నల్లబండగూడెం

From tewiki
Jump to navigation Jump to search

       నల్లబండగూడెం, నల్గొండ జిల్లా, కోదాడ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 508206. ఇది కోదాడ పట్టణమునకు 9 కి.మీ. దూరములో విజయవాడ వైపు 9వ నంబరు జాతీయ రహదారిపై ఉంది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధానంగా వరి, మిరప, కంది, మొక్కజొన్న పంటలను పండిస్తారు. వ్యవసాయానికి కావలసిన నీటి వనరు కొరకు సాగరు కాలువ, పాలేరు, ఊరి చెరువు, బోర్ల పైన ఆధారపడతారు.

నల్లబండగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం కోదాడ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 508206
ఎస్.టి.డి కోడ్

పంచాయతీ చరిత్ర

నల్లబండగూడెం గ్రామం 1993వ సంవత్సరంలో చిమిర్యాల పంచాయతి నుండి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతిగా ఏర్పడింది. అప్పుడు మొట్టమొదటి సర్పంచ్ గా ముండ్రా రంగారావు గారు ఎన్నికయ్యారు. ముండ్రా రంగారావు గారు నల్లబండగూడెం స్వతంత్ర పంచాయితీగా ఏర్పడడానికి చాల కృషి చేశారు.

ఆలయములు

నల్లబండగూడెం గ్రామంలో వున్న నల్లబండ పైన లింగమంతుల (శివుని) ఆలయము ఉంది. ప్రతి 2 సంవత్సరములకి ఒకసారి లింగమంతుల స్వామి వారి జాతర వైభవముగా జరుగును. అదే బండ పైన 1993-94 సంవత్సరంలో 24 అడుగుల ఎత్తైన పంచముఖ ఆంజనేయుల స్యామి వారి విగ్రహం నెలకొల్ప బడింది. నల్లబండ ఎదురుగా శ్రీ షిరిడి సాయిబాబా స్వామివారి ఆలయం ఉంది.

పరిశ్రమలు

నల్లబండగూడెం గ్రామంలో 10 కి పైగా చిన్న మధ్య తరహ పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాకతీయ టెక్స్ టైల్స్ (నూలు ఉత్పత్తి, రఘ స్పిన్నింగ్ (నూలు ఉత్పత్తి), కళ్యాణి ఇండస్త్రీస్ (అట్ట ఉత్పత్తి), ప్రీతి డ్రగ్స్ & కెమికల్స్ (మాత్రల ముడి సరుకు తయారి), జ్యోతి పేపర్ మిల్స్ (పేపరు తయారి), కృష్ణ పాలిపాక్ (సంచుల తయారి) మొదలుగునవి.

ప్రముఖులు

మూలాలు

నల్లబండగూడెం గ్రామం నల్గొండ జిల్లాకి కృష్ణా జిల్లాకి సరిహద్దు ప్రాంతం, అలాగే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి కూడ.