నాగార్జున (1962 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
నాగార్జున
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.రావు
తారాగణం సుజాత
నిర్మాణ సంస్థ నంది పిక్చర్స్
భాష తెలుగు

నాగార్జున 1962, అక్టోబర్ 5న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం.

తారాగణం

 • రాజ్‌కుమార్ - అర్జునుడు
 • జి.వరలక్ష్మి - ఉలూచి
 • కాంతారావు - శ్రీ కృష్ణుడు
 • రాజనాల - హనుమంతుడు
 • సంధ్య - పార్వతి
 • రమణారెడ్డి
 • సుజాత
 • చిత్తూరు నాగయ్య
 • మిక్కిలినేని
 • రమాదేవి
 • కుమారి మీనా
 • మాస్టర్ సత్యనారాయణ - నాగార్జున
 • రాజేశ్వరి

సాంకేతికబృందం

 • దర్శకత్వం: వై.వి. రావు
 • సంగీతం: రాజన్ - నాగేంద్ర
 • గీత రచన: ఆరుద్ర
 • మాటలు, పద్యాలు: తాండ్ర సుబ్రహ్మణ్యం
 • ఛాయాగ్రహణం: ఎస్.ప్రకాశ్
 • శబ్దగ్రహణం: కణ్ణన్ ఎం.ఎస్.అయ్యంగార్

పాటలు, పద్యాలు

ఈ చిత్రంలోని పాటలకు రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చారు[1].

 1. అభయమిడు కల్పవల్లి అంబా అన్నపూర్ణేశ్వరి తల్లి - పి.లీల
 2. ఉయ్యాలలూగే నామది తీయని రేయి - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, కె.రాణి బృందం
 3. చిరంజీవిగా తనయా వృద్ధిపొందుమా ఇలలోన ఎనలేని - ఎ.పి.కోమల, అప్పారావు బృందం
 4. తెలిసె తెలిసె చినవాడెవరొ తెలిసె తెలిసి మనసే మురిసె - జిక్కి,పిఠాపురం
 5. మాటాడు చెలి మాటాడు నీకేల సిగ్గు షికారం మనోహరి నీ పలుకే బంగారం - నాగేంద్ర
 6. మనసున వలచిన మగవాడు సరసకు చేరెను ఈనాడు - పి.సుశీల
 7. మదిలో నిన్నే దలచు చెలినే వలచి మరచి నన్నే విడువనేల - శూలమంగళం రాజ్యలక్ష్మి
 8. మొరవినవా దయగనవా ఓ విశ్వనాధు - పి.లీల
 9. రామ రామ రామ రామ రామనామ తారకం - కె.రఘురామయ్య
 10. విశ్వశాంతి సందేశం వినిపించే దేశము విమల భరత దేశం - ఎం.ఎస్.రామారావు బృందం
 11. అక్షయ రాజలోకము మహారధి అర్జునుడన్న (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
 12. ఈ వేదాంతము నీవే నేర్పితివా లేక (పద్యం) - టి.శ్రీరాములు - రచన: తాండ్ర
 13. ఎంతని చెప్పుదాన హృదయేశుని ప్రేమ కలాపముల్ (పద్యం) - పి.లీల - రచన: తాండ్ర
 14. కన్నులు తెరవనికడు చిన్ని పాపడై దానవి చనుబాలు (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
 15. కాశీ విశ్వేశ్వరున్ గంగమ్మ పూజించి గయలోన ముక్కోటి(పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: తాండ్ర
 16. గంగోత్తుంగధరం శశికళా మౌళేన శృంగారయో: (పద్యం) - అప్పారావు
 17. చంపెదనంచు నే ప్రతిన సల్పితి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
 18. తర్జన భర్జనల్ విడిచి ధాత్రి నవక్రపరాక్ర మక్రమో (పద్యం) - టి. శ్రీరాములు - రచన: తాండ్ర
 19. నీలాపనిందే జ్వాలగా మారెనమ్మా నీ దాననే మొరవినవా (పద్యం) - పి.లీల - రచన: తాండ్ర
 20. మది నూహింపగ రాముడేల ఇది నేమర్దుంచుట (పద్యం) - బి.గోపాలం - రచన: తాండ్ర
 21. మాయా జనాళి వెంటబడి మానవమాత్రుని దేవుడంచు (పద్యం) - బి. గోపాలం - రచన: తాండ్ర
 22. రాముడు దుష్టరాక్షస విరాముడు (పద్యం) - బి. గోపాలం - రచన: తాండ్ర
 23. లంఖిణిన్ చంపి రావణలంక గాల్చి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర

కథ

పాండవులు తమలో ఒక్కక్కరితో ద్రౌపది ఏడాది ఉండేటట్లు నిర్ణయించుకున్నారు. నియమ భంగం చేసినవారు సంవత్సరం తీర్ధయాత్రలు చేయాలి. శయ్యాగారానికి ఆనుకుని ఉన్న ఆయుధాగారం నుండి గాండీవం తెచ్చుకోవడానికి వెళ్ళిన అర్జునుడు ద్రౌపది, ధర్మరాజులు ఏకాంతంగా ఉండడం చూశాడు. ఆ తర్వాత్త గో సంరక్షణకై వెళ్ళి రాక్షసులను సంహరించాడు. గగనవీధిన విహరిస్తున్న నాగరాజ కుమారి ఉలూచి అర్జునుని చూసి ప్రేమించి అతను తనను చూడక వెళ్ళిపోతున్న సమయంలో అతని దృష్టిని ఆకర్షించడానికి రాయి గిరవాటేస్తుంది. అది లోయలో పొదిగిన పక్షిగుడ్డుకు తగిలింది. ఆ పక్షి దంపతులు ముని దంపతులుగా మారి ఉలూచికి భర్తృవియోగం సంభవించగలదని శపిస్తారు.

నియమభంగానికి అర్జునుడు తీర్థయాత్ర వెళ్ళాడు. వాతాపి అనుసరించాడు. ఉలూచి విరహబాధను గమనించిన చిత్రలేఖ భూలోకానికి వచ్చి తన మాయాశక్తిచే అర్జునుని నాగలోకం చేరుస్తుంది. అర్జునుడు ఉలూచిని ప్రేమిస్తాడు.

వాతాపి చిత్రలేఖ అనుకుని సురభి అనే పల్లెపడుచును వెంటపడి నిజం తెలిసిన పిదప తిరిగివస్తాడు. సురభి, వాతాపిల పెళ్ళికి అంగీకరించిన అర్జునుడు రామేశ్వరం వెళ్తాడు.

ఉలూచి గర్భవతియై ఇలావంతుని కంటుంది. అర్జునుడు హనుమంతునితో వివాదపడి కృష్ణుని యుక్తి వల్ల విముక్తుడై వెడుతూ, నారదుని సలహాపైన సుభద్రా పరిణయావలోకనుడై సన్యాసి వేషంలో వెడతాడు. సురభి మూగపిల్ల అని గ్రహించిన వాతాపి ఆమెను తృణీకరించి హనుమంతుని సహాయంతో ద్వారక చేరుకుని శుస్రూష చేయసాగాడు.

నాగలోకవాసుల నింద భరించలేక ఉలూచి ప్రాధేయయపడగా పార్వతి సాక్షాత్కరించి ఆ బాలుని శిరసుపై శృంగం వుంచి, నాగార్జునుడని నామకరణం చేసి పెంచింది. అతడు అజేయుడు కాగలడని ఆశీర్వదించింది. తండ్రికి ఉత్తరగతులు కల్పించడానికి బయలుదేరిన అర్జునుడు శిరస్సుపై శృంగంగల బాలునికై వెదుకుతూ నాగార్జునుని చూస్తాడు. తన కుమారుడని తెలియక అర్జునుడు యుద్ధానికి తలపడతాడు. ఉలూచి అతడు తన కుమారుడే అని నారదుని వలన విని గ్రహించింది.

నాగార్జునునికి సహాయంగా పార్వతీ పరమేశ్వరులు త్రిశూలాన్ని, అర్జునుని తోడ్పాటుగా కృష్ణుడు చక్రాన్ని పంపారు.

చివరకు పతాక సన్నివేశంలో నాగార్జునుడు, అర్జునుడు కొడుకు తండ్రులని ఒకరికొకరు తెలుసుకుని కథ సుఖాంతమౌతుంది[2].

మూలాలు

 1. కొల్లూరి భాస్కరరావు. "నాగార్జున - 1962". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 26 February 2020.
 2. సంపాదకుడు (12 October 1962). "చిత్రసమీక్ష - నాగార్జున". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 26 February 2020.

బయటి లంకెలు