"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నూతక్కి రామశేషయ్య

From tewiki
Jump to navigation Jump to search

నూతక్కి రామశేషయ్య ప్రముఖ పరిపాలనా దక్షులు, పారిశ్రామిక వేత్త. వీరి పూర్వీకులు గుంటూరు జిల్లా చిలువూరు గ్రామానికి చెందినవారు. అయినా వీరు ఒడిషాలో స్థిరపడ్డారు.

వీరు న్యాయశాస్త్రాన్ని చదివి, విజయవాడలో కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. తరువాత జైపూర్ సంస్థానంలో అసిస్టెంటు దివానుగా, తరువాత దివానుగా నియమితులయ్యారు.

వెలగపూడి రామకృష్ణ గారు స్థాపించిన పరిశ్రమలను వీరు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలో రాజకీయంగా పలుకుబడి సంపాదించి 1952 సంవత్సరంలో పార్వతీపురం లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత జైపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఒడిషా శాసనసభకు ఎన్నికయ్యారు. ఒడిషా ప్రభుత్వంలో ఆరోగ్య శాఖామంత్రిగా పనిచేశారు.

వీరికి సాహిత్యం మీద ఎంతో అభిమానం ఉండేది. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి 'దీపావళి' ఖండకావ్య సంపుటిని వీరికి అంకితమిచ్చారు.

వీరు 1969 సంవత్సరం జూన్ 1 వ తేదీన నిర్యాణం చెందారు.