నిర్జలీకరణము

From tewiki
Jump to navigation Jump to search
Dehydration
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}

నిర్జలీకరణము (హైపోహైడ్రేషన్ ) శరీర ద్రవం యొక్క అధిక క్షయంగా నిర్వచించబడుతుంది. ఇది అక్షరాల ఒక వస్తువు నుండి నీటిని (మూస:Lang-grc) తీసివేయటమే అయినప్పటికీ శరీరశాస్త్ర ప్రకారము, ఇది ఒక జీవిలో ద్రవం యొక్క కొరతకు కారణమవుతుంది.

నిర్జలీకరణము ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది: హైపోటానిక్ (ప్రధానంగా ఎలెక్ట్రోలైట్స్ క్షయం, ముఖ్యంగా సోడియం), హైపర్టానిక్ (ప్రధానంగా నీటి క్షయం), మరియు ఐసోటానిక్ (నీరు మరియు ఎలెక్ట్రోలైట్స్ యొక్క సమాన క్షయం).[1] మానవులలో, అతి సాధారణంగా కనిపించే నిర్జలీకరణము ఐసోటానిక్ (ఐసోనట్రేమిక్) నిర్జలీకరణము ఇది హైపోవొలేమియాతో సమర్ధవంతంగా సమీకరిస్తుంది, కానీ నిర్జలీకరణము జరిగిన వ్యక్తులకు చికిత్స చేసేటప్పుడు హైపోటానిక్ లేదా హైపర్టానిక్ నిర్జలీకరణముల నుండి ఐసోటోనిక్ ను విభేదించటం ముఖ్యం కావచ్చు. దాని పేరు కేవలము నీరు క్షయం అవటం అని సూచిస్తున్నపటికీ, శరీరశాస్త్రము ప్రకారము దాని అర్థం కేవలము నీటి క్షయం మాత్రమే కాదు, ఎందుకనగా నీరు మరియు ద్రావితాలు (ముఖ్యంగా సోడియం) రక్తపు రసిలో ఏ విధంగా ఉంటాయో దాదాపు అదే పరిమాణాలలో క్షయం అవుతాయి.

==హైపోవొలేమియా (రక్తపు ఘనపరిమాణంలో తరుగుదల) నుండి వ్యత్యాసం == హైపోవొలేమియా అనేది ముఖ్యముగా రక్తపు రసి (జీవ ద్రవ్యం) యొక్క ఘనపరిమాణంలో తరుగుదల.[2][3] అంతేకాకుండా, హైపోవొలేమియా నీటి కొరతను ముఖ్యంగా నీరు కన్నా కేవలం ఘనపరిమాణం దృష్ట్యా నీటి కొరతను నిర్వచిస్తుంది.

అయినప్పటికీ, ఈ పరిస్థితులు ఏకకాలంలో సంభవిస్తాయి.

మానవులలో నిర్జలీకరణమునకు వైద్య కారణాలు

మానవులలో, అనేక వ్యాధులు మరియు స్థితులు నిర్జలీకరణమునకు కారణమవుతాయి, ఉదాహరణకు శరీరంలోని నీటి అంతర్గత సమతౌల్యతని దెబ్బతీసే స్థితులు. వాటిలో:

లక్షణాలు మరియు వ్యాధి పరిణామాన్ని ముందుగా సూచించటం

లక్షణములలో హాంగ్ ఓవర్ (అధికంగా మద్యం సేవించిన తర్వాతి స్థితి) సమయంలో వచ్చే తలనొప్పి వంటి నొప్పి, కండరాల నొప్పులు, అకస్మాత్తుగా అగుపించే విజువల్ స్నో (కళ్ళ ముందు మంచు కురుస్తున్నట్లు అనిపించటము), రక్త పోటులో తరుగుదల (హైపోటెన్షన్), మరియు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ మూలంగా తల తిరగటం లేదా మూర్ఛ వంటివి ఉంటాయి. నిర్జలీకరణమునకు చికిత్స చేయకపోతే సన్నిపాతం, స్పృహ లేకపోవటం, నాలుక వాయటం మరియు, అరుదైన సందర్భాలలో మరణమునకు దారి తీస్తుంది.

