"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నైమిశము

From tewiki
Jump to navigation Jump to search

ఒక అడవి. తొల్లి మరీచి, అత్రి, భృగు, వసిష్ఠుఁడు, క్రతువు, అంగిరసుఁడు - వీరి వంశజులు అగు ఆఱు తెగలవారు తాము తపము ఆచరింప తావుచూపుము అని బ్రహ్మను వేడఁగా అతఁడు మనోమయ చక్రమును ఒకటిని సృజియించి దానిని దొర్లించి వారల కాంచి 'మీరు ఈ చక్రము వెన్నంటి చనుఁడు, అది ఎచట నిలుచునో అదియె మీకు తపస్సుచేయుటకు తగినచోటు అగును' అని ఆనతిచ్చెను. అది పోవుచు పోవుచు ఒకచోట నేమి (అనఁగా చక్రపు ఇనుపకట్టు) వదలి తట్టుపడెను. ఆస్థలము నైమిశము అన పరఁగెను. ఈనైమిశము పురాణ ప్రసిద్ధమైన అరణ్యము. పెక్కండ్రు ఋషులు అనేక సంవత్సరములు ఇచట తపము ఆచరించుటవలన దీనిని మహాపుణ్యక్షేత్రము అని కొనియాడుదురు.