"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నేలబొగ్గు

From tewiki
Jump to navigation Jump to search

తరిగిపోయే ఇంధన వనరుల్లో నేల బొగ్గు ఒకటి. ఇది శిలాజ ఇంధనం. ఈ శిలాజ ఇంధనాలు జీవుల నుండి యేర్పడ్డాయి. సుమారు మూడు వందల మిలియన్ల సంవత్సరాల పూర్వం భూభాగం పై నున్న తేమ నేలల్లోని మహా వృక్షాలు భూగర్భంలో కూరుకు పోయి నేలబొగ్గుగా మారాయి.
భూపటలం లోని మార్పులు, భూగర్భంలోని అత్యధిక ఉష్ణం, పీడనాల వల్ల నేలబొగ్గు క్రమేపి "పీట్, లిగ్నైట్(38% కర్బనం),బిటుమినస్ బొగ్గు(65% కర్బనం), చివరికి ఆంత్రసైటు(96% కర్బనం)" గా మారాయి.
నేల బొగ్గు ప్రధానంగా కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువుల్ని స్వల్ప పరిమాణంలో గంధకము పరమాణువుల్ని కల్గి ఉంటుంది.
బిట్యుమినస్ బొగ్గు నుండి కోక్ ను తయారుచేస్తారు. ఇది ఒక ఉత్తమ ఇంధనం. ఉత్తమ శ్రేణి కోక్ బ్లాస్ట్ కొలిమికి తగినంత ఇంధనం.
కోక్ చాలా ఖరీదైన ఇంధనం. 10 టన్నుల బిట్యూమినస్ కోల్ నుండి 7 టన్నుల కోక్ లభిస్తుంది. నేలబొగ్గు నిల్వలు చాలా పరిమితం. నేలబొగ్గును మండించటం వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యము యేర్పడుతుంది.