"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నారాయణపేట పురపాలక సంఘము

From tewiki
Jump to navigation Jump to search

ఈ పురపాలకసంఘం మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదటగా అవతరించింది. నారాయణపేట పురపాలక సంఘము తెలంగాణలోనే హైదరాబాదు తర్వాత రెండవ పురాతన పురపాలక సంఘంగా ఘనతకెక్కింది. 1947లో అవతరించిన ఈ పురపాలక సంఘానికి సమరయోధుడిగా ప్రసిద్ధి చెందిన రాంచందర్ రావు కళ్యాణి తొలి చైర్మెన్ గా వ్యవహరించగా ఇప్పటివరకు 10 మంది ఈ విధులను నిర్వహించారు.ప్రస్తుతం ఇది మూడవశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతుంది. 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 33 వార్డులు, 48825 ఓటర్లు కలరు. 2014 మార్చి 30న జరగబోయే ఎన్నికలకై చైర్మెన్ స్థానాన్ని బీసి (మహిళ) కు కేటాయించారు.

ఈ పురపాలక సంఘం పరిధి 11.87 చకిమీ. 2001 ప్రకారం జనాభా 37,563 ఉండగా, 2011 నాటికి 41,539కు పెరిగింది. 2010-11 నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం 19.5, వ్యయము 19.27 కోట్ల రూపాయలు.

సదుపాయాలు

పురపాలక సంఘం పరిధిలో సుమారు 3400 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 67 కిమీ పొడవైన రహదారులు, 71 కిమీపొడవైన మురికి కాల్వలు, ఒక పార్కు, ఒక మార్కెట్, ఒక వధశాల, 11 కమ్యూనిటి భవనాలు ఉన్నాయి.

ఆదాయ వనరులు

పురపాలక సంఘానికి ఇంటిపన్ను, నీటిపన్ను, అనుమతి ఫీజు ప్రధాన ఆదాయవనరులు. పురపాలక సంఘం నిర్మించిన 98 దుకాణాల ద్వారా వచ్చే ఆదాయము, ప్రభుత్వం నుంచి వచ్చే పలు గ్రాంటుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

2005 ఎన్నికలు

2005లో నిర్వహించిన పురపాలక సంఘం ఎన్నికలలో చైర్-పర్సన్‌గా వై.శశికళ, వైస్-చైర్‌పర్సన్‌గా శిల్లా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.

మూలాలు

బయటి లింకులు