సహజంగా ఒక వ్యక్తి శరీరంలో ఉండే సాధారణ నీటి ఘనపరిమాణంలో 2% క్షయమైన తర్వాత నిర్జలీకరణ లక్షణాలు గమనార్హమవుతాయి. ప్రారంభంలో, ఆకలి మందగించటం మరియు చర్మం పొడిబారటంతో పాటు దాహము మరియు అసౌకర్యమును అనుభవిస్తారు. దీని తర్వాత మలబద్ధకం వస్తుంది. క్రీడాకారులు ప్రదర్శనలో 30% క్షయానికి గురవుతారు[5] మరియు కందిపోవటం, తక్కువ ఓర్పు, వేగంగా గుండె కొట్టుకోవటం, శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల, మరియు త్వరగా అలసి పోవటం వంటి వాటికి లోనవుతారు.

తీవ్రంకాని నిర్జలీకరణ లక్షణములలో దాహం, మూత్ర పరిమాణంలో తగ్గుదల, అసాధారణంగా ముదురు రంగు మూత్రం, చెప్పలేని అలసట, చిరాకు, ఏడ్చినప్పుడు కన్నీరు రాకపోవటం, తలనొప్పి, నోరు ఎండిపోవటం, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ మూలంగా నిలబడినప్పుడు తల తిరగటం వంటివి ఉంటాయి, మరియు కొన్ని సందర్భాలలో నిద్రలేమికి కారణం కావచ్చు. రక్త పరీక్షలు హైపర్అల్బుమినేమియా (రక్తంలో ఆల్బుమిన్ ఎక్కువగా ఉండటం) ను చూపిస్తాయి.

మధ్యస్థం నుండి తీవ్రమైన నిర్జలీకరణంలో, అసలు మూత్ర విసర్జన ఉండక పోవచ్చు. ఈ స్థితులలోని ఇతర లక్షణాలలో బద్ధకం లేదా అతిగా నిద్రరావటం, వాతరోగములు, పసిపిల్లలలో గుంటలు పడ్డ ఫాంటనెల్ (పుర్రెలో మెత్తని ప్రదేశము), మూర్ఛ, మరియు గుంటలు పడ్డ కళ్ళు మొదలైనవి ఉంటాయి.

అధిక నీటి క్షయంతో ఈ లక్షణాలు మరింత పెరుగుతాయి. ప్లాస్మా (రక్తపు రసి) పరిమాణం మరియు రక్త పోటులలో తగ్గుదలను భర్తీ చేయటానికి ఒక వ్యక్తి యొక్క గుండె మరియు శ్వాస వేగాలు పెరగటం మొదలుపెడతాయి, అదే సమయంలో చెమట తగ్గటం మూలంగా శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు. సుమారు 5% నుండి 6% నీటి క్షయంతో, ఒక వ్యక్తి నిస్సత్తువగా మరియు నిద్రమబ్బుగా అవవచ్చు, తలనొప్పులు మరియు వికారంలను అనుభవించవచ్చు, మరియు అవయవాలలో జలదరింపుగా అనిపించవచ్చు (పరేస్తేసియా). 10% నుండి 15% ద్రవ క్షయంతో, కండరాలు అసంబద్ధంగా సంకోచ వ్యాకోచాలకు గురి అవవచ్చు, చర్మం శుష్కించి ముడుతలు పడవచ్చు (చర్మ నిగారింపు తగ్గుతుంది), చూపు మందగించవచ్చు, మూత్ర విసర్జన బాగా తగ్గి బాధాకరం అవవచ్చు, మరియు సన్నిపాతం మొదలవవచ్చు. 15% కన్నా ఎక్కువ క్షయములు సాధారణంగా ప్రాణాంతకంగా ఉంటాయి.

