నవీన షేక్

From tewiki
Jump to navigation Jump to search
నవీన షేక్
దస్త్రం:Naveena Shake.jpg
జననం (1979-07-05) 1979 జూలై 5 (వయస్సు 41)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
తల్లిదండ్రులుఎస్. మహబూబ్ సాహెబ్, ఎస్. ఖాజాబి,

నవీన షేక్ (జులై 5, 1979) ప్రముఖ రంగస్థల, సినీ, టివీ నటి.

జననం

ఈవిడ 1979, జులై 5 వ తేదిన శ్రీమతి ఎస్. ఖాజాబి, ఎస్. మహబూబ్ సాహెబ్ దంపతులకు కడపలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం

1995 మే 28న రంగస్థలంపై అడుగుపెట్టింది.

  • పద్యనాటకాలు: తారాశశాంకము, వేమన యోగి, చింతామణి, రావణ విజయం, శివకేశవ సంగ్రామం, శ్రీకృష్ణతులాభారం, మహారథికర్ణ.
  • సాంఘిక నాటకాలు: కొయ్యగుర్రం, సీనియర్ సిటిజన్, నువ్వో సగం - నేనో సగం, రూపాయి – మహిత, మహాప్రస్థానం, అనుబంధం, నరావతారం, కళాఖండం, చూడు చూడు తమాషా, జగమే మాయ

బహుమతులు

అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

  1. ప్రత్యేక బహుమతి - జగమే మాయ (నాటిక), (అపర్ణ నాటక కళాపరిషత్‌, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5)[1]

టీవీరంగం

అపరంజి, ఆడపిల్ల, చక్రవాకం, గీతాంజలి, మాయాబజార్, తూర్పు పడమర, అనుబంధం, సంధ్యారాగం, యువ, అంజలి, కోయిలమ్మ వంటి ధారావాహికలలో నటించింది.

చలనచిత్రరంగం

మేస్త్రీ, ఆదివిష్ణు, సుందరానికి తొందరెక్కువ, బ్రహ్మ, డాన్ సినిమాల్లో నటించింది.

మూలాలు

  1. ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.
  • నవీన. ఎస్, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 55.