"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పంపన సూర్యనారాయణ

From tewiki
Jump to navigation Jump to search

డా. పంపన సూర్యనారాయణ సంస్కృతాంధ్ర భాషా పండితుడు.

జీవన సంగ్రహం

డా: పంపన సూర్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా తాళ్లపొలంలో 1945 అగస్టు 1 న జన్మించాడు. పాలకొల్లు దగ్గర కొన్నాళ్ళు తెలుగు పండితునిగా చేసి, తరువాత పెద్దాపురంలోని మహారాణి కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరి, చివరివరకూ అక్కడే పనిచేసాడు. 2002 డిసెంబరు 7 న న మరణించాడు.

ఉన్నత విద్య

ఉన్నత విద్య గురువులు గుత్తుల శ్రీరాములు, ప్రాథమిక సంస్కృత గురువులు, పంపన రామారావు, దవ్వూరి వీరభద్ర స్వామి, ఎర్రగుంట సుబ్రహ్మణ్యం.
భాషా ప్రవీణ
చిననిండ్రకొలను., పశ్చిమ గోదావరి జిల్లా.
ఆంధ్ర సాహిత్య గురువులు
డా: ఆకురాతి పున్నారావు.
తర్క విద్యా గురువులు
సూరికుచ్చి రామనాథం.
ఎం.ఎ.: ఆంధ్ర విశ్వవిద్యాలయము, విశాఖ పట్నము.

ప్రసిద్ధ పద్యాలు

పంపనకు ప్రసిద్ధ తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ అంటే అభిమానం. ఆయన గురించి పంపన చెప్పిన చాటువు:[1]

తెలుగు సాహిత్య సత్కృషీవలులయందు

వేయి యెకరాల భూస్వామి విశ్వనాథ

వారి పొలమున పండని పంట లేదు

పండినది యెల్ల పసిడి కాకుండలేదు

పెద్దాపురం గురించి ఆయన ఆశువుగా చెప్పిన పద్యం:

సీ||

ఇట పాండవుల మెట్ట ఇతిహాసముల పుట్ట వత్సవాయి పతుల ప్రభల పట్టు

ఇటనేన్గులక్ష్మణ కృత సుభాషితములు తెలుగుటెదల త్రుప్పుడులిచికొట్టు

ఇటు పట్టువస్త్రాల కితరదేశాధీశ పత్నులు సైతంబు పట్టుబట్టు

ఇట మరిడమ్మయూరేగు నుత్సవము సమస్త కళాపూజ కాటపట్టు

తే.గీ||

బుచ్చి సీతమ్మ ఈవి పెంపును నిలిపెడి

సత్రశాల వెంబడి కళాశాల వెలయ

తనవని మురిసిపోవు పెద్దాపురంబు

కడు పురాతన సంస్థాన ఘనత కలిగి

రచనలు

  1. నిరుద్యోగ శతకము
  2. వస్తాదు రాజు జీవిత చరిత్ర
  3. శ్రీమద్రామాయణ కల్పవృక్షం - పద్య శిల్పం
  4. పంపన వారి చాటువులు
  5. సర్దార్ పాపన్న
  6. విశ్వనాథ వారి భక్తి - దేశభక్తి
  7. గౌతమీ కోకిల - వేదుల సాహిత్య వసంతం[1]

మూలాలు

గౌతిమి కోకిల: వేదుల సాహిత్య వసంతం. ప్రథమ ముద్రణ, 1992, విశాలాంధ్ర పబ్లిషింగ్.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).

  1. 1.0 1.1 ""కవి పరిచయం"".