"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పట్టిసం
పట్టిసం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | పోలవరం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | {{#property:P1082}} |
- పురుషులు | 2,382 |
- స్త్రీలు | 2,410 |
- గృహాల సంఖ్య | 1,434 |
పిన్ కోడ్ | 534315 |
ఎస్.టి.డి కోడ్ |
పట్టిసం, పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 534 315. నిజానికి ఇది ఒక గ్రామంగా లెక్కలలో ఉన్నా ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఈ క్షేత్రము కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉంది. చారిత్రకంగానూ, ఆధ్యాత్మికంగానూ విశేషమైన స్థానం కలదీ పట్టిసం. పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యదికంగా చిత్రణ జరిపే మంచి అందాలుగల దేవాలయం ఇది. ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ తీర్ధము లేదా తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.
Contents
- 1 క్షేత్ర చరిత్ర
- 2 గ్రామ నామ చరిత్ర
- 3 ఆలయాలు
- 4 గణాంకాలు
- 5 విద్యా సౌకర్యాలు
- 6 వైద్య సౌకర్యం
- 7 తాగు నీరు
- 8 పారిశుధ్యం
- 9 సమాచార, రవాణా సౌకర్యాలు
- 10 మార్కెటింగు, బ్యాంకింగు
- 11 ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
- 12 విద్యుత్తు
- 13 భూమి వినియోగం
- 14 నీటిపారుదల సౌకర్యాలు
- 15 ఉత్పత్తి
- 16 సౌకర్యాలు
- 17 చేరుకొనే విధం
- 18 చిత్రమాలిక
- 19 గణాంకాలు
- 20 మూలాలు
- 21 ఇతర లింకులు
క్షేత్ర చరిత్ర
పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమాన పరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు . వీరభద్రుడిని సృష్టించి, దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన 'పట్టసం' ( పొడవైన వంకీ కత్తి ) తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ . పట్టిసీమనీ . పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు.
గ్రామ నామ చరిత్ర
దక్షుని తలను నరికేందుకు వీరభద్రుడు ఉపయోగించిన పట్టసం అనే ఆయుధం పేరు మీదుగా ఈ గ్రామానికి పట్టిసం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. ఈ గ్రామానికి పట్టిసీమ, పట్టసాచలం, పట్టిసం అనే పేర్లు వాడుకలో ఉన్నాయి.[2]
ఆలయాలు
శ్రీవీరభద్రస్వామి ఆలయం
శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రానికి, శ్రీ భూ నీలా సమేత భావనారాయణస్వామి క్షేత్ర పాలకుడు. కనకదుర్గ అమ్మవారు . శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారు ఇక్కడ గ్రామదేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ . పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలందుకుంటూ వుంటారు.
దేవకూట పర్వతం
దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక 'దేవకూట పర్వతం' పై ప్రళయతాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో, ఆ గుండం నుంచి 'భద్రకాళి' ఆవిర్భవించింది. దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని నోట కరుచుకుని నమిలి మింగేశాడు. దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో, తన వామ నేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట. ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. వీరభద్ర భద్రలాళీస్వరూప భీకరరౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతలకోరిక మీద అక్కడకు వచ్చిన అగస్త్యమహర్షి వీరభద్రుడిని వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు వీరభద్రుడి ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకూట పర్వతం మీద భద్రకాళీమాతతో వెలిసాడు.ఇక్కడ వెలసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాలళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు. అలాగే శ్రీ భూ నీలా సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు. ఈ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వరస్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతిగుర్తులు కనిపిస్తుంటాయని అంటారు.
- శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని ప్రతీతి.
- పరశు రాముడు కూడా వీరేశ్వరుడిని దర్శించుకునే మోక్షాన్ని పొందాడని తెలుస్తోంది.
