"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నావికుడు

From tewiki
Jump to navigation Jump to search

నావ నడుపు వ్యక్తిని నావికుడు లేదా ఓఁడంగి అంటారు. నావ అనగా పడవ, లేదా ఓఁడ సాధారణంగా సముద్రాలలో ఓడ నడిపే వ్యక్తినే నావికునిగా వ్యవహరిస్తారు. స్త్రీలింగ వాచకము నావిక లేదా ఓఁడంగిని. నావికుడు సరియైన దిశలో నావను నడిపి గమ్యస్థానానికి సరియైన సమయానికి చేర్చవలసిన బాధ్యతను కలిగి ఉంటాడు. ప్రధానంగా నావికుడు అన్ని సమయాల్లో తాను నడుతున్న ఓడ ఏ స్థానంలో ఉందో తెలుసుకోగల ప్రాథమిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. నావికుడు ఓడ యొక్క నాటికల్ పటాలు, నాటికల్ ప్రచురణలు, మార్గదర్శిని సామగ్రిని నిర్వహించడం, సాధారణంగా వాతావరణ పరికరాలు, సమాచార బాధ్యతలను నిర్వహిస్తాడు.

నావికులు దారి తెలుసుకొనుటకు

పూర్వం నావికులు సముద్రాలలో ఓడను నడిపేటప్పుడు ఆకాశంలోని సూర్యచంద్రులు, నక్షత్రాల ఆధారంగా దారి తెలుసుకునేవారు. అయితే ఆకాశాన్ని మబ్బులు కమ్మినప్పుడు, వాన పడుతున్నప్పుడు దారి అర్థం కాక అవస్థలు పడేవారు. ఆ తరువాత అయస్కాంతం ద్వారా దిక్కులను అర్థం చేసుకోవడం ప్రారంభమయింది. అయస్కాంతం ద్వారా దిక్కులను సూచించే పరికరాన్ని దిక్సూచి లేదా కంపాస్ అంటారు. నాలుగు దిక్కులను సూచించే పరికరంగా ప్రారంభమయిన దిక్సూచి, దిక్కులను 32 విభాగాలుగా సూచించే విధంగా ఆధునీకరించడంతో నావికులకు దారి తెలుసుకోవడం మరింత సులభమయింది.

మూలాలు

  • సాక్షి దిన పత్రిక - 12-07-2014