"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నర్సీపట్నం

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:APvillage NarsipatnamRoad 1.JPG
నర్సీపట్నం రోడ్ రైల్వేస్టేషను

నర్సీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన జనగణన పట్టణం.[1]. సముద్రపు ఒడ్డున లేక పోయినా ఈ ఊరు పేరు చివర 'పట్నం' ఉండటం గమనార్హం. ఈ ఊరు తప్ప తూర్పు కోస్తాలో ఉన్న 'పట్నాలు' అన్నీ సముద్రపుటొడ్డున ఉన్నవే.నర్సీ పట్నం నుండే ఎటు వెళ్ళినా ఏజన్సీ ప్రాంతమే వస్తుంది కాబట్టి 'గేట్ వే ఆఫ్ ఏజన్సీ'గా పిలవబడుతూ ఉంది.

చారిత్రిక విశేషం

చారిత్రక విషయంలో పట్నం లోని పోలీస్ స్టేషను 1922 ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టడం అదే పోలీస్ స్టేషను ఇప్పటికి గుర్తుగా ఉంది. పెద్దగా మార్పులు చేయ లేదు. బ్రిటిష్ కాలం నాటి తాలుకా ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ లు చారిత్రక చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. సివిల్ సర్వెంట్స్ గా ఉన్న అనేక మంది ప్రసిద్దులకు ప్రారంభం ఇక్కడే కావడంతో సివిల్ సర్వెంట్స్ పై ఉపమన్యు చటర్జీ వ్రాసిన ఇంగ్లీష్ నవల ఆగస్టు నవల ఆధారంగా సినిమా తీయడం ఇక్కడే జరిగింది.

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.నర్సీపట్నం ఊరికి, నర్సీపట్నం రోడ్డు రైలు స్టేషనుకూ దరిదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వం చింతపల్లి, సీలేరు, పాడేరు, మొదలైన మన్యపు ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళాలన్నా నర్సీపట్నం మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ రెవెన్యు డివిషనల్ ఆఫీసు ఉండేది. అందుకని మద్రాసు-హరా రైలు మార్గంలో వెళ్ళే మెయిలుబండి నర్సీపట్నంరోడ్డు స్టేషనులో తప్పకుండా ఆగింది.ప్రస్తుతం ఒక బస్సు కాంప్లెక్స్ ఉంది.

శాసనసభ నియోజకవర్గం

గణాంకాలు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం నర్శీపట్నం జనాభా - మొత్తం 91,612. అందులో పురుషులు 44,655 మంది ఉండగా స్త్రీలు 46,957 మంది ఉన్నారు.

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-12.

మూస:ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు