"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నిరోధాల శ్రేణిసంధానం

From tewiki
Jump to navigation Jump to search

ఒక నిరోధం లోని రెండవ టెర్మినల్ ను రెండవనిరోధం లోనిమొదటి టెర్మినల్ కు, రెండవ నిరోధం లోని రెండవ టెర్మినల్ ను మూడవ నిరోధం లోనిమొదటి టెర్మినల్ కు ...... ఈ విధంగా నిరోధాలను కలిపినట్లయితే ఆ సంధానాన్ని నిరోధాల శ్రేణి సంధానం అంటారు. ఇందులో ఫలిత నిరోధం విడివిడి నిరోధాల మొత్తానికి సమానంగా ఉంటుంది.

నిరోధాలను శ్రేణి సంధానం చేయుట.

ఫలిత నిరోధం=

శ్రేణిసంధానంలో ఫలిత నిరోధం

నిరోధాలను శ్రేణి సంధానం చేయునపుడు ఆ సంధానం చివరి టెర్మినల్ లను ఒక విద్యుత్ వలయానికి కలిపినపుడు వలయంలో విద్యుత్ ప్రవాహం స్థిరంగా ఉంటుంది. కాని మూడు నిరోధాలు కూడా సామర్థ్య జనకం అయిన బ్యాటరీ యొక్క విద్యుచ్ఛాలక బలమునుని పంచుకుంటాయి. అనగా బ్యాటరీ యొక్క ధ్రువాల మధ్య పొటెన్షియల్ భేదం, నిరోధం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం, నిరోధం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం, నిరోధం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదంగా విభజించబడుతుంది. అనగా

అవుతుంది.
ఓం నియమం ప్రకారంఅవుతుంది
అందువలన

అందువలన నిరోధాలను శ్రేణి సంధానం చేయునపుడు ఫలిత నిరోధం విడివిడి నిరోధాల మొత్తానికి సమానంగా ఉంటుంది.

యివి కూడా చూడండి