50 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల శరీరంలో, దాహంగా అనిపించటం తగ్గుతుంది మరియు వయస్సుతో పాటు తగ్గుతూ ఉంటుంది. అనేక మంది పెద్దవారు ఈ నిర్జలీకరణ లక్షణాలతో బాధ పడతారు. హైపర్థెర్మియా (అధిక శరీర ఉష్ణోగ్రత) తో కూడిన నిర్జలీకరణము అత్యంత వేడి వాతావరణములో ముసలి వారి మరణానికి దారితీస్తుంది.

జీర్ణ వాహిక యొక్క వ్యాధులు అనేక రకాలుగా నిర్జలీకరణమునకు దారితీయగలవు. అలా కాకుండా స్వయం-నియంతృత వ్యాధులలో, నిర్జలీకరణము ఒక పెద్ద సమస్య అవుతుంది. ద్రవ క్షయం ప్రాణానికే ప్రమాదం కలిగించేంత తీవ్రంగా అవవచ్చు.

అవసాన దశలో ఉండి మరణాన్ని కోరుకునే రోగుల కొరకు నొప్పుల కొరకు సమృద్ధిగా మందులను అందించినప్పుడు, నిర్జలీకరణం ద్వారా మరణం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది, మరియు ఏమాత్రం బాధ ఉండదు అని అనేక అధ్యయనాలు నిరూపించాయి.[6][7][8][9][10][11]

చికిత్స

కలరా ద్వారా వచ్చిన నిర్జలీకరణాన్ని మెరుగుపరుచుకోవటానికి ఆ రోగిని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ త్రాగమని నర్సులు ప్రోత్సహిస్తారు.

స్వల్పమైన నిర్జలీకరణమునకు నీరు త్రాగటం మరియు ద్రవ క్షయమును నివారించటం ఉత్తమమైన మార్గం. ద్రావిత స్థాయిలు సంపూరితమవటానికి ముందే దాహాన్ని ఆటంకపరుస్తూ, సాదా నీరు రక్తపు రసి యొక్క పరిమాణాన్ని మాత్రం భర్తీ చేస్తుంది.[12] ఘనాహారం వాంతులు మరియు అతిసారం ద్వారా ద్రవ క్షయానికి దోహదం చేస్తుంది.[13]

మరింత తీవ్రమైన సందర్భాలలో, అవసరమైన నీరు ఎలెక్ట్రో లైట్ల భర్తీ ద్వారా ఒక నిర్జలీకరణ స్థితిని బాగు చేయవచ్చు (ఓరల్ రీహైడ్రేషన్ థెరపి లేదా ఇంట్రావెనస్ థెరపి ద్వారా రీహైడ్రేషన్). మంచి నీరు అస్సలు దొరకని సందర్భాలలో కూడా (ఉదాహరణకు, సముద్రంలో లేదా ఎడారిలో), సముద్రపు నీరు లేదా మూత్రమును సేవించటం ఏమాత్రం ఉపయుక్తం కాదు, అదేవిధంగా మధ్యం సేవించటం కూడా. సముద్రపు నీటి ద్వారా అకస్మాత్తుగా శరీరంలోనికి ప్రవేశించిన ఉప్పు కణములను నిర్జలీకరించి మూత్రపిండములపై భారం పెంచి వాటిని పని చేయకుండా చేస్తుందని ఒక ఆలోచన, కానీ మూత్రపిండాలు విఫలమవటం మొదలవటానికి ముందు ఒక సాధారణ వ్యక్తి రోజుకు 0.1 లీటర్ల వరకు సముద్రపు నీటిని త్రాగగలడని గణించబడింది.[ఆధారం చూపాలి]

