నీలం చెవుల లోరీ

From tewiki
Jump to navigation Jump to search

నీలం చెవుల లోరీ
Eos semilarvata -San Diego Zoo-5.jpg
సాన్ డిగో జూ వద్ద ఆహరం తీసుకోవటం.
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
E. semilarvata
Binomial name
Eos semilarvata
Bonaparte, 1850

దస్త్రం:LC.JPG

నీలం చెవుల లోరీ,ఇయోస్ సెమిలార్వాటాలేదా శనగపచ్చ లోరీ,హాఫ్ మాస్క్డ్ లోరీ,సెరమ్ లోరీ అనే ఈ చిలుక ఇండోనేషియా లోని మలుకు ప్రాంతంలోని సెరమ్ దీవిలోఉంటాయి పరిమాణంలో నీలం చెవుల లోరీ చిన్నది.24సెం.మీ.పొడవు ఉంటుంది.దీనికి ఎర్రని శరీరం ఉండి,బుగ్గలు,గడ్డం,చెవులు నీలం రంగులో ఉంటాయి.ముదురు నీలం రంగులో పొట్ట,తోక లోపలి భాగం ఉంటాయి.రెక్కల చివర్లు నలుపు రంగులో ఉంటాయి.పెద్ద వాటికి నారింజ రంగు ముక్కు ఉండి,చిన్న వాటికి లేత గులాబి రంగు ముక్కు ఉంటుంది. సముద్ర మట్టానికి 1600-2000మీ.ఎత్తులో సాధారణంగఅ ఉన్నా అప్పుడప్పుడూ 800మీ.ఎత్తులో కూడా కనిపిస్తుంది.పుష్పాలని చెట్ల చిగుర్లని తిని బతికే ఇవి చిన్న గుంపులుగా తిరుగుతాయి. దానికున్న చిన్న నివాస పరిధిలో ఎక్కువగా కనిపించే ఈ చిలుక ఉనికి గురించి భయపడనవసరం లేని స్థాయిలో ఉంది.


మూలాలు

  • BirdLife International (2008). Eos semilarvata. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 20 March 2009.
  • Juniper & Parr (1998) Parrots: A Guide to Parrots of the World; ISBN 0-300-07453-0.
  • "Species factsheet: Eos semilarvata". BirdLife International (2008). Retrieved 20 March 2009. Unknown parameter |dateformat= ignored (help)