నిర్మలానందనాథ స్వామీజీ

From tewiki
Jump to navigation Jump to search
నిర్మలానందనాథ స్వామీజీ
SriSriSri Nirmalanandanatha Swamiji.jpg
వ్యక్తిగత వివరాలు
జననం(1969-07-20)1969 జూలై 20
చీరనహళ్ళి, గుబ్బి తాలూకా, తుముకూరు జిల్లా
మతంహిందూ మతం
తత్త్వంనాథ సంప్రదాయం
మతపరమైన వృత్తి
గురువుబాలగంగధరనాథ స్వామీజీ
Disciples
  • లక్షలాది మంది
సాహితీ సేవలుసంపాదకుడు, ఆదిచుంచనగిరి మాస పత్రిక

నిర్మలానందనాథ స్వామీజీ ఆదిచుంచనగిరి మఠానికి అధిపతి. [1]

నిర్మలానందనాథ స్వామి 1969 జూలై 20 న కన్నడ వోక్కలిగా (ఇప్పుడు) తుముకూరు జిల్లా, గుబ్బి తాలూకాలోని చీర్నహళ్లి అనే గ్రామంలో నర్సేగౌడ, నంజమ్మలకు జన్మించాడు. [2] అతడికి నాగరాజా అనే పేరుపెట్టారు. ప్రభుత్వ వృత్తి విద్య కళాశాల (తుమ్కూర్) లో డిప్లొమా చేసిన తరువాత, మైసూరు ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్‌ విభాగంలో బిఇ చదివాడు. తరువాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో ఎం.టెక్ చేశాడు. పూనా లోని కేంద్ర జలవనరుల అభివృద్ధి, జలవిద్యుత్తు పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. కానీ, అతను రామనగర జిల్లా లోని ఒక అంధ పాఠశాలలో బోధించడానికి స్వచ్ఛందంగా ఎంచుకున్నాడు. 1998 లో అతను ప్రాపంచిక జీవితాన్ని త్యజించి స్వామీజీ అయ్యాడు. బాలగంగదరనాథ స్వామీజీ అతన్ని చిక్కబల్లపుర వద్ద ఆదిచుంచనగిరి మఠ శాఖకు అధిపతిగా నియమించాడు.

2013 జనవరి 13 న బాలగంగదరనాథ స్వామి మరణించినప్పటి నుండి నిర్మలానందనాథ స్వామీజీ ఆదిచుంచనగిరి మఠానికి అధిపతిగా ఉన్నాడు. [3]

మూలాలు

  1. "Hoping that these blessings convert into votes". The Hindu. Retrieved 22 January 2015.
  2. "MTech from IIT is mutt head". Deccan Herald.
  3. http://acmbgs.org/mahaswamiji-sri-nns/