నామక్కల్

From tewiki
Jump to navigation Jump to search
  ?Namakkal
తమిళనాడు • భారతదేశం
Namakkalను చూపిస్తున్న పటం
తమిళనాడు రాష్ట్రాన్ని గుర్తిస్తున్న భారతదేశ పటం
Location of Namakkal
అక్షాంశరేఖాంశాలు: 11°14′N 78°10′E / 11.23°N 78.17°E / 11.23; 78.17Coordinates: 11°14′N 78°10′E / 11.23°N 78.17°E / 11.23; 78.17
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 218 మీ (715 అడుగులు)
జిల్లా (లు) నామక్కల్ జిల్లా
జనాభా 53,040 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 637 001
• +91 - 4286
• TN 28

భారతదేశంలోని తమిళ నాడు రాష్ట్రంలో గల నమక్కల్ జిల్లాలో ఉన్న నమక్కల్ (తమిళం: நாமக்கல்) ఒక నగరం మరియు పురపాలక సంఘం. ఇది నమక్కల్ జిల్లా యొక్క ముఖ్యపట్టణం. పర్యావరణ నిర్వహణ[1], ప్రత్యేకించి నీటి సరఫరా యొక్క ఏర్పాటు మరియు నిర్వహణ, ఘన వ్యర్ధాలు మరియు మురుగు నిర్వహణ, పట్టణ ప్రణాళిక, దీపాలు మరియు ఇతర సాంఘిక సేవల కొరకు, ఇది ఆసియాలో ISO 14001-2004 గుర్తింపుని పొందిన మొదటి పురపాలక సంఘం[2].

ఇది విద్యా నగరం, కోళ్ళ పెంపక నగరం, మరియు రవాణా నగరంగా పేర్కొనబడింది.

ఇది తమిళ నాడులోని కొంగు నాడులో భాగం, దీని కొరకు పల్లవులు మరియు పాండ్యులు తీవ్రంగా పోటీపడ్డారు మరియు అపేక్షించారు.నమక్కల్, పల్లవరాజుతో వివాహ సంబంధాన్ని ఏర్పరచుకున్న అటియకుల రాజు గుణశీల పాలనలో ఉండేది. తరువాత ఈ తాలూకా చోళులచే కొంగు మండలంలోనికి చేర్చబడింది.చేర, చోళ మరియు పాండ్యుల మధ్య పోరాటం తరువాత హొయసలులు అధికారంలోకి వచ్చి 14వ శతాబ్దం వరకు నియంత్రించగా, వారి తరువాత విజయనగర రాజులు క్రీ.శ.1565 వరకు పాలించారు. క్రీ.శ.1623లో మదురై నాయకులు అధికారంలోకి వచ్చారు. తిరుమలై నాయక్ యొక్క ఇద్దరు పాలెగాళ్ళు, రామచంద్ర నాయక మరియు గట్టి ముదలియార్స్ సేలం ప్రాంతాన్ని పాలించారు. నమక్కల్ కోట రామచంద్ర నాయకులు నిర్మించినట్లు తెలుపబడుతుంది. సుమారు క్రీ.శ.1625 తరువాత, ఈ ప్రాంతం బీజాపూర్ మరియు గోల్కొండ ముస్లిం సుల్తానులు మరియు మైసూర్ రాజులచే తరువాత మరాఠాలచే పాలించబడింది, సుమారు క్రీ.శ.1750 ప్రాంతంలో హైదర్ అలీ అధికారంలోకి వచ్చాడు. ఈ కాలంలో చరిత్ర, హైదర్ అలీ మరియు తరువాత టిప్పు బ్రిటిష్ వారితో అధికారం కొరకు చేసిన పోరాటంగా ఉంది. నమక్కల్‌లోని రాతికోట ఈ పట్టణం యొక్క ప్రత్యేక లక్షణం. ఈ కోట ఒకటిన్నర ఎకరాల చదునైన ప్రదేశాన్ని ఆక్రమించి ఉంది మరియు నైరుతి దిక్కునుండి ఇరుకైన మెట్ల మార్గం ద్వారా దీనిని చేరవచ్చు. 1768లో బ్రిటిష్ వారు వశపరచుకునే వరకు నమక్కల్ హైదర్ అలీ కిల్‌ధార్ (స్వాధీనం) లో ఉంది. 18వ శతాబ్ద చివర మరియు 19వ శతాబ్ద ప్రారంభంలో బ్రిటిష్ పాలనలో నమక్కల్ కొంతకాలం తిరుచునాపల్లి జిల్లాలో ఉంది. తరువాత నమక్కల్, సేలం జిల్లాకు బదిలీ చేయబడింది.

భౌగోళిక స్థితి

నమక్కల్ 11°14′N 78°10′E / 11.23°N 78.17°E / 11.23; 78.17 వద్ద ఉంది.[3] ఇది సగటున 218 మీటర్ల (715 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది తూర్పు కనుమలలో భాగమైన కొల్లి కొండల (கொல்லிமலை) - సమీపంలో ఉందిகிழக்கு தொடர்சிமலை). దానికి అత్యంత సమీపంలో ఉన్న నది కావేరి (காவேரி).

నమక్కల్ నగరం పరిసర నగరాల నుండి ఈ క్రింది విధంగా ఉంది (దూరం సుమారుగా కిలోమీటర్లలో) :

 • చెన్నై నుండి నైరుతి దిశలో 360 కిమీ
 • బెంగుళూరు నుండి దక్షిణ దిశలో 250 కిమీ
 • ఈరోడ్ (వస్త్రాలు & పసుపు నగరం) నుండి తూర్పు దిశలో 55 కిమీ
 • సేలం (మామిడి & మాగ్నసైట్ నగరం) నుండి దక్షిణ దిశలో 55 కిమీ
 • కోయంబతూర్ నుండి తూర్పుగా 150 కిమీ
 • తిరుచిరాపల్లి నుండి వాయవ్య దిశగా 84 కిమీ

నమక్కల్ యొక్క ప్రాకృతిక చిత్రణ ప్రకారం అది వరదల ప్రభావానికి లోనవదు.

