"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నూనె గింజలను పరీక్షించు పద్ధతులు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Oil 017.jpg
ఒక నూనె పరిశ్రమ లోని ప్రయోగ శాల

అధిక భాగం వంట నూనె లను నూనెగింజల నుండి తీయుదురు. పామాయిల్, అలివ్ ఆయిల్ వంటి నూనెలను పళ్ళగుజ్జునుండి తీయుదురు. నూనెగింజల నుండి నూనెను తీయు పరిశ్రమలవారు మొదట నూనెగింజలను సేకరించునప్పుడు తమ పరిశ్రమలో ఉన్న క్వాలిటి కంట్రోల్ లాబొరేటరిలో సేకరించు విత్తనాల నమూనాలను (sample) పరీక్షించిన పిదప మాత్రమే కొనుగోలు చేస్తారు. అలాగే రిఫైండ్‍ ఆయిల్ ఉత్పత్తిచేయు పరిశ్రమవారు కూడా తాము రిఫైండ్ చేయుటకై సేకరించు ముడి వంటనూనెను (crude edible oil) తమ ప్రయోగశాల (quality control laboratory) లో తగు పరీక్షలు చేసి కావలసిన ప్రమాణాలు కలిగి ఉన్నప్పుడే కొనుగోలు చేయుదురు. అలాగే తమ రిఫైనరీలో ఉత్పత్తి అయిన రిఫైండ్ ఆయిల్‍ వంటనూనెకు ఉండవలసిన భౌతిక రసాయనిక లక్షణాలు ద్రువీకరణ చేసుకున్న తరువాత మార్కెట్‍కు విడుదలచేయుదురు. అందుచే నూనె పరిశ్రమలలో నూనెగింజలను, నూనెలను పరీక్షించడం అతి ముఖ్యము. ఇందుకై నూనె పరిశ్రమలలో నూనెలను, నూనెగింజలను పరీక్షించు అన్ని రకాల పరికరాలు ఉన్న లాబొరేటరి (ప్రయోగశాల/క్వాలిటి కంట్రోల్) తప్పనిసరిగా ఉండును. ఈ పరీక్షలు నిర్హహించుటకు సైన్సులో పట్టభద్రులై, పరీక్షించు పద్ధతులపై శిక్షణ పొందినవారు ఉంటారు. వీరిని అనలిస్ట్స్ (Analysts) లేదా కెమిస్ట్ (chemist) లు అంటారు.

నిర్వహించు పరీక్షలు

1.నూనె గింజలలోని తేమశాతం (% of moisture content)

2.నూనె గింజలలోని నూనె శాతం (% of oil/fat content)

3.నూనె గింజలలోని మాంసకృత్తులు (% of proteins)

4.నూనెగింజలలోని పీచు శాతం (% of crude fiber)

5.నూనె గింజలలోని సాండ్/సిలికా శాతం (% of sand/silika content)

6. నూనె గింజలోని పాడైన గింజలు, ఇతరములు (refractions, impurities)

1. తేమశాతమును నిర్ణయించుట

నూనెగింజలలోని తేమ శాతమును (Determination of moisture content) గుర్తించుటకు/నిర్ణయించుటకు ప్రస్తుతం 3 విధానాలున్నాయి.

1. ఎయిర్ ఒవెన్ పద్ధతి (air oven method)

2. మాయిశ్చర్‍ బాలెన్స్ (moisture Balance) పద్ధతి.

3. డిజిటల్ మాయిశ్చర్ మీటరు.

en:Oilseed