ్డిపై 59,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈయన నాలుగు సార్లు మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా గెలిచాడు.[3][4] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోకిరాల ప్రేమ్ సాగర్ రావుపై 4,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5]

మూలాలు