"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నల్గొండ పురపాలక సంఘము

From tewiki
Jump to navigation Jump to search

నల్గొండ పట్టణానికి చెందిన పాలక సంస్థ అయిన నల్గొండ పురపాలక సంఘము 1941లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా అవతరించి[1] ప్రస్తుతం మొదటి శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2001నాటికి పురపాలక సంఘ పరిధిలోని జనాభా 111745 కాగా, 2011 నాటికి 144718 కు పెరిగింది. 2010-11 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఈ సంఘం ఆదాయం రూ.39.78 కోట్లు, వ్యయము రూ.39.69 కోట్లు.

ఎన్నికలు

2005 సెప్టెంబరులో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో పి.వెంకట నారాయణగౌడ్చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.[2] 2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2013, మార్చి 30న మళ్ళీ ఎన్నికలు జరుగనున్నాయి.

బయటిలింకులు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-27. Retrieved 2014-03-13.
  2. ఈనాడు దినపత్రిక, తేది 01-10-2005