మూర్ఛ, స్పృహ కోల్పోవటం, లేదా తీవ్రంగా ఆటంకపరిచే వేరే లక్షణం ఉన్న తీవ్రమైన నిర్జలీకరణ సందర్చాలలో (ఆ రోగి సరిగా నిలబడలేడు మరియు ఆలోచించలేడు), వారిని వెంటనే పట్టించుకుని చికిత్స చేయటం అవసరం. భర్తీ చేయబడిన ఎలెక్ట్రోలైట్స్ యొక్క సరైన సమతుల్యాన్ని కలిగి ఉన్న ద్రవాలు ఎలెక్ట్రోలైట్ స్థితిని క్రమం తప్పక బేరీజు వేస్తూ నోటి ద్వారా కానీ లేదా నరముల ద్వారా కానీ ఇవ్వబడతాయి; అత్యంత క్లిష్టమైన సందర్భాలలో తప్పించి సాధారణంగా అందరికీ పూర్తి స్వస్థత చేకూరుతుంది.

నిర్జలీకర్ణమును తప్పించుకొనటం

తగినంత నీరు త్రాగటం ద్వారా నిర్జలీకరణమును నుండి చక్కగా తప్పించుకొనవచ్చు. స్వేదం ద్వారా ఎంత ఎక్కువ నీరు క్షయం అవుతుందో, ఆ లోటును భర్తీ చేయటానికి మరియు నిర్జలీకరణమును తప్పించుకోవటానికి అంతకన్నా ఎక్కువ నీటిని సేవించాలి. శరీరంలోని నీటి మొత్తంలో ఎక్కువ కొరతను లేదా అధికమును శరీరం భరించలేదు కనుక, నీటి వినియోగం దాని క్షయంతో దాదాపు సమంగా ఉండాలి (ఇంకొక రకంగా చెప్పాలంటే, ఎవరికైనా చెమట పడుతూ ఉంటే, వాళ్ళు తరుచుగా కొంత నీరు తాగుతూ ఉండాలి). ఒకేసారి ఎక్కువ మోతాదులో నీరు తాగకుండ గంటకోకసారి 150 నుండి 180 మి.లీ. చొప్పున నీరు తాగుతూ ఉంటె నిర్జలీకర్ణము తప్పించుకొనవచ్చును.

ఎక్కువగా చెమట పట్టని రోజువారీ కార్యక్రమాలలో, హైడ్రేషన్ (నీటి స్థాయిని) ను నిలకడగా ఉంచటానికి దాహంగా ఉన్నప్పుడు నీరు త్రాగటం సరిపోతుంది. అయినప్పటికీ, వ్యాయాయం సమయంలో, కేవలం దాహం పైన ఆధారపడటం నిర్జలీకరణం రాకుండా చూసుకోవటానికి సరిపోదు. ముఖ్యంగా వేడి పర్యావరణములలో, లేదా 65 సంవత్సరాల కన్నా పెద్ద వయస్సు వారిలో ఇది నిజం. ఒక వ్యాయామ కార్యక్రమం కొరకు, ఆ వ్యాయామ సమయంలో ఎంత ద్రవం క్షయం అయిందో తెలుసు కోవటానికి ఆ వ్యాయామ కార్యక్రమానికి ముందు మరియు తర్వాత కచ్చితమైన బరువు కొలతలు తీసుకోవటం ద్వారా, ఆ సమయంలో ఎంత పరిమాణంలో ద్రవాన్ని స్వీకరించాలో కచ్చితంగా తెలుస్తుంది.[14][15][16][17][18]

శరీర అవసరాలకు మించి నీటిని త్రాగటం మోతాదులో చేసినప్పుడు కొద్ది ప్రమాదం సంభవిస్తుంది, ఎందుకనగా మూత్రపిండాలు భద్రతా దృష్ట్యా అదనపు నీటిని అంతటినీ మూత్రం ద్వారా సమర్ధవంతంగా తొలగిస్తాయి.

