"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నాగాలాండ్

From tewiki
Jump to navigation Jump to search
నాగాలాండ్
Map of India with the location of నాగాలాండ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
కోహిమా
 - 25.4° ఉ 94.08° తూ
పెద్ద నగరము దీమాపూర్
జనాభా (2001)
 - జనసాంద్రత
1,988,636 (24వది)
 - 120/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
16,579 చ.కి.మీ (25వది)
 - 11
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1963-12-01
 - కె.శంకరనారాయణన్
 - నిఫూరియో
 - Unicameral (60)
అధికార బాష (లు) ఇంగ్లీషు
పొడిపదం (ISO) IN-NL
వెబ్‌సైటు: nagaland.nic.in

నాగాలాండ్ రాజముద్ర

నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు, మయన్మార్ దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు. ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు, 14,000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.

ఇటీవలి చరిత్ర

నాగాలాండ్ డిసెంబర్ 1, 1963 న రాష్ట్రముగా అవతరించింది. 1956 నుండి భారత దేశములో అంతర్భాగముగా,, దీనికి మునుపు స్వంతంత్ర భుభాగముగా దీని స్థాయి వివాదాస్పదమైనది. కొన్ని వర్గాలు దీన్ని ఆసరాగ తీసుకొని స్వతంత్ర ప్రతిపత్తికై ఆందోళన చేస్తున్నారు.

2004, అక్టోబర్ 2న జరిగిన దాడులలో, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు రెండు వేర్పాటువాద తిరుగుబాటుదారు గ్రూపులు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం, నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ చర్యలకు బాధ్యులని భావిస్తున్నారు.

నాగాలాండ్‌లోని లాంగ్వా గ్రామంలో హెడ్‌హంటర్

ప్రజలు

జిల్లాలు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 DI దీమాపూర్ దీమాపూర్ 3,79,769 926 410
2 KI కిఫిరె కిఫిరె 74,033 1,255 66
3 KO కోహిమా కోహిమా 2,70,063 1,041 213
4 LO లాంగ్‌లెంగ్ లాంగ్‌లెంగ్ 50,593 885 89
5 MK మొకొక్‌ఛుంగ్ మొకొక్‌ఛుంగ్ 1,93,171 1,615 120
6 MN మోన్ మోన్ 2,59,604 1,786 145
7 మూస:Dash నోక్‌లాక్ నోక్‌లాక్ 59,300 1,152 51
8 PE పెరెన్ పెరెన్ 1,63,294 2,300 55
9 PH ఫేక్ ఫేక్ 1,63,294 2,026 81
10 TU తుఏన్‌సాంగ్ తుఏన్‌సాంగ్ 4,14,801 4,228 98
11 WO వోఖా వోఖా 1,66,239 1,628 120
12 ZU జునెబోటొ జునెబోటొ 1,41,014 1,255 112

ఇవి కూడా చూడండి

బయటి లింకులు