"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
నవభారతం
నవభారతం | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
నిర్మాత | పోకూరి వెంకటేశ్వర రావు, పోకూరి బాబురావు (సమర్పణ) |
రచన | మరుధూరి రాజా (కథ, మాటలు) |
స్క్రీన్ ప్లే | ముత్యాల సుబ్బయ్య |
నటులు | రాజశేఖర్, జీవిత, కల్పన |
సంగీతం | కె. చక్రవర్తి |
ఛాయాగ్రహణం | ఆర్. రామారావు |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
నవభారతం 1988 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రాజశేఖర్, నరేష్, సుధాకర్, జీవిత, కల్పన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈతరం ఫిలింస్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మించగా, పోకూరి బాబూరావు సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి కథ, మాటలు మరుధూరి రాజా రాశాడు. చిత్రానువాదం ముత్యాల సుబ్బయ్య రాశాడు. కె. చక్రవర్తి సంగీతం అందించగా జాలాది, వంగపండు, అదృష్టదీపక్ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, నాగూర్ బాబు, ఎస్. జానకి, ఎస్. పి. శైలజ, లలితా సాగరి పాటలు పాడారు.
Contents
నటీనటులు
- రాజశేఖర్ - రఘుపతి
- విజయ నరేష్ - రాఘవ
- శుభలేఖ సుధాకర్ - రాజారాం
- జీవిత
- కల్పన
- నూతన్ ప్రసాద్
- సుత్తి వేలు
- చలపతి రావు
- మహర్షి రాఘవ
- రాళ్ళపల్లి
- పి. ఎల్. నారాయణ
- నర్రా వెంకటేశ్వర రావు
- సంజీవి
- సాయి కుమార్
- నిర్మల
- కె. విజయ
- పి. జె. శర్మ
సాంకేతిక సిబ్బంది
- కథ, మాటలు - మరుధూరి రాజా
- దర్శకత్వం - ముత్యాల సుబ్బయ్య
- కెమెరా - ఆర్. రామారావు
- కూర్పు - గౌతంరాజు
- కళ - సోమనాథ్
- పోరాటాలు - సాంబశివరావు
- నృత్యాలు - శివసుబ్రహ్మణ్యం, ప్రమీల
- దుస్తులు - అప్పారావు
సంగీతం
ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా జాలాది, వంగపండు, అదృష్టదీపక్ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, నాగూర్ బాబు, ఎస్. జానకి, ఎస్. పి. శైలజ, లలితా సాగరి పాటలు పాడారు.