నవనారసింహులు

From tewiki
Jump to navigation Jump to search

నృసింహమూర్తిని అనేక రూపాలలో అర్చిస్తారు. పాంచరాత్రాగమంలో 70పైగా నృసింహమూర్తులు ప్రస్తావించబడ్డాయి. స్వామి కూర్చున్న లేదా నిలుచున్న భంగిమలను బట్టి, లేదా చేతులలోని ఆయుధాల క్రమాన్ని బట్టి ఈ మూర్తులలో వైవిధ్యాన్ని చెప్పవచ్చును.

దస్త్రం:Ugranarasimha statue at Hampi.jpg
హంపిలో 'యోగనారసింహ' విగ్రహము

నవ నరసింహ వ్యూహములు అనబడే 9 ముఖ్య రూపాలు.

 1. ఉగ్ర నారసింహుడు
 2. కృద్ధ నారసింహుడు
 3. వీర నారసింహుడు
 4. విలంబ నారసింహుడు
 5. కోప నారసింహుడు
 6. యోగ నారసింహుడు
 7. అఘోర నారసింహుడు
 8. సుదర్శన నారసింహుడు
 9. శ్రీలక్ష్మీ నారసింహుడు

ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా అహోబిలంలో ఉన్న నవనారసింహ మూర్తులు

 1. ఛత్రవత నారసింహుడు (మఱ్రిచెట్టు క్రింద కూర్చున్న స్వామి)
 2. యోగానంద నారసింహుడు (బ్రహ్మను దీవించిన స్వామి)
 3. కరంజ నారసింహుడు
 4. ఊహా నారసింహుడు
 5. ఉగ్ర నారసింహుడు
 6. క్రోధ నారసింహుడు
 7. మాలోల నారసింహుడు (తనవొడిలో శ్రీలక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొన్న స్వామి)
 8. జ్వాలా నారసింహుడు (స్తంభం నుండి వెలువడుతున్న అష్టభుజ మూర్తి)
 9. పావన నారసింహుడు (భరద్వాజమునిని దీవించిన వాడు)


వనరులు