చరిత్ర

కనీసం 7వ శతాబ్దం నుండి నేపథ్యం కలిగిన నమక్కల్ ఒక చారిత్రక నగరం. నమక్కల్ అనే పేరు నామగిరి నుండి వచ్చింది, ఇది పట్టణం మధ్యలో ఉన్న ఏకశిలాకృతి.నమక్కల్‌లోని రెండు గుహాలయాలు అదియెంద్ర విస్నుగ్రుహ (రంగనాథ స్వామి దేవాలయం) మరియు అడియనవాయ విస్నుగ్రుహ (నరసింహ స్వామి దేవాలయం) గా పిలువబడతాయి.ఈ రాతి దేవాలయాలు అధియమన్ వంశానికి చెందిన గుణశీల రాజుచే నిర్మించబడ్డాయి.పల్లవులతో ఆయన వివాహ సంబంధాల కారణంగా ఈ దేవాలయాలు పల్లవ నిర్మాణ శైలిలో 7వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. సాధారణంగా, నమక్కల్ ఒక వైష్ణవ క్షేత్రంగా పరిగణించబడుతుంది, కొన్ని సంవత్సరాల క్రితం వరకు పట్టణంలో ఒక్క శివాలయం కూడా ఉండేదికాదు. మిక్కిలి పెద్దదైన ఈ రాయి-65 మీటర్ల ఎత్తు కలిగి ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ చుట్టుకొలతను కలిగిఉంది. ఈ బ్రహ్మాండమైన రాతి మీద ఒక కోట ఉంది. ఈ కోట 16వ శతాబ్దంలో నమక్కల్‌ను పాలించిన రామచంద్ర నాయకర్ అనే చిన్న రాజు నిర్మించాడు. బ్రిటిష్ వారి నుండి తప్పించుకోవడానికి టిప్పు సుల్తాన్ కొంతకాలం ఈ కోటలో దాక్కున్నాడని నమ్ముతారు. ఈ కోటను టిప్పు సుల్తాన్ నిర్మించలేదు కానీ కొంతకాలం పాటు ఆక్రమించాడు.తరువాత బ్రిటిష్ వారు ఈ కోటను వశపరచుకున్నారు. ఈ రాతి యొక్క ముందరి భాగాన్ని తిరు. వి. క. పారై అని పిలుస్తారు మరియు టాక్సీలు నిలుపు స్థలంగా ఉపయోగిస్తున్నారు.నమకల్ రాతి వాలుపైన 1933లో గాంధీజీ బహిరంగసభను నిర్వహించారు. తమిళ నాడులో, కరువు మరియు యుద్ధం వలన ప్రభావితంకాని అతి తక్కువ ప్రదేశాలలో ఇది ఒకటి.

అత్యంత సమీపంలో ఉన్న నది కావేరి

నమక్కల్ సమీపంలోని చిన్న పట్టణాలలో మోహనూర్ ఒకటి, అక్కడ కావేరీ నది తిరుచిరాపల్లి వైపు ప్రవహిస్తూ ఉంటుంది. మోహనూర్ వద్ద, కావేరీ నదీ తీరాన, ప్రసిద్ధి చెందిన పురాతన శివాలయం-మధుకరవేణితో కూడిన ఆశల దీపేస్వరార్ ఆలయం ఉంది.

ఆంజనేయ స్వామి దేవాలయం

నమక్కల్ ఆంజనేయ స్వామి దేవాలయానికి 1500 సంవత్సరాలకంటే ఎక్కువ చరిత్ర ఉంది. నమక్కల్ కోటను పెద్ద ఆంజనేయ స్వామి కాపలా కాస్తుంటాడు. ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది నమక్కల్ హనుమాన్‌గా పిలువబడుతుంది.ఆంజనేయుడు దిగంబర దేవాలయంలో (ఆకాశం పైకప్పుగా) లక్ష్మీ నృసింహ స్వామి మరియు సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు. ఈ క్షేత్రంలోని ఆంజనేయుడు పద్దెనిమిది అడుగుల పొడవు కలిగి లక్ష్మి నృసింహ స్వామి దర్శనాన్ని సుమారు 250 అడుగులు (76 మీ.) దూరం నుండి చేస్తూ ఉంటాడు. ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహ స్వామి పాదాలతో (పాద పద్మాలు) సరళ రేఖలో ఉంటుంది. ఆంజనేయుడు స్వామి యొక్క పాదపద్మాలను దర్శించుకోవడాన్ని నేటికీ గరుడాళ్వార్ సన్నిథి నుండి గమనించవచ్చు. కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయ స్వామి పాదముద్రలను గమనించవచ్చు.

నమక్కల్‌లో ప్లాటినం లభ్యతలు

భారతదేశ భూగర్భ సర్వే నమక్కల్ జిల్లాలో ప్లాటినం లభ్యతను కనుగొంది. వాటిని మంచి అన్వేషణలుగా వర్ణిస్తూ, GSI పరిశోధనా స్థాయిలోనే ఉందని, అక్కడ ప్లాటినం యొక్క విస్తారమైన నిక్షేపాలు ఉన్నట్లు ఆధారం ఉందని మరియు కచ్చితమైన స్థానం మరియు పరిమాణం కొరకు మరింత పరిశోధన జరుపవలసిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది.

