"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నాయుని కృష్ణమూర్తి

From tewiki
Jump to navigation Jump to search
నాయుని కృష్ణమూర్తి
175px
జననం
నాయుని కృష్ణమూర్తి

1951
మరణంమార్చి 1, 2018(2018-03-01) (వయస్సు 67)
వృత్తిప్రచురణకర్త, రచయిత
సురరిచితుడుపాఠశాల,
మాబడి
జీవిత భాగస్వాములుపద్మకుమారి
తల్లిదండ్రులు
 • నాయుని రామయ్య (తండ్రి)
 • నరసమ్మ (తల్లి)

నాయుని కృష్ణమూర్తి (1951-2018) ప్రముఖ రచయిత మరియు ప్రచురణకర్త.[1] ఇతడు వెలువరిస్తున్న విద్యాసంబంధమైన మాసపత్రికలు పాఠశాల, మాబడి ప్రజాదరణకు నోచుకున్నాయి.[2]

విశేషాలు

ఇతడు చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951లో నాయుని రామయ్య, నాయుని నరసమ్మ దంపతులకు జన్మించాడు. హైస్కూలు చదువు నుంచి, సాహిత్యం, రచనల పట్ల ఆసక్తి చూపాడు. ఇతడు 23 ఏళ్ల వయసులో రాసిన మొదటి నవల యామినీకుంతలాలుకు ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక నిర్వహించిన ఉగాది నవలల పోటీలో బహుమతి లభించింది. తర్వాత నాయుని కృష్ణమూర్తి పత్రికారంగంలోకి అడుగు పెట్టాడు. కొంత కాలం బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక మిత్రుడి భాగస్వామ్యంలో స్నేహబాల అనే పిల్లల పత్రికను కొంతకాలం నిర్వహించాడు. 1977 లో మాబడి, 1978 లో పాఠశాల పత్రికలను విద్యార్థుల కోసం విజయవాణి సంస్థ ద్వారా ప్రచురించడం ప్రారంభించాడు.[3]

రచనలు

ఇతడు అనేక నవలలు, కథలు, ఆధ్యాత్మిక రచనలు చేశాడు. సినీగేయ రచయితగా కూడా సేవలను అందించాడు. మహర్షి సినిమాలో ఇతడు వ్రాసిన "సుమం ప్రతి సుమం సుమం" అనే పాట జనాదరణను పొందింది[3].

ఇతడు వ్రాసిన కొన్ని రచనలు:

 1. జయమ్‌ (మహాభారతం మూలకథ)
 2. మహాభాగవతం (మూడు భాగాలు)
 3. రామాయణం
 4. ఏంలేదు (కథలు)
 5. కథలు
 6. మనసు గుర్రమురోరి మనిషీ (నవల)
 7. యామినీ కుంతలాలు (నవల)
 8. ప్రలోభం (నవల)
 9. ఖేల 333
 10. కాటుక కరిగిపోయింది
 11. విజయవాణి తెలుగు ఇంగ్లీషు నిఘంటువు
 12. తెలుగు ఇంగ్లీషు నిఘంటువు
 13. పుస్తక షణ్ముఖం అభినందన సంచిక (సాకం నాగరాజతో కలిసి)
 14. మన బతుకులు మారాలి[4]
 15. ఈ కోతి ఈ డ్రామాకు పనికొస్తుందా? (ఏకాంకిక)
 16. వియోగవిభావరి (ఏకాంకిక)

మరణం

ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 2018, మార్చి 1వ తేదీన తన 67వ యేట మరణించాడు[3].

మూలాలు

 1. "కృష్ణమూర్తి లేరు". eenadu.net. చిత్తూరు: ఈనాడు. Archived from the original on 2 March 2018. Retrieved 2 March 2018.
 2. "'మాబడి' కృష్ణమూర్తి కన్నుమూత". eenadu.net. చౌడేపల్లి, చిత్తూరు: ఈనాడు. Archived from the original on 2 March 2018. Retrieved 2 March 2018.
 3. 3.0 3.1 3.2 వెబ్ మాస్టర్. "ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి ఇకలేరు". సమయం. Retrieved 1 March 2018.
 4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).