"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నీలిమా మిశ్రా

From tewiki
Jump to navigation Jump to search

నీలిమా మిశ్రా మెగసెసే అవార్డు గ్రహీత. మహారాష్ట్రలో నిరుపేదల రుణదాతగా పేరొందిన సామాజిక ఉద్యమకారిణి. వివాహం చేసుకోకూడదని 13 ఏళ్ల వయసులోనే నిశ్చయించుకొని జీవితాన్ని గ్రామీణ భారత సేవకు అంకితమిచ్చిన అవివాహిత. పుణేలో సైకాలజీలో పీజీ పూర్తిచేశారు. ఎనిమిదేళ్ల పాటు విజ్ఞాన్ ఆశ్రమ్ లో పనిచేశారు. ఎదుటి వాళ్లకు మనం చేసే సహాయం వాళ్లలో ఇతరులపై ఆధారపడే స్వభావాన్ని పెంచకూడదనేది నీలిమ సిద్ధాంతం. డజనుకు పైగా అవార్డులు పొందిన నీలిమ వాటి ద్వారా వచ్చిన సొమ్మును వివిధ సహాయ కార్యక్రమాలకు కేటాయించారు. మెగసెసె అవార్డు ద్వారా వచ్చే 22 లక్షలను ‘భాగిని నివేదిత గ్రామీణ్ విజ్ఞాన్ నికేతన్’ సంస్థకు కేటాయించారు. సూక్ష్మ రుణాల సాయంతో పేద మహిళలు తమ జీవితాల్ని తమంతట తామే మెరుగుపరచుకునేలా చైతన్యం నింపారు. నీలిమ తన పెళ్ళి కోసం దాచిన తల్లి నగలను అమ్మి అలా వచ్చిన రూ.3 లక్షలతో నాలుగు కంప్యూటర్లు, వస్తువులను కొనుగోలు చేశారు.నీలిమ ప్రారంభించిన 'భాగిని నివేదిత గ్రామీణ విజ్ఞాన నికేతన్‌ (బీఎన్‌జీవీఎన్‌)' సంస్థ ప్రస్తుతం 10 వేల మంది మహిళలతో ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు, రుణ సౌకర్యాలు లేకపోవడమే పెద్ద సమస్య అని నీలిమ వాదిస్తారు.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).