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4844.[1] ఇందులో పురుషుల సంఖ్య 2425, మహిళల సంఖ్య 2419, గ్రామంలో నివాసగృహాలు 1205 ఉన్నాయి. పట్టిసం పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పోలవరం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1434 ఇళ్లతో, 4792 జనాభాతో 985 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2382, ఆడవారి సంఖ్య 2410. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 553 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 19. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588108[3].పిన్ కోడ్: 534315.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పోలవరంలోను, ఇంజనీరింగ్ కళాశాల కొవ్వూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ రాజమండ్రిలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొయ్యలగూడెంలోను, అనియత విద్యా కేంద్రం పోలవరంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమండ్రి లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
పట్టిసంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
పట్టిసంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫే / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
పట్టిసంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 25 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 42 హెక్టార్లు
- బంజరు భూమి: 12 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 906 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 13 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 905 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
పట్టిసంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు
- కాలువలు: 248 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 405 హెక్టార్లు
- చెరువులు: 252 హెక్టార్లు
ఉత్పత్తి
పట్టిసంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
సౌకర్యాలు
మునుపు దేవాలయము శిథిలమవడము వలన కొత్తగా దేవాలయ నిర్మాణము చేసారు. దేవాలయము చుట్టూ అందమైన తోటలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతున్నారు. ఒకప్పుడు కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయము పై బాగమునందు కూడా మంచి సౌకర్యాలు ఏర్పడినవి. ఉండేందుకు గదులు నిర్మించారు. త్రాగుగునీటి వసతులు. బోజనశాలలు ఏర్పడినవి. గోదావరి పడవల రేవు, స్నానాలరేవులను కొత్తగా ఏర్పాటు చేసారు.
చేరుకొనే విధం
విమానం
రాజమండ్రిలోని కోరుకొండ విమానాశ్రయం ఇక్కడికి సమీపము. ఈ క్షేత్రం రాజమండ్రి నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిరోజూ రాజమండ్రి నుండి బస్సులు ఉన్నాయి. ట్యాక్సీలు విరివిగా లభించును. లేదా ప్రకృతి ప్రేమికుల కొరకు వివిధ ఆఫీసుల ద్వారా గోదావరిపై లాంచీల ద్వారా స్పీడు బోట్ల ద్వారా చేరుకొను వీలు ఉంది. రాజమండ్రి నుండి గల మరొక సర్వీసు పాపికొండల టూర్. ఈ టూర్లో తప్పక పట్టిసీమ చేర్చబడి ఉంటుంది. కానీ ఇందుకు గోదావరిలో నీరు సరిపడా నిలవుండాలి.
రైలు
రాజమండ్రి లేదా నిడదవోలులో రైలు దిగవచ్చు. కొవ్వూరు రైలు స్టేషను అతిసమీపము కానీ అక్కడ తగినన్ని రైళ్ళు ఆగవు. రైల్వే కూడలైన నిడదవోలు నుండి పోలవరము వెళ్ళు బస్సులు కూడా పట్టిసం మీదుగా వెళతాయి.
రహదారి
కొవ్వూరు నుండి గోదావరి గట్టుమీదగా ఇక్కడికి చేరుకోవచ్చు.
చిత్రమాలిక
- Pattiseema Temple.jpg
శ్రీ వీరభధ్రస్వామి దేవాలయము వెనుక భాగము దేవస్థానం, పట్టిసీమ
- Pattiseema 1.jpg
శ్రీ వీరభధ్రస్వామి దేవాలయ ఆవరణలో నందీశ్వరుడు
- Pattiseema 2.jpg
శ్రీ వీరభధ్రస్వామి దేవాలయ ప్రధాన ముఖద్వారము
- పట్టిసం-ఏనుగుకొండ.JPG
పట్టిసం దగ్గర ఏనుగుకొండ (గజేంద్రమోక్ష ఘటనా స్థలము)
- పట్టిసం-నవగ్రహాలు.JPG
పట్టిసం గుడిలో నవగ్రహాలు
- పట్టిసం-నామాలు.JPG
నామాలుగా విద్యుల్లతలు
- పట్టిసం-పిల్లలు.JPG
లాంచిలో పిల్లలు
- పట్టిసం-విద్యుల్లతలు.JPG
గోదారి దాటుతున్న విద్యుల్లతలు
- పట్టిసం-హనుమంతుడు.JPG
హనుమంతుని విగ్రహం
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 4,792 - పురుషుల సంఖ్య 2,382 - స్త్రీల సంఖ్య 2,410 - గృహాల సంఖ్య 1,434
మూలాలు
- ↑ 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2013-11-15.
- ↑ బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35. Check date values in:
|date=
(help) - ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".