యునైటెడ్ కింగ్డం వంటి సమశీతోష్ణ వాతావరణములో ఒక సాధారణ దినంలో ఒక వ్యక్తి యొక్క శరీరం, సుమారు 2.5 లీటర్ల నీటిని కోల్పోతుంది.[ఆధారం చూపాలి] ఊపిరితిత్తుల ద్వారా నీటి ఆవిరిగా, చర్మం ద్వారా స్వేదంగా, లేదా మూత్రపిండముల ద్వారా మూత్రంగా ఇది జరుగుతుంది. కొంత నీరు (అతిసారం లేనప్పుడు, చాలా కొద్ది పరిమాణం) ప్రేవుల ద్వారా కూడా క్షయం అవుతుంది. అయినప్పటికీ, వెచ్చని లేదా తేమ వాతావరణములలో లేదా అధిక పరిశ్రమ సమయంలో, స్థూలత్వ క్రమాన్ని బట్టి లేదా మరింత ఎక్కువగా చెమట పట్టటాన్ని బట్టి నీటి క్షయం పెరగవచ్చు; వీటన్నింటి ద్వారా వచ్చే నేటి కొరతను కచ్చితంగా భర్తీ చేయాలి. క్లిష్టమైన సందర్భాలలో, ఆహార నాళము నుండి నీటిని పీల్చటంలో శరీరం యొక్క సామర్ధ్యాన్ని అధిగమించేత గొప్పగా ఈ క్షయాలు ఉంటాయి; ఈ సందర్భాలలో, హైడ్రేటెడ్ (శరీరంలో తగినంత నీటితో ఉండటం) గా ఉండటానికి తగినంత నీరు త్రాగటానికి అవకాశం లేదు, మరియు నిర్జలీకరణమును తప్పించుకోవటానికి ఏకైక మార్గం ప్రీ-హైడ్రేట్ (ముందుగానీ అధిక మొత్తంలో నీటిని స్వీకరించటం),[16] లేదా చెమట తగ్గే మార్గాలను అన్వేషించటం (విశ్రాంతి తీసుకోవటం, చల్లని ప్రదేశానికి వెళ్ళటం, మొదలైనవి.)

వేడి లేదా తేమ వాతావరణాలలో లేదా అలసట కలిగించే పనులలో నిర్జలీకరణమును తప్పించుకొనటానికి మూత్రవిసర్జన తరుచుదనాన్ని మరియు దాని స్వభావాన్ని గమనిస్తూ ఉండటం చాలా అవసరం. ఎవరికైనా ప్రతి 3-5 గంటలకు ఒకసారి మూత్రానికి వెళ్ళవలసి వస్తే మరియు మూత్రం కేవలం తేలిక రంగులో కానీ లేదా తెల్లగా కానీ ఉంటే, నిర్జలీకరణ అవకాశములు చాలా తక్కువ; మూత్రం ముదురు వర్ణంలో ఉండి, మూత్రవిసర్జన చాలా గంటల తర్వాత కానీ లేదా అసలు జరగకుండా కానీ ఉన్నట్లయితే, సరైన హైడ్రేషన్ ను నిలుపుకోవటానికి చాలినంత నీటిని తీసుకుంటూ ఉండకపోవచ్చు.

చెమటపట్టటం ద్వారా ఎక్కువ పరిమాణంలో నీరు క్షయమవుతూ దానిని త్రాగటం ద్వారా సమంగా భర్తీ అవుతూ ఉన్నప్పుడు, ఎలెక్ట్రోలైట్ సంతులనాన్ని సరిగ్గా నిలుపుకోవటం ఒక సమస్య అవుతుంది. స్వేదం దృష్ట్యా హైపర్టానిక్ లేదా హైపోటానిక్ ద్రవాలను సేవించటం, నీటి లబ్ధి యొక్క మొత్తం ఘనపరిమాణం పెరగటం వలన ఉపేక్షించటానికి వీలుకాని పరిణామాలకు (ప్రధానంగా హైపోనట్రేమియా లేదా హైపర్నట్రేమియా) దారి తీయవచ్చు.

