"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నాగరాలు

From tewiki
Jump to navigation Jump to search

"నాగరాలు" ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 23వ కులం.[1]వీరి పూర్వీకులు ఒరిస్సాలోని గంజాం ప్రాంతం నుంచి ఆంధ్రప్రాంతానికి చేరుకున్నారు.వ్యవసాయంపైనే ఆధారపడి జీవిం చేవారు. వైద్య వృత్తిని వీరు ఎంచుకున్నారు. అప్ప ట్లో వీరు ఆయుర్వేద వైద్యం చేసేవారు.వీరి పూర్వీకులు విజయనగర రాజులకు వైద్యం చేశారు. వీరి వైద్య సేవలను మెచ్చిన వారు ఏడు గ్రామాలను ముఖాసాలుగా ఇవ్వడం జరిగింది. వీరు అప్పట్లో కరణీకం కూడా చేసేవారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో ఎక్కువగాను, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడా ‘నగరాలు’లేదా 'నాగరాలు' సామాజికవర్గానికి చెందివారు జీవిస్తున్నారు.వీరు ‘నగరాల్లో’ స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడంతో వీరికి నగరాలు లేదా నాగరాలు అనే పేరు వచ్చింది. విశాఖ పట్టణంలోని కోట వీధిలో విజయవాడలోని ఒన్‌ టౌన్‌ (పాతబస్తి) లో వీరు జీవించేవారు.స్వాతంత్య్రానికి పూర్వం నుండి వీరికి రిజర్వేషన్‌ సౌకర్యం ఉంది.మద్రాసు ప్రెసిడెన్సీ ఉన్న కాలంలో సైతం వీరు బిసి రిజర్వేషన్ల జాబితాలో ఉన్నారు. తర్వాత వచ్చిన అనంతరామన్‌ కమిషన్‌ కొన్ని కులాలను బిసి రిజర్వేషన్ల జాబితాలోనుంచి తొలగించిన సందర్భంలో వీరు కూడా రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో నగరాలు కుల సంఘం నాయకులు తమ కులాన్ని తిరిగి రిజర్వేషన్ల జాబితాలో చేర్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.వారు చేసిన ప్రయత్నాలు ఫలించి 2008లో బీసి రిజర్వేషన్‌ జాబితాలోని డి గ్రూప్‌లో నగరాలు సామాజికవర్గాన్ని చేర్చుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.కంకర క్వారీలు, ఇసుకు క్వార్వీలు, ముఠావర్కర్లు, లాగుడు బండి కార్మికులు, తాపీ పనివారుగా రోజు కూలీలుగా... జీవనం సాగిస్తున్న వీరి పిల్లలు బడిబాట పట్టారు.

మూలాలు

  1. "ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే... | ఏపీ News in Telugu". web.archive.org. 2019-11-15. Retrieved 2019-11-15.

వెలుపలి లంకెలు