GSI గత మూడు సంవత్సరాల నుండి అన్వేషణా కార్యక్రమంలోనే ఉంది. ప్రస్తుతానికి, 30 మీటర్ల వరకు అన్వేషణ జరుపబడింది. మరింత అన్వేషణ జరిపితే పరిమాణంలో మరియు నాణ్యతలోను గొప్ప ఫలితాలను పొందవచ్చని GSI శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రం యొక్క ఖనిజాభివృద్ధి అన్వేషణను మరింత సులభతరం చేయడానికి అవగాహనా పత్రం సంతకం చేయబడింది.

రాష్ట్రం యొక్క మెట్టుపాలయం మరియు నమక్కల్ ప్రాంతాలలో లభ్యమయ్యే ప్లాటినం సమూహంలోని ఖనిజాల త్రవ్వకం యొక్క వాణిజ్యపరమైన ఉపయోగం గురించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు తమిళ నాడు మినరల్స్ లిమిటెడ్ (టామిన్) సంయుక్తంగా అన్వేషిస్తాయి.

ఒప్పందం ప్రకారం, GSI రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్లాటినం ఉనికిని కనుగొనడానికి పరీక్షలు నిర్వహిస్తుంది.

నమక్కల్ పరిసరాలలోని గ్రామాలు

 • మట్ట పరై పూడూర్ (కలెక్టర్ కార్యాలయం వెనకాల)
 • సెంగపల్లి
 • కథపల్లి
 • కొండిచెట్టిపట్టి
 • నల్లిపాలయం
 • ఓవియంపాలయం
 • కట్టమరపాలయం
 • ఉంజపాలయం
 • ఓలపాలయం
 • పొన్నేరిపట్టి
 • ఏలూర్
 • కల్లాంగ్కాడు
 • E.పుధుపట్టి
 • పెరియ మనాలి
 • వైయప్పమలై
 • కీరంబూర్
 • కోసవంపట్టి
 • రెడ్డిపట్టి
 • సలపాలయం
 • కొప్పనంపాలయం
 • పండమంగళం
 • తిండమంగళం
 • తిరుమలైపట్టి
 • పరమతి
 • వేలూర్
 • పోతనూర్
 • పుదుఛత్రం
 • సెల్లప్పంపట్టి
 • S.వజవంతి
 • సెందమంగళం
 • సిలువంపట్టి
 • గాంధీపురం
 • అన్నానగర్
 • కలప్పనైకేన్పట్టి
 • మారప్పనాయికెన్పట్టి
 • ముతుగపట్టి
 • మరుర్పట్టి
 • అణియపురం
 • లతువాడి
 • మూన్గిల్పట్టి
 • K.రసంపాలయం
 • కరసపాలయం
 • పాలపట్టి
 • కవెట్టిపట్టి
 • కూడచేరి
 • వజావంతి మరియు
 • N.కందంపాలయం
 • కోనూర్
 • కలంగని
 • ఒట్ట కులం పుదూర్
 • వేట్టంబడి
 • విల్లిపాలయం
 • పిల్లూర్
 • వెంగమెట్టుపూదూర్
 • పాచల్
 • వెలగౌండంపట్టి
 • వల్లిపురం
 • అర్థనారిపలయం
 • వసంతాపురం
 • పోరసపాలయం
 • కపిలర్మలై
 • ఎరుమపట్టి
 • అలంగనాథం
 • పొట్టి రెడ్డి పట్టి
 • తూసూర్ (ఈ గ్రామంలోని చెరువు ప్రసిద్ధిచెందింది)
 • కీల్సతంబుర్

నమక్కల్ పరిసరాలలోని పర్యాటక ప్రాంతాలు

సాంప్రదాయ తమిళ సాహిత్య కృతులైన సిలప్పతిగారం, మనిమేకలై, పురాననురు మరియు ఐన్కుర్నురు వంటి గ్రంథాలలో కొల్లి కొండలు కనిపిస్తాయి. క్రీ.శ.200 ప్రాంతంలో ఈ ప్రదేశం వల్విల్ ఒరి పాలనలో ఉంది, ఆయన ప్రాచీన తమిళ నాడు యొక్క ఏడుగురు గొప్ప దాతలలో ఒకరిగా ప్రశంసించబడతారు. ఆయన శౌర్యం మరియు వేటలో నైపుణ్యం అనేకమంది కవులచే ప్రశంసించబడింది, ఇంకా అతని శూరకృత్యాలు జానపదగీతాలలో భాగంగా ప్రసిద్ధిచెందాయి. ఒరి ఒక పులి, ఎలుగు, లేడి మరియు ఒక అడవి పందిని ఒకే బాణంతో కొట్టారని చెప్పబడుతుంది. ఈ పర్వతాలలో కాసే పనసపండు దాని రుచికి మరియు సువాసనకి ప్రసిద్ధి చెందింది మరియు దీనిని సాధారణంగా ఈ పర్వాతాల నుండే వచ్చే తేనెలో నానబెడతారు. ఈ పర్వతాలు వసంత మరియు వర్ష ఋతువులలో పచ్చని వృక్ష సంపదతో కప్పబడి ఉంటాయి, వాటి సహజ అందం ఇనుమడించడానికి ఇవి సెలయేళ్ల ప్రవాహాలను కలిగిఉంటాయి. తమిళ నాడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మూడు అభయారణ్యాలైన అరియూర్ సొలై, కుందూర్ నాడు, పులియంజోలై ఇక్కడ ఉన్నాయి. ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి కారణంగా కొల్లి కొండలు అనే పేరు వచ్చిందనే భావన సరైనది కాదు!పూర్వ సాహిత్యం ప్రకారం ఈ కొండ శిఖరం పైన కొల్లిప్పవై అనే విగ్రహం ఉండేది.ఈ విగ్రహం తన అందంతో బాటసారులను ఆకర్షించి, చంపిన కన్య యొక్క ఆత్మదిగా నమ్ముతారు. ఈ పర్వంతం యాత్రాస్థలంగా కూడా ఉంది, అరపలీస్వరార్ దేవాలయం నుండి రాసిపురంలోని శివాలయానికి రహస్య మార్గం ఉన్నట్లు నమ్మడం దీనికి కారణం. 1వ లేదా 2వ శతాబ్దంలో వల్విల్ ఒరి ఈ ప్రదేశాన్ని పాలించినపుడు ఈ శివాలయం నిర్మించాడని చెప్పబడుతుంది. "అరప్పలీస్వర శతకం" అరప్పలీస్వరార్ దేవుడిని స్తుతిస్తూ రాయబడిన పద్యం. ఈ దేవాలయం సంగం సమయంలోనే ఉండనే నమ్మిక ఉంది.

పర్యాటకం: కొల్లి కొండలు విశ్రాంతి ప్రదేశాలుగా సందర్శనీయం. తమిళనాడులోని పర్వత విడుదులలో, కొల్లి కొండలు, ప్రకృతి ప్రేమికులకి, నడకపట్ల ఆసక్తి ఉన్నవారికి, ట్రెక్కింగ్‌క్లబ్‌లకి మరియు ధ్యాన సాధకులకు ఉత్తమ ఎంపికగా ఉన్నాయి. తమిళ నాడులోని ఇతర పర్వత విడుదులతో పోల్చినపుడు, కొల్లి కొండలు వాణిజ్యపూరితం కాలేదు, తక్కువ కాలుష్యాన్ని కలిగి, ప్రత్యేక పర్వతశ్రేణులను అందిస్తున్నాయి.

కొన్ని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు:

 • అగాయ గంగై జలపాతాలు
 • సిద్ధార్ గుహలు
 • మినీ జలపాతాలు
 • అరప్పలీస్వర్ దేవాలయం
 • ఎట్టుఐ అమ్మన్ దేవాలయం కీరంబూర్
 • మాసి పెరియసామి దేవాలయం మరియు జలపాతాలు
 • సేలూర్ వీక్షణ కేంద్రం
 • బోట్ హౌస్
 • బోటానికల్ గార్డెన్
 • సీకుపరై వీక్షణకేంద్రం
 • సందన పరై
 • జర్మన్ స్వామి ఆశ్రమం
 • పురానికడు సత్ ధర్మ సంగం ఆశ్రమం

కొల్లి కొండలలో ఏమి చేయవచ్చు:

 • పర్వతారోహణ (ట్రెక్కింగ్)
 • ప్రకృతిలో నడక
 • శిలలను అధిరోహించడం
 • త్రాళ్ళతో అధిరోహించడం
 • పక్షులను వీక్షించడం
 • గుహలను అన్వేషించడం
 • నక్షత్రాలను చూడటం
 • కాంప్ ఫైర్
 • క్యాంపు‌ఫైర్‌తో పాటు స్థానిక జానపద గీతాలను/ జానపద నృత్యాన్ని చూడటం
 • మురుగన్ (కుమారస్వామి) కొల్లి కొండలను సందర్శించాడనే సాక్ష్యం బేలుకురిచి వద్ద లభించింది, ఇది నమక్కల్ నుండి ముతుగపట్టి మరియు సెందమంగళం మీదుగా రాసిపురం వెళ్ళే మార్గంలో నమక్కల్ నుండి 24 కిలోమీటర్ల దూరంలోఉంది.
 • అర్థనారీస్వరార్ దేవాలయం, తిరుచెంగోడు నమక్కల్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో తిరుచెంగోడు వద్ద గల అర్థనారీస్వరార్ దేవాలయం.

నిర్మాణంలో ఉన్న నూతన రైలుమార్గం

ఒక నూతన బ్రాడ్ గేజ్ రైలుమార్గం నిర్మాణంలో ఉంది, ఇది సేలాన్ని మొహనుర్ ద్వారా కరూర్ తో, మరియు నమక్కల్ ఇంకా రాసిపురంలను కలుపుతుంది.

ఈ నూతన రైలుమార్గం సేలం, నమక్కల్ మరియు కరూర్ జిల్లాల వృద్ధిని పెంచుతుందని ఆశిస్తున్నారు.

శీతోష్ణస్థితి

సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రత 18 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

ఉంది 1996లో నమోదు నుండి.

జనాభా

2001 నాటికి భారతదేశ జనగణన, [4] నమక్కల్ జిల్లా 1493462 జనాభాను కలిగిఉంది. వీరిలో పురుషులు 51%, మహిళలు 49% ఉన్నారు. నమక్కల్ యొక్క సగటు అక్షరాస్యత రేటు 79%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 84%, మరియు స్త్రీలలో అక్షరాస్యత 74%. నమక్కల్‌లో, 10% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు.

నమక్కల్ ఆర్ధికవ్యవస్థ మరియు పరిశ్రమలు

 • ఈ జిల్లా ప్రాథమికంగా వ్యవసాయాధారమైనది, కానీ ప్రస్తుతం అది దాని వృత్తిని లారీలు, విద్యా సంస్థలు, కోళ్లపెంపకం మరియు రియల్ ఎస్టేట్ లకు మరల్చుకుంది. అందువలన, కోళ్లపెంపకం, లారీ రవాణా మరియు సంబంధిత వ్యాపారాలు పట్టణ ఆర్థికవ్యవస్థను నడిపిస్తునాయి.
 • నమక్కల్ తన లారీ బాడీ నిర్మాణ పరిశ్రమలకు మరియు కోళ్ల ఫారంలకు ప్రసిద్ధిచెందింది. ఇది భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి ప్రాంతం (రోజుకు 3 కోట్ల గుడ్లను ఉత్పత్తిచేస్తుంది).
 • ఈ జిల్లలో అనేక రకాల పంటలు పండుతాయి. ప్రధానమైన పంటలలో కర్రపెండలం ఒకటి, మరియు ఈ కారణంగా నమక్కల్ సగ్గుబియ్యం తయారీకి ప్రసిద్ధిచెందింది (ప్రత్యేకించి సెల్లప్పంపట్టి మరియు అత్తూర్ తాలూకా పరిసర ప్రాంతాలు).
 • తమిళ రాష్ట్రంలోని ATM వ్యవహారాలలో ఇది అనేకసార్లు "ప్రధమ" స్థానంలో నిలిచినట్లు నమోదైంది.[citation needed] కోయంబతూర్ & ఈరోడ్‌ల తరువాత స్థానం. ఈరోడ్ మరియు తిరుపూర్ ల తరువాత ఇది పెద్ద సంఖ్యలో కోటీశ్వరులను కలిగిఉంది.

కళ

నమక్కల్ కవిజ్ఞార్ (நாமக்கல் கவிஞர்) గా అధిక ప్రసిద్ధి చెందిన V. రామలింగం పిళ్ళై, అనే తమిళ కవి నమక్కల్ ప్రాంతానికి చెందినవారు (1888లో మోహనూర్ లో జన్మించారు). అహింసాత్మక భారత స్వాతంత్ర్య సంగ్రామ పోరాటంపై ఆయన పద్యాలు ప్రసిద్ధిచెందాయి. ప్రసిద్ధి చెందిన ఆయన దేశభక్తి గేయం

கத்தி யின்றி ரத்த மின்றி
யுத்த மொன்று வருகுது
சத்தி யத்தின் நித்தி யத்தை
நம்பும் யாரும் சேருவீர்!....

సాంప్రదాయ ఉత్సవాలు మరియు దేవాలయ వేడుకల ద్వారా కుమ్మర మరియు శిల్పకళలు ప్రోత్సహించబడ్డాయి. దక్షిణ భారతదేశంలోని అనేక ఇతర గ్రామాల వలె, ఈ జిల్లాలోని అధిక గ్రామాలు, గ్రామ పరిధిలో గ్రామ దేవతకు దేవాలయాన్ని కలిగి ఉన్నాయి. ఐయనార్ గ్రామరక్షక దేవత. ఐయనార్ శిల్పాలు కళాత్మకతను ప్రతిబింబిస్తూ ఉంటాయి.

ఇద్దరు ప్రముఖ కర్నాటక సంగీతకారులు పల్లవి విద్వాంసుడు నమక్కల్ నరసింహ అయ్యంగార్ మరియు ఆయన శిష్యుడు నమక్కల్ శేష అయ్యంగార్ ఈ గ్రామానికి చెందినవారే. నరసింహ అయ్యంగార్ త్యాగరాజ శిష్య పరంపరకు చెందిన మనమ్బుచావడి వెంకటసుబ్బయ్యర్ వద్ద సంగీతాన్ని అభ్యసించారు. ఆయన తయారుచేసిన అరియకుడి రామానుజ అయ్యంగారు ఇప్పుడు ఈ విద్వాంసుని ప్రతిభ కలిగిఉన్నారు. నమక్కల్ శేష అయ్యంగార్ శిక్షణ ఇచ్చిన V V సదాగోపాన్, ఒక నటుడు, సంగీత అధ్యయనవేత్త మరియు సంగీతకారుడు. నమగిరిప్పేట్టై శ్రీ.కృష్ణన్, నమగిరిప్పేట్టైకి చెందిన ఒక గొప్ప సంగీతకారుడు (నాగస్వరం).

ఇటీవల అభివృద్ధి

 • AIDS అంటువ్యాధి మరియు నియంత్రణ
  • HIV/AIDS వ్యాధిగ్రస్తుల ప్రత్యేకించి మహిళా హక్కుల రక్షణకు మద్రాస్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి నమక్కల్ లో ఒక "శాశ్వత న్యాయ సహాయకేంద్రం" కొరకు ప్రతిపాదించారు.[5]
 • నమక్కల్, చెత్త రహిత పర్యావరణ-నగరం
  • భారతదేశంలో చెత్త రహితంగా విజయవంతంగా నడుస్తున్న అతి కొన్ని పురపాలక సంఘాలలో నమక్కల్ ఒకటి, పర్యావరణ-అనుకూల పట్టణ వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్ట్ అధ్యయనం కొరకు అనేకమంది సందర్శకులు వస్తుంటారు.[6][7][8]
 • నమక్కల్ కొరకు ట్రైన్/రైల్వే స్టేషను
  • దక్షిణ రైల్వే అనుసంధానంలో భాగంగా నమక్కల్ మరియు మోహనూర్ మీదుగా సేలం మరియు కరూర్ ల మధ్య నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణంలో ఉంది.[9] కరూర్ జిల్లాలోని వంగల్ మరియు నమక్కల్ జిల్లాలోని మొహనూర్ లను కావేరి నదిపై ఒక రైలు వంతెన కలుపవలసిఉంది.[10][11][12]
 • నమక్కల్ కు సమీప విమానాశ్రయం సేలం విమానాశ్రయం
  • సేలం విమానాశ్రయంలో వాణిజ్య విమానాలు 2009 నవంబరు 15 నుండి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చే సేలం నుండి చెన్నై వరకు నడుపబడుతున్నాయి.[13]

రాజకీయాలు

నమక్కల్ శాసనసభా నియోజకవర్గం నమక్కల్ (లోక్ సభ నియోజకవర్గం) లో భాగంగా ఉంది. నూతనంగా ఏర్పడిన నియోజకవర్గం నుండి .S.గాంధీసెల్వన్ M.P.గా ఎన్నికై ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిగా ఉన్నారు[14].

విద్యా సంస్థలు

విద్యాసంస్థలు

 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, పాలపట్టి.
 • నేషనల్ పబ్లిక్ స్కూల్, నమక్కల్.
 • లిటిల్ ఏంజెల్ మెట్రిక్యులేషన్ స్కూల్, అణియపురం.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, మానికంపాలయం.
 • స్పెక్ట్రం అకాడెమి మెట్రిక్యులేషన్ స్కూల్, నమక్కల్.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్[ADW], కలాంగణి.
 • థన్తాయి.P.పద్మనాబన్.గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, మనాలి జేడర్ పాల్యం- 637410
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, వైయప్పుమలై- 637410
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, ఏలూర్- 637018
 • సేన్గుంత్తార్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, గురుసామి పాలయం.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, మల్ల సముత్రం.
 • శ్రీ వినాయక మెట్రిక్యులేషన్ స్కూల్, వైయప్పమలై.
 • ది నవోదయ అకాడెమి CBSE స్కూల్, నమక్కల్.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, పండమంగళం
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, పోతనుర్-638181
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, సేన్ధమంగళం
 • పంచాయత్ యూనియన్ మిడిల్ స్కూల్, వేట్టంబడి.
 • మునిసిపల్ హై స్కూల్ -ఫోర్ట్
 • కామరాజ్ హయ్యర్ సెకండరీ స్కూల్, సేలం రోడ్, నమక్కల్
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, పుదుచత్రం-637018
 • శ్రీ రంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రాయర్‌పాలయం, తిరుచెంగోడే - 637 205, నమక్కల్.
 • R.N. ఆక్స్ఫర్డ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, పండమంగళం
 • శ్రీ వినాయగా హయ్యర్ సెకండరీ స్కూల్, కలెక్టరేట్ సమీపంలో.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, సేల్లప్పంపట్టి.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, ముతుగపట్టి.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ బాయ్స్, నమక్కల్ (దక్షిణం).
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ గర్ల్స్, నమక్కల్.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, నమక్కల్ (ఉత్తరం).
 • N.S.ఆరుముగ ఉదయార్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, అనియపురంపుదూర్, నమక్కల్ జిల్లా.
 • ది సేలం కో-ఆపరేటివ్ షుగర్ మిల్స్ మెట్రిక్యులేషన్ స్కూల్, మోహనూర్, నమక్కల్ జిల్లా.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, మోహనూర్
 • ది స్పెక్ట్రం అకాడెమి, నమక్కల్
 • కొంగు మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, కీరంబూర్'
 • కొంగునాడు మెట్రిక్యులేషన్ సెకండరీ స్కూల్, వేలగౌండంపట్టి.
 • భారతి హయ్యర్ సెకండరీ స్కూల్. రెడ్డిపట్టి, నమక్కల్ - 637001
 • నమ్మాళ్వార్ మిడిల్ స్కూల్, నమక్కల్'
 • PGP గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, పరామతి, వేలూర్
 • కురింజి మెట్రిక్యులేషన్ సెకండరీ స్కూల్
 • శ్రీ మహాభారతి హయ్యర్ సెకండరీ స్కూల్, కూలిపట్టి
 • గాంధీ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, కందంపాలయం
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, కందంపాలయం
 • ట్రినిటీ అకాడెమి మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, లధువాడి
 • కందసామి కందర్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్, వేలూర్, నమక్కల్
 • కందసామి కందర్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్, వేలూర్, నమక్కల్
 • కందసామి కందర్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, నమక్కల్
 • వేత లోగ విద్యాలయ, నమక్కల్
 • SRV హయ్యర్ సెకండరీ స్కూల్, రాసిపురం, నమక్కల్ జిల్లా
 • మహేంద్ర మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ (సహ-విద్య)
 • SPB మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్
 • అన్నా నెహ్రూ మెట్రిక్యులేషన్ స్కూల్, ముదలైపట్టి
 • సురబి మెట్రిక్యులేషన్ స్కూల్, కంబ్లై, నమక్కల్
 • న్యూ బ్రైట్ నర్సరీ & ప్రైమరీ స్కూల్, తన్నీర్ పండల్, పోతనూర్
 • సన్ స్టార్స్ మెట్రిక్యులేషన్ స్కూల్, వడకరైయతుర్
 • జాక్ అండ్ జిల్ మెట్రిక్యులేషన్ స్కూల్, రామపురుంపూదూర్, నమక్కల్
 • కింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నల్లూర్, నమక్కల్ సమీపం
 • సెల్వం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ముల్లంపట్టి, నమక్కల్ నుండి 5 కిలోమీటర్ల దూరం
 • కొంగు మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, పరామతి వేలూర్
 • వెట్రి వికాస్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్, రాసిపురం.
 • వెట్రి వికాస్ (గర్ల్స్) హయ్యర్ సెకండరీ స్కూల్, కీరనూర్, మల్లూర్.
 • వెట్రి వికాస్ (బాయ్స్) సెకండరీ స్కూల్, కీరనూర్, మల్లూర్.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, కలప్పనైకెంపట్టి
 • గవర్నమెంట్ హై స్కూల్, కోనూర్, నమక్కల్ - 637207.
 • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, పరామతి, నమక్కల్ - 637207.
 • వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పందమంగళం, నమక్కల్.

కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు

పాలిటెక్నిక్ కళాశాలలు

 • భారత్ పాలిటెక్నిక్ కాలేజ్, మానికంపాలయం, తిరుచెంగోడ్.
 • K.S.R ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచెంగోడ్.
 • K.S.R పాలిటెక్నిక్ కాలేజ్, తిరుచెంగోడ్.
 • PGP పాలిటెక్నిక్ కాలేజ్, విల్లి పాలయం, నమక్కల్ .
 • పావై పాలిటెక్నిక్ కాలేజ్, పచాల్, నమక్కల్.
 • ముత్యమ్మళ్ పాలిటెక్నిక్ కాలేజ్, రాసిపురం.
 • ది సేలం కో-ఆపరేటివ్ షుగర్ మిల్స్ పాలిటెక్నిక్ కాలేజ్, మోహనూర్
 • C.M.S పాలిటెక్నిక్ కాలేజ్, నమక్కల్

ఆర్ట్స్ అండ్ సైన్స్

 • K. S. R. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, తిరుచెంగోడ్.
 • J.K.K.నట్ట్రాజ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, కొమరపాలయం.
 • సేన్గుంతార్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్, తిరుచెంగోడ్, నమక్కల్.
 • Govt ఆర్ట్స్ కాలేజ్, అందగలుర్ గేట్, రాసిపురం.
 • ముతాయ్అమ్మాళ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, రాసిపురం
 • అరిజ్ఞార్.అన్నా Govt. ఆర్ట్స్ కాలేజ్ కనవైపట్టి, నమక్కల్ (1998 వరకు పురుషులకు మాత్రమే ఉండేది)
 • కందస్వామి కండరస్ కాలేజ్, వేలూర్, నమక్కల్
 • మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, నమక్కల్
 • N.K.R. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ వుమెన్, నమక్కల్
 • P.G.P. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, నమక్కల్.
 • సెల్వం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, నమక్కల్.
 • సుబ్రమనియం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, మోహనూర్, నమక్కల్
 • ట్రినిటీ కాలేజ్ ఫర్ వుమెన్, నమక్కల్
 • వివేకానంద కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (W), ఎలయంపాలయం
 • వివేకానంద కాలేజ్ ఫర్ వుమెన్, ఉన్జనై

కేటరింగ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్

 • P.G.P. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, నమక్కల్
 • సెల్వం ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్.
 • నల హోటల్స్
 • హోటల్ గోల్డెన్ పాలస్.

డెంటల్

 • KSR డెంటల్ కాలేజ్, తిరుచెంగోడ్.
 • J.K.K.నటరాజ డెంటల్ కాలేజ్ & హాస్పిటల్, కొమరపాలయం
 • వివేకానంద డెంటల్ కాలేజ్ ఫర్ వుమెన్, తిరుచెంగోడ్

నర్సింగ్

 • J.K.K.నటరాజ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ & రిసెర్చ్

ఇంజనీరింగ్

 • K. S. రంగసామి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచెంగోడ్.
 • K.S.R కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుచెంగోడ్.
 • J.K.K.నటరాజ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, కొమరపాలయం
 • PGP కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
 • CMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నమక్కల్[15]
 • వివేకనాధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ వుమెన్, ఎల్యంపాలయం
 • అన్నై మతమ్మల్ షీలా ఇంజనీరింగ్ కాలేజ్, ఎరుమపట్టి, నమక్కల్ జిల్లా
 • ఎక్సెల్ ఇంజనీరింగ్ కాలేజ్, నమక్కల్
 • జ్ఞానమణి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, నమక్కల్ జిల్లా
 • కొంగునాడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ[16], నమక్కల్ -త్రిచీ రోడ్
 • కింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, నమక్కల్
 • పావాయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నమక్కల్
 • పావాయ్ ఇంజనీరింగ్ కాలేజ్, నమక్కల్
 • సెల్వం కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, నమక్కల్
 • వివేకనాధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ వుమెన్, ఎల్యంపాలయం
 • ది అమెరికన్ కాలేజ్
 • మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్, వడుగాపాలయం, తిరుచెంగోడ్-సేలం మెయిన్ రోడ్
 • ముతయమ్మల్ ఇంజనీరింగ్ కాలేజ్, రాసిపురం, నమక్కల్ జిల్లా

హోమియోపతి

 • డాక్టర్ హానిమన్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ సెంటర్, నమక్కల్ జిల్లా

' నిర్వహణ

 • K. S. రంగసామి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచెంగోడ్.
 • K.S.R కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుచెంగోడ్.
 • C.M.S ఎడ్యుకేషనల్ ట్రస్ట్
 • J.K.K.నటరాజ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, కొమరపాలయం
 • అన్నై మతమ్మల్ షీలా ఇంజనీరింగ్ కాలేజ్, నమక్కల్
 • P.G.P. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, నమక్కల్
 • P.G.P. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నమక్కల్
 • పావాయ్ ఇంజనీరింగ్ కాలేజ్, నమక్కల్
 • వివేకనాధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ వుమెన్, ఎల్యంపాలయం
 • వివేకానంద కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, ఎల్యంపాలయం
 • ది స్పెక్ట్రం అకాడెమి, నమక్కల్

రవాణా కేంద్రం

నమక్కల్ 1957 నుండి ఒక ప్రధాన లారీ మరియు ట్రక్ కేంద్రంగా ఉంది, ఆ సమయంలో A.ముతుస్వామి చెట్టియార్ AMC ఆటోమొబైల్స్ స్థాపించారు. ట్రైలర్లు, టాంకర్లు మరియు లారీల సముదాయాలను నమక్కల్‌లో చూడవచ్చు.

నమక్కల్ జిల్లా తమిళనాడు రాష్ట్రంలోని రవాణా కేంద్రాలలో ఒకటిగా ఎదిగింది. రాష్ట్రంలో నడిచే ట్రక్కులలో సుమారు 40 శాతం ట్రక్ నిర్మాణంలో ప్రసిద్ధిచెందిన నమక్కల్ మరియు నమక్కల్ జిల్లా నుండి ఉన్నాయి, 3,000 టాంకర్ లు మరియు 2,500 ట్రైలర్ లతో మొత్తం 18,000 ట్రక్కులు ఉండగా, ప్రతి సంవత్సరం 500 ట్రక్కులు కొత్తగా చేరుతున్నాయని అంచనా.

నమక్కల్ డ్రైవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ రకమైన వాటిలో మొదటిది మరియు డ్రైవర్ల శిక్షణ మార్గం చూపే దీపం వలె పనిచేసింది.

ఈరోడ్, సేలం మరియు త్రిచీ నుండి సులభంగా రాగలిగి, 25 ఎకరాలు (100,000 మీ2) విస్తీర్ణంతో, ఈ ప్రాంగణం అన్నిరకాల రహదారుల ఆకారాల నిర్మాణాలను కలిగిఉంది. ఒక విశాలమైన భవనం పెద్ద తరగతి గదులు, ఒక గ్రంథాలయం, ఒక నమూనా గది, ఒక ప్రయోగశాల మరియు ఒక ఫలహారాలశాల దానికి అనుసంధానంగా ఒక ఓపెన్-ఎయిర్ థియేటర్ కలిగిఉంది.

ఈ డ్రైవింగ్ శ్రేణి ఒక లైను, రెండు లైన్లు, నాలుగు లైన్లు మరియు ఆరు లైన్ల రహదారులను, ‘S’ వంపు, ‘8’ వంపు మరియు తలపిన్ను వంపులను, విభిన్న కొలతల ఎత్తు పల్లాలను, స్పీడ్ బ్రేకర్లను, బై-పాస్ రోడ్, ‘Y’ కూడలి, అనేక రకాల పార్కింగ్ స్థలాలను, కనీస మరియు విభిన్న కొలతలతో కలిగిఉంది.

ఈ రహదారులు ఎలక్ట్రానిక్ సంకేతాలు, సూచనలు, గుర్తులు మరియు రాత్రిపూట డ్రైవింగ్‌కి అవసరమైన దీపాలను కలిగి– ప్రధాన రహదారులపై డ్రైవర్లు ఎదుర్కునే అన్ని లక్షణాలను కలిగిఉంది.

C.M.S ఎడ్యుకేషనల్ ట్రస్ట్

కోళ్ళపెంపక కేంద్రం

దక్షిణ భారతదేశంలో ప్రధాన కోళ్ళ ఉత్పత్తిదారు అయిన నమక్కల్, ఇటీవలి సంవత్సరాలలో అనుకూలమైన మార్పును గమనిస్తోంది. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ యొక్క నమక్కల్ మండలంలోని 75 శాతం పక్షులు ఈ జిల్లా నుండే ఉన్నాయి. ఈ మండలంలోని కోళ్ళ పెంపక విభాగం గత రెండు సంవత్సరాలలో 19.53 శాతం వృద్ధిని సాధించింది[ఎప్పుడు?]. మొత్తం పక్షుల సంఖ్య 2005-06లో 307.34 లక్షల నుండి 2007-08లో 367.35 లక్షలకు పెరిగింది. ఈ మండలం ఒక రోజులో 2.5 కోట్ల గుడ్లను ఉత్పత్తిచేయగా, మొత్తం ఉత్పత్తిలో నమక్కల్ నుండే 1.75 కోట్లు వస్తాయి. శ్రమ-సాంద్రత అధికంగా ఉండే ఈ రంగం లక్షమందికి పైన ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తోంది.

సూచనలు

 1. నమక్కల్ మునిసిపాలిటి వెబ్సైటులోని చాయాచిత్రాలు
 2. ISO సర్టిఫికేట్ యొక్క ఛాయాచిత్రం
 3. ఫాలింగ్ రెయిన్ జెనోమిక్స్, Inc - నమక్కల్
 4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
 5. నమక్కల్ కొరకు HIV/AIDS న్యాయ సహాయ కేంద్రం: ది హిందూ , ఏప్రిల్ 16, 2007
 6. జీరో గార్బేజ్ ఇనీషియేటివ్ ఇన్ నమక్కల్ టౌన్: ఇండియా బెస్ట్ ప్రాక్టిసెస్ కేటలాగ్ 2003, ఎన్ రూట్ టు అర్బన్ రిఫార్మ్స్: అర్బన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆసియా
 7. నమక్కల్, ఒక చెత్త రహిత నగరం: ChennaiOnline న్యూస్, 23 మార్చ్ 2006
 8. నమక్కల్ : భారతదేశం, తమిళ నాడులోని చెత్త కుండీ లేని పట్టణం: న్యూ ఢిల్లీ TV, 5 జూన్ 2006
 9. సదరన్ రైల్వే టెండర్ నోటీసు, 12 మార్చ్ 2007
 10. కరూర్-సేలం బ్రాడ్ గేజ్ మార్గం పని వేగవంతం చేయాలి, ది హిందూ న్యూస్, బుధవారం, డిసెంబర్ 27, 2006
 11. వికీ మాప్: నమక్కల్ రైల్వే స్టేషను, లతువాడి, మొహనుర్ రోడ్, నమక్కల్
 12. http://www.hindu.com/2007/07/17/stories/2007071750310100.htm Missing or empty |title= (help)
 13. http://www.hindu.com/2009/10/15/stories/2009101554400500.htm Missing or empty |title= (help)
 14. "List of Parliamentary and Assembly Constituencies". Tamil Nadu. Election Commission of India. Retrieved October 9, 2008.
 15. http://www.CMSకాలేజ్.net
 16. http://www.kongunadu.org

బాహ్య లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వీటిని కూడా చూడండి

 • కొల్లి కొండలు
 • కర్రపెండలం
 • చిన్న వెప్పనాథం
 • కట్టిపాలయం

వెలుపలి లింకులు