వాంతులు లేదా అతిసారం వంటి అసాధారణ స్థితుల మూలంగా నీరు క్షయం అవుతూ ఉంటే, ఒక అసంతులనం చాలా త్వరగా ఒక వైద్య అత్యవసరంగా వృద్ధి చెందవచ్చు.

మారథాన్ ల వంటి క్రీడా ఘట్టాల సమయంలో, క్రీడాకారులలో నిర్జలీకరణమును నివారించటానికి నీటి మజిలీలు మరియు నీటి విరామములు ఏర్పాటు చేయబడతాయి.

ఇవి కూడా చూడండి

సూచనలు

గమనికలు

 1. TheFreeDictionary.com --> dehydration Citing The American Heritage Science Dictionary 2005. Retrieved on July 2, 2009
 2. MedicineNet > Definition of Hypovolemia Retrieved on July 2, 2009
 3. TheFreeDictionary.com --> hypovolemia Citing Saunders Comprehensive Veterinary Dictionary, 3 ed. Retrieved on July 2, 2009
 4. నిర్జలీకరణ లక్షణాలు - నీరు త్రాగటం వలన ప్రయోజనాలు - ద్రవ అసంతులనం యొక్క చిహ్నాలు
 5. Bean, Anita (2006). The Complete Guide to Sports Nutrition. A & C Black Publishers Ltd. pp. 81–83. ISBN 0713675586.
 6. Ganzini L, Goy ER, Miller LL, Harvath TA, Jackson A, Delorit MA (2003). "Nurses' experiences with hospice patients who refuse food and fluids to hasten death". The New England Journal of Medicine. 349 (4): 359–65. doi:10.1056/NEJMsa035086. PMID 12878744. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 7. McAulay D (2001). "Dehydration in the terminally ill patient". Nursing Standard (Royal College of Nursing (Great Britain) : 1987). 16 (4): 33–7. PMID 11977821.
 8. Van der Riet P, Brooks D, Ashby M (2006). "Nutrition and hydration at the end of life: pilot study of a palliative care experience". Journal of Law and Medicine. 14 (2): 182–98. PMID 17153524. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 9. Miller FG, Meier DE (1998). "Voluntary death: a comparison of terminal dehydration and physician-assisted suicide". Annals of Internal Medicine. 128 (7): 559–62. PMID 9518401. Unknown parameter |month= ignored (help)
 10. Printz LA (1992). "Terminal dehydration, a compassionate treatment". Archives of Internal Medicine. 152 (4): 697–700. doi:10.1001/archinte.152.4.697. PMID 1373053. Unknown parameter |month= ignored (help)
 11. Sullivan RJ (1993). "Accepting death without artificial nutrition or hydration". Journal of General Internal Medicine. 8 (4): 220–4. doi:10.1007/BF02599271. PMID 8515334. Unknown parameter |month= ignored (help)
 12. "Formulating carbohydrate-electrolyte drinks for optimal efficacy." Murray, R. & Stofan, J. (2001).
 13. "హెల్త్ వైజ్ హ్యాండ్ బుక్," హెల్త్ వైజ్, Inc. 1999
 14. "Water, Water, Everywhere". WebMD.
 15. Dr. Mark Dedomenico. "Metabolism Myth #5". MSN Health.
 16. 16.0 16.1 "Exercise and Fluid Replacement". American College of Sports Medicine.
 17. Nancy Cordes. "Busting The 8-Glasses-A-Day Myth". CBS.
 18. ""Drink at Least 8 Glasses of Water a Day" - Really?". Dartmouth Medical School.

వెలుపలి వలయాలు

మూస:Fluid, electrolyte, acid